కాళిదాసు కోటేశ్వరరావు

కాళిదాసు కోటేశ్వరరావు, ప్రముఖ రంగస్థల హాస్య నటులు.

కాళిదాసు కోటేశ్వరరావు
జననం1925
గుంటూరు జిల్లా, తెనాలి
ఇతర పేర్లుకాళిదాసు కోటేశ్వరరావు
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు
Notes
భవనం వెంకట్రామ్ అధ్యక్షతన తెనాలి లో కోటేశ్వరరావుకు కనకాభిషేకం జరిగింది.

కోటేశ్వరరావు 1925వ సంవత్సరంలో తెనాలి లోని నిరుపేద కుటుంబంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

తొలినాళ్లలో ఎమ్యూజ్ మెంట్ పార్కుల్లో హాస్యపాత్రధారిగా పనిచేశారు. ఆ తరువాత తన సహచరుల ప్రోత్సాహంతో నాటకాలలో హాస్యపాత్రలు వేశారు. ఎన్ని పాత్రలు పోషించినా బాలనాగమ్మలో తిప్పడు, చింతామణిలో సుబ్బిశెట్టి పాత్రలు ఈయనకు పేరు తెచ్చాయి. 1967లో గోపాలకృష్ణ నాట్యమండలిని స్థాపించి, మాస్టర్ గిరి, రాధారాణి, తిరుపతి కుమారి, శకుంతల మొదలైన వారితో కలిసి బృందావనం అనే నాటకాన్ని తయారుచేసి, ప్రదర్శించారు.

నటించిన నాటకాలు - పాత్రలు

మార్చు
  • కాళిదాసు - కాళుడు
  • బాలనాగమ్మ – తిప్పడు
  • చింతామణి - సుబ్బిశెట్టి
  • వరవిక్రయం - సింగరాజు లింగరాజు
  • సక్కుబాయి - కాశీపతి
  • తులాభారం - వసంతకుడు

ఇతర వివరాలు

మార్చు

విజయవాడ లో జరిగిన వీరి షష్ఠిపూర్తి మహోత్సవంలో సుంకర కనకారావు, జైహింద్ ప్రెస్ సుబ్బయ్య, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి పాల్గొన్నారు. అప్పటి విద్యాశాఖామంత్రి భవనం వెంకట్రామ్ అధ్యక్షతన తెనాలి లో కోటేశ్వరరావుకు కనకాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్నపనేని వెంకట్రావ్, మోదుకూరి జాన్సన్, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, కన్నెగంటి నాసరయ్య, బొల్లిముంత శివరామకృష్ణ, నేతి పరమేశ్వర శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి కాళిదాసు కోటేశ్వరరావు తొలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

తెనాలిలోని స్వరాజ్ థియేటర్ ఎదురుగా అభిమానులచే కాళిదాసు కోటేశ్వరరావు కాంస్య విగ్రహం నెలకొల్పబడింది.

మూలాలు

మార్చు
  • కాళిదాసు కోటేశ్వరరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, పుట. 163.