కావ్యాస్ డైరీ

వి. కరుణ ప్రకాష్ దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు చలనచిత్రం

కావ్యాస్ డైరీ 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని మంజుల, సంజయ్ స్వరూప్ నిర్మాణ సారథ్యంలో వి. కరుణ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘట్టమనేని మంజుల, ఇంద్రజిత్, చార్మీ కౌర్, సత్యం రాజేష్, శశాంక్ నటించగా, మను రమేషన్ సంగీతం అందించాడు.[1] రూ. 4 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 1992 హాలీవుడ్ థ్రిల్లర్ ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రెడిల్ సినిమా ఆధారంగా రూపొందించబడింది.[2]

కావ్యాస్ డైరీ
దర్శకత్వంవి. కరుణ ప్రకాష్
రచనఇందిరా ప్రొడక్షన్స్ క్రియేటీవ్ యూనిట్
నిర్మాతఘట్టమనేని మంజుల, సంజయ్ స్వరూప్
తారాగణంఘట్టమనేని మంజుల, ఇంద్రజిత్, చార్మీ కౌర్, సత్యం రాజేష్, శశాంక్
ఛాయాగ్రహణంశ్యాయ్ దత్
సంగీతంమను రమేషన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
5 జూన్ 2009
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్రూ 4 కోట్లు

కథా నేపథ్యం మార్చు

రాజ్ (ఇంద్రజీత్), పూజ (మంజుల స్వరూప్) వివాహితులు, వారు తమ పిల్లలతో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారు. నానీ తమ పిల్లలను చూసుకోవటానికి పూజ ప్రాణాలను కాపాడిన తరువాత, నిరుద్యోగి అయిన కావ్యను నియమించుకుంటారు. కావ్య కుటుంబానికి దగ్గరవుతుంది. వారు ఆమెను తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటుంటారు. పూజ్యపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆత్మహత్య చేసుకున్న గైనకాలజిస్ట్ భార్యనే కావ్య అని తెలుస్తుంది. ఇతర రోగుల మాటలు పడలేక చివరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని రక్షించే ప్రయత్నంలో, కావ్యకు గర్భస్రావం అవుతుంది. ఆమె చివరికి అ కుటుంబాన్ని నాశనం చేయడానికి, పూజాను చంపడానికి ప్రయత్నిస్తుంది.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled

ఈ చిత్రానికి మను రమేషన్ సంగీతం సమకూర్చారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా సాటలు విడుదల చేశారు.[3]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎన్నో ఎన్నో"అనంత శ్రీరామ్గీతా మాధురి, ప్రణవి3:07
2."హాయిరే హాయిరే"అనంత శ్రీరామ్హేమచంద్ర4:45
3."తెలుసుకో"అనంత శ్రీరామ్కార్తీక్, రీటా త్యాగరాజన్4:08
4."ఓ ప్రాణమా"అనంత శ్రీరామ్ఎం. ఎం. శ్రీలేఖ, పార్థసారథి4:28
5."పో వెళ్ళి పో"రామజోగయ్య శాస్త్రిటిప్పు4:01
Total length:20:29

మూలాలు మార్చు

  1. http://www.idlebrain.com/movie/archive/mr-kavyasdiary.html
  2. http://www.idlebrain.com/movie/archive/mr-kavyasdiary.html
  3. "Kavya's Diary - All Songs - Download or Listen Free - Saavn".

ఇతర లంకెలు మార్చు