కుంజా భిక్షం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. భారత కమ్యూనిస్టు పార్టీ తరపున బూర్గంపహాడ్‌ (పాత) నియోజకవర్గం నుంచి 1989, 1994లో రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు.[1]

కుంజా భిక్షం
కుంజా భిక్షం


నియోజకవర్గం బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
1989 – 1994

వ్యక్తిగత వివరాలు

మరణం 24 ఏప్రిల్, 2021
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ
నివాసం హైదరాబాద్

భిక్షం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామంలో జన్మించాడు. భిక్షంకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

అశ్వాపురంలోని హెవీవాటర్‌ ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేసిన భిక్షం, భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. పార్టీలో కీలకనేతగా ఎదిగిన పోషించిన భిక్షం, సీపీఐ తరఫున 1989లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా 46,179 ఓట్లతో, 1994లో మరోసారి సీపీఐ తరపున పోటీచేసి 56,946 ఓట్లు సాధించి గెలుపొందాడు.[2] 365 గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాడు. పినపాక మండలం నుంచి కొత్తగూడెం వరకు ఉన్న సుమారు 200 గ్రామాల్లో రోడ్లు వేయించాడు. ఆదివాసీ సమస్యలపై నిరంతర పోరాటాలను కొనసాగించాడు. సీపీఐలో తలెత్తిన విభేదాల వల్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే భిక్షంను సీపీఐ సస్పెండ్‌ చేసింది. 1994లో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో కొంతకాలం పనిచేశాడు.[3] ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి కొంతకాలం పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఒకసారి జడ్పీటీసీగా, స్వతంత్ర ఆభ్యర్థిగా పినపాక ఆసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడు.[4]

భిక్షం మెదడు సంబంధిత వ్యాధికి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో 2021, ఏప్రిల్ 24న మరణించాడు. భిక్షం మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావులోపాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఏప్రిల్ 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.[5]

మూలాలు

మార్చు
  1. సమయం తెలుగు, తెలంగాణ (25 April 2021). "బూర్గుపహాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత". Samayam Telugu. Shaik Begam. Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  2. The New Indian Express, Telangana (25 April 2021). "Ex-MLA K Biksham dies at 65". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  3. సాక్షి, తెలంగాణ (25 April 2021). "బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత". Sakshi. Archived from the original on 25 April 2021. Retrieved 24 September 2021.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (25 April 2021). "బూర్గంపాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత". andhrajyothy. Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (24 April 2021). "మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత". Namasthe Telangana. Archived from the original on 25 April 2021. Retrieved 24 September 2021.