కుట్టి శ్రాంక్
షాజీ ఎన్. కరుణ్ దర్శకత్వంలో 2010లో విడుదలైన మలయాళ సినిమా
కుట్టి శ్రాంక్, 2010 జూలై 23న విడుదలైన మలయాళ సినిమా. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బిగ్ మోషన్ పిక్చర్స్[1] బ్యానరులో షాజీ ఎన్. కరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి, కమలిని ముఖర్జీ, పద్మప్రియ, మీనాకుమారి, వహిదా, సురేష్ కృష్ణ తదితరులు నటించారు.[2] ఈ సినిమాకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు మరో నాలుగు అవార్డులు గెలుచుకుంది.
కుట్టి శ్రాంక్ | |
---|---|
దర్శకత్వం | షాజీ ఎన్. కరుణ్ |
స్క్రీన్ ప్లే | పిఎఫ్ మాథ్యూస్, హరికృష్ణన్ |
కథ | షాజీ ఎన్. కరుణ్ |
నిర్మాత | మహేష్ రామనాథన్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బిగ్ మోషన్ పిక్చర్స్ |
తారాగణం | మమ్ముట్టి, కమలిని ముఖర్జీ, పద్మప్రియ, మీనాకుమారి, వహిదా, సురేష్ కృష్ణ |
ఛాయాగ్రహణం | అంజులి శుక్లా |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఐజాక్ థామస్ కొట్టుకపల్లి |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బిగ్ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 23 జూలై, 2010 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
నటవర్గం
మార్చు- మమ్ముట్టి (కుట్టి శ్రాంక్)
- కమలిని ముఖర్జీ (పెమెన్నా)
- పద్మప్రియ (రేవమ్మ)
- మీనాకుమారి (కాశీ)
- వహిదా (నళిని)
- సురేష్ కృష్ణ (లోనీ)
- సాయి కుమార్ (ఉన్నితాన్)
- సిద్దిక్ (జోనాస్ అచన్)
- పి. శ్రీకుమార్ (పాస్కల్)
- పిడి సతీష్ చంద్ర (మూప్పెన్)
- అమిత్ ఎ (జోప్పన్)
- మాయ విశ్వనాథ్ (మాధవి)
- ఎంబి పద్మకుమార్ (నీలన్)
- కుందార జానీ
- వల్సాల మీనన్
- గౌరవ్ మౌద్గిల్ (ప్రసన్న)
- ఎం.ఏ.బాలాచంద్రన్ (కరణ్)
- గోపాలకృష్ణన్ (అపున్నీ)
- వల్సల మీనన్ (పారు)
- నందు (విష్ణు)
అవార్డులు
మార్చు57వ భారత జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కుట్టి శ్రాంక్ సినిమాకు ఐదు అవార్డులు వచ్చాయి.[3][4]
- ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం: మహేష్ రామనాథన్, రిలయన్స్ బిగ్ పిక్చర్స్ (నిర్మాత), షాజీ ఎన్. కరుణ్ (దర్శకుడు)
- జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారం (ఒరిజినల్): పిఎఫ్ మాథ్యూస్, హరికృష్ణన్
- జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం: అంజులి శుక్లా (కెమెరా), అడ్లాబ్స్ ఫిల్మ్స్ లిమిటెడ్ (ప్రాసెసింగ్ లాబొరేటరీ)
- జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ పురస్కారం: జయకుమార్
- స్పెషల్ జ్యూరీ అవార్డు (ఫీచర్ ఫిల్మ్): శ్రీకర్ ప్రసాద్ (ఎడిటింగ్)
- ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్స్
- ఉత్తమ నటుడు - మమ్ముట్టి
ప్రదర్శన
మార్చు- మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్, 2009
- బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2009
- ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2009
- భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2009
- దుబాయ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2009
విడుదల
మార్చుఈ సినిమా 2010, జూలై 23న 38 థియేటర్లలో విడుదలైంది.
మూలాలు
మార్చు- ↑ Settu Shankar. "Meera Jasmine as Mammootty's lady love!". Oneindia. Archived from the original on 2012-07-11. Retrieved 2021-06-22.
- ↑ "Kutty Srank: The Sailor of Hearts (2009)". Indiancine.ma. Retrieved 2021-06-22.
- ↑ "Big B wins National Award for Paa". The Times of India. 15 September 2010. Archived from the original on 3 November 2012. Retrieved 2021-06-22.
- ↑ "List of National Award Winners". Press Information Bureau.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కుట్టి శ్రాంక్
- నౌరన్నింగ్.కామ్ కుట్టి శ్రాంక్ Archived 2021-06-18 at the Wayback Machine
- ఇండియాగ్లిట్జ్.కామ్‌లో కుట్టి శ్రాంక్ ప్రివ్యూ Archived 2008-08-01 at the Wayback Machine
- కమలీనీ ముఖర్జీతో ఇంటర్వ్యూ
- సినిమా డిఓపి అంజులి శుక్లాతో ఇంటర్వ్యూ
- 'కుట్టి శ్రాంక్' లో మ్యాజిక్ ఆఫ్ లవ్