కమలిని ముఖర్జీ
కమలిని ముఖర్జీ దక్షిణ భారతీయ సినిమా నటి.
కమలినీ ముఖర్జీ | |
---|---|
![]() | |
జననం | కమలినీ ముఖర్జీ 1984 మార్చి 4 కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
వృత్తి | నటీమణి |
క్రియాశీల సంవత్సరాలు | 2004–present |
ఎత్తు | 5'5" |
బాల్యం, నాటకాభిలాషసవరించు
కమలిని ముఖర్జీ (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 1984 లో కలకత్తాలో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత ముంబాయి పట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, చిత్రలేఖనం కమలినికి ప్రీతిపాత్రమైనవి. పెక్కు సంవత్సరాలు భరత నాట్యం అభ్యాసం చేసింది. నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కోబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాలలో నటించింది.
సినిమాలలో అవకాశంసవరించు
కమలినిని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రంలో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కథా నేపథ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలినికు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సుకు ఆహ్వానించిన 150 మందిలో కమలిని ఉంది. అదే సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో కథానాయిక అవకాశం రావటంతో సినిమా వైపే మొగ్గు చూపింది.
అవార్డులుసవరించు
ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాలలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ, మలయాళం ఇంకా కన్నడ చిత్రాలలో నటించింది. ఆనంద్ చిత్రంలో రూప పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది.
నటించిన తెలుగు చిత్రాలుసవరించు
- ఆనంద్ (2004) - రూప
- మీనాక్షి (2005) -మీనాక్షి
- గోదావరి (2006) -సీతా మహాలక్ష్మి
- స్టైల్ (2006) - ప్రియ
- రాఘవ (2006) -కయల్విఝి రాఘవన్ (తమిళ అనువాద చిత్రం)
- క్లాస్ మేట్స్ (2007) -రజియా
- హ్యాపీ డేస్ (2007) -శ్రీయ
- పెళ్ళైంది కానీ (2007) -గాయత్రి
- బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008) -అర్పిత
- జల్సా (2008) -ఇందు
- గమ్యం (2008) - జానకి
- గోపి గోపిక గోదావరి (2009) - గోపిక
- మా అన్నయ్య బంగారం (2010) - మంజు
- పోలీస్ పోలీస్ (2010) - హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
- నాగవల్లి (2010)[1] - గాయత్రి
- విరోధి (2011) -సునీత (అతిథి పాత్ర)
- రామాచారి (2013)
- మన్యంపులి (2016)
మలయాళ సినిమాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.