కృష్ణప్ప గౌతమ్

కర్ణాటకకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు

కృష్ణప్ప గౌతమ్, కర్ణాటకకు చెందిన క్రికెట్ ఆటగాడు. 2021, జూలైలో భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1] తండ్రి ఎం. కృష్ణప్ప కబడ్డీలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు.[2]

కృష్ణప్ప గౌతమ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1988-10-20) 1988 అక్టోబరు 20 (వయసు 36)
బెంగళూరు, కర్ణాటక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 238)2021 జూలై 23 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.55
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12–ప్రస్తుతంకర్ణాటక
2017ముంబై ఇండియన్స్
2018–2019రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 7)
2020కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 25)
2021చెన్నై సూపర్ కింగ్స్
2022లక్నో సూపర్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 32 32 49
చేసిన పరుగులు 737 400 454
బ్యాటింగు సగటు 18.89 21.05 14.64
100s/50s 1/2 0/1 0/2
అత్యధిక స్కోరు 149 57* 60
వేసిన బంతులు 6434 1639 852
వికెట్లు 116 51 32
బౌలింగు సగటు 25.56 25.62 33.03
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 7 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0
అత్యుత్తమ బౌలింగు 7/72 5/28 4/19
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 6/– 16/–
మూలం: Cricinfo, 7 ఆగస్టు 2021

కృష్ణప్ప గౌతమ్ 1988, అక్టోబరు 20న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

బెంగుళూరులో జరిగిన అండర్-15 జోనల్ టోర్నమెంట్‌కు ఎంపికైనప్పుడు తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడ రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[3] 2012 నవంబరులో తన మొదటి రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపునబెంగాల్‌పై ఆడి, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు.

2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో గౌతమ్ ఢిల్లీ, అస్సాంకు వ్యతిరేకంగా వరుసగా రెండు ఐదు వికెట్లు సాధించాడు. తరువాతి ఆటలో తన కెరీర్-బెస్ట్ ఫిగర్స్ 7/108 సాధించాడు.[4]

2017 ఫిబ్రవరిలో గౌతమ్‌ని 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు 2 కోట్లకు కొనుగోలు చేసింది.[5] 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6]

2017 అక్టోబరులో గౌతమ్ 2017–18 రంజీ ట్రోఫీలో అస్సాంపై కర్ణాటక తరపున బ్యాటింగ్ చేస్తూ తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు.[7]

2018 జనవరిలో గౌతమ్‌ను 2018 ఐపిఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.[8][9] 2018 అక్టోబరులో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం భారతదేశం బి జట్టులో ఎంపికయ్యాడు.[10]

2019 ఆగస్టు 23న శివమొగ్గ లయన్స్‌తో బళ్లారి టస్కర్స్ తరఫున కర్ణాటక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో, గౌతమ్ 56 బంతుల్లో 134 పరుగులు చేసి 15 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు. అయితే, కేపీఎల్‌లోని మ్యాచ్‌లకు పూర్తి ట్వంటీ-20 హోదా లేదు.[11][12] 2019 అక్టోబరులో 2019–20 దేవధర్ ట్రోఫీ కోసం భారతదేశం బి జట్టులో ఎంపికయ్యాడు.[13]

2021 జనవరిలో ఇంగ్లాడ్‌తో జరిగిన సిరీస్ కోసం భారత టెస్టు జట్టులో ఐదుగురు నెట్ బౌలర్లలో గౌతమ్ ఒకరిగా ఎంపికయ్యాడు.[14] 2021 ఫిబ్రవరిలో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపిఎల్ వేలంలో గౌతమ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.[15] 9.25 కోట్ల ధరతో గౌతమ్ ఐపిఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయ్యాడు.[16]

2021 జూన్ లో గౌతమ్ శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం భారత వన్డే ఇంటర్నేషనల్,ట్వంటీ 20 ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు.[17] 2021 జూలై 23న శ్రీలంకపై భారతదేశం తరపున తన వన్డేలోకి అరంగేట్రం చేసాడు.[18] మినోద్ భానుకను ఔట్ చేసి తొలి అంతర్జాతీయ వికెట్ తీశాడు.[19]

2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసింది.[20]

మూలాలు

మార్చు
  1. "Krishnappa Gowtham". ESPNcricinfo. Retrieved 2023-08-09.
  2. Dani, Bipin. "Krishnappa Gowtham". Retrieved 2023-08-09 – via PressReader.
  3. Gopalakrishnan, Akshay (4 November 2016). "Bowling like Harbhajan, and lessons from Prasanna". ESPNcricinfo. Retrieved 2023-08-09.
  4. "Gowtham grabs seven as Karnataka win with bonus point". ESPNcricinfo. 30 October 2016. Retrieved 2023-08-09.
  5. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  6. "Vijay Hazare Trophy, Group D: Jharkhand v Karnataka at Kolkata, Feb 25, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  7. "Karnataka, Delhi eye bonus-point wins". ESPN Cricinfo. 16 October 2017. Retrieved 2023-08-09.
  8. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  9. "Whatever I've dreamt of, I can now fulfill - Gowtham". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  10. "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  11. Penbugs (23 August 2019). "Krishnappa Gowtham scores 134 and takes 8/15 in a single T20 match". Penbugs. Archived from the original on 2019-08-23. Retrieved 2023-08-09.
  12. "Krishnappa Gowtham scores 134 and takes 8/15 in a single T20 match". Indian Express. 23 August 2019. Retrieved 2023-08-09.
  13. "Deodhar Trophy 2019: Hanuma Vihari, Parthiv, Shubman to lead; Yashasvi earns call-up". SportStar. 24 October 2019. Retrieved 2023-08-09.
  14. "Kohli, Hardik, Ishant return to India's 18-member squad for England Tests". ESPN Cricinfo. 19 January 2021. Retrieved 2023-08-09.
  15. "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  16. "IPL Auction 2021: Chris Morris and Krishnappa Gowtham set new records". Six Sports. Archived from the original on 2022-07-09. Retrieved 2023-08-09.
  17. "Shikhar Dhawan to captain India on limited-overs tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  18. "3rd ODI (D/N), Colombo (RPS), Jul 23 2021, India tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  19. "Spinners, Avishka Fernando, Bhanuka Rajapaksa give Sri Lanka vital Super league points". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  20. "IPL Auction 2022: From K Gowtham to Dushmantha Chameera, full list of players bought by Lucknow Super Giants - Firstcricket News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 13 February 2022. Retrieved 2023-08-09.

బయటి లింకులు

మార్చు