కె. మదన్ మోహన్ రావు

కొండయ్యగారి మదన్ మోహన్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కె. మదన్ మోహన్ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు జాజుల సురేందర్
నియోజకవర్గం ఎల్లారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 15 జూన్ 1969
మోస్రా,మొస్రా మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కె. రాజేశ్వర రావు
జీవిత భాగస్వామి ప్రతిమ
సంతానం కార్తీక్, తాన్వి
నివాసం ఇంటి.నెం. 8-2-293/82/F-11/A/66/1, రోడ్ నెం.10, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

కె. మదన్ మోహన్ రావు 1969లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మొస్రా మండలం, మోస్రా గ్రామంలో జన్మించాడు. ఆయన 1984లో పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో మోస్రాలో, 1986లో ఇంటర్మీడియట్ కామారెడ్డిలోని జీవీఎస్ జూనియర్ కాలేజీలో, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 1993లో బీఎస్సీ & 1996లో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి 2017లో అమెరికాలోని ది వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేసి యూ.ఎస్.ఎం బిజినెస్ సిస్టమ్ సంస్థను స్థాపించి, ఛైర్మన్‌గా ఉన్నాడు.

రాజకీయ జీవితం మార్చు

మదన్ మోహన్ రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి ఆ తరువాత 11 మార్చి 2016న టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ తరువాత ఆ ఆపార్టీకి రాజీనామా చేసి, 2018 మే 25న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌ చేతిలో 6229 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2]

మదన్ మోహన్ రావు తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్ పై 24001 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు మార్చు

  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Firstpost (2019). "Zahirabad Elections 2019: Telangana Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.