జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో కలిపారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గములు కూడా ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గ స్థానే ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు (జహీరాబాదు, ఆందోల్, నారాయణ్‌ఖేడ్) ఉండగా నిజామాబాదు జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో కలిపి మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో బి. బి. పాటిల్ గెలుపొందాడు.
దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములుసవరించు
- జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గం
- ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం
- కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం
- నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం
- ఆంధోల్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
నియోజకవర్గపు గణాంకాలుసవరించు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులుసవరించు
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ N.A N.A N.A N.A N.A N.A N.A 2009 5 జహీరాబాదు జనరల్ సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 395767 సయ్యద్ యూసుఫ్ ఆలీ పు తె.రా.స 378360
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున శివకుమార్ లింగాయత్ పోటీ చేసారు.[2] పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ యూసఫ్ అలీ పోటీలో ఉన్నాడు.[3] కాంగ్రెస్ పార్టీ టికెట్ సురేశ్ షెట్కార్‌కు లభించింది.[4] సురేశ్ సమీప తె.రా.స పార్టీ పత్యర్థి అయిన యూసుఫ్ ఆలీ పై విజయం సాధించాడు.
2014 ఎన్నికలుసవరించు
మూలాలుసవరించు
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009