కెకె
భారతీయ గాయకుడు
(కేకే నుండి దారిమార్పు చెందింది)
కెకె గా ప్రసిద్ధుడైన కృష్ణకుమార్ కున్నత్ (1968, ఆగస్టు 23 - 2022, మే 31) ఒక భారతీయ గాయకుడు. ప్రముఖంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కుపైగా పాటలు పాడాడు.[2]
కృష్ణకుమార్ కున్నత్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | కెకె, కె. కె, కేకే |
జననం | ఢిల్లీ | 1968 ఆగస్టు 23
మరణం | 2022 మే 31[1] కలకత్తా, పశ్చిమ బెంగాల్ | (వయసు 53)
సంగీత శైలి | నేపథ్య గానం, ఇండీపాప్, రాక్ సంగీతం |
వృత్తి | గాయకుడు, సంగీత దర్శకుడు, గేయ రచయిత |
వాయిద్యాలు | గాత్ర సంగీతం |
క్రియాశీల కాలం | 1996–2022 |
వెబ్సైటు | అధికారిక వెబ్ సైటు ట్విటర్ పేజీ |
వ్యక్తిగత జీవితం
మార్చుకృష్ణకుమార్ ఆగస్టు 23, 1968న ఢిల్లీ లో మలయాళీ దంపతులైన సి. ఎస్. నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించాడు.[3][4] అతని విద్యాభ్యాసం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ పాఠశాల,[5] ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలయైన కిరోరి మాల్ కళాశాలలో సాగింది.[6]
తెలుగు పాటలు
మార్చుకెకె పాడిన కొన్ని ప్రాచుర్యం పొందిన తెలుగు పాటలు.
సినిమా | పాట |
---|---|
స్టూడెంట్ నంబర్ 1 | ఒకరికి ఒకరై ఉంటుంటే |
ఆర్య | ఫీల్ మై లవ్ |
ఇంద్ర | దాయి దాయి దామ్మా |
గుడుంబా శంకర్ | లే లే లే లే ఇవాళే లేలే |
శంకర్ దాదా ఎంబిబిఎస్ | చైల చైల చైలా చైలా |
నేనున్నాను | నీ కోసం నీ కోసం |
జయం | ప్రేమ ప్రేమా ప్రేమా |
సంతోషం | దేవుడే దిగివచ్చినా |
జై చిరంజీవ | హే జాణ |
ఘర్షణ | చెలియా చెలియా |
నా ఆటోగ్రాఫ్ | గుర్తుకొస్తున్నాయి |
బంగారం | చెడుగుడంటే భయ్యం |
సైనికుడు | గో గో అదిగో |
మరణం
మార్చు53 ఏళ్ళ కెకె 2022 మే 31న నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల ప్రదర్శన తరువాత కోల్‌కతాలోని ది గ్రాండ్ హోటల్‌లో గుండెపోటుతో మరణించాడు.[7][8][9] లైవ్ కన్సర్ట్ లో ఆయన చివరి సారిగా ‘హమ్ రహే యా నా రహే యాడ్ ఆయెంగే యే పల్’ అనే పాటను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.[10]
మూలాలు
మార్చు- ↑ K, K. "Hindustan Times KK Death". Retrieved 31 May 2022.
- ↑ "The right note". The Hindu. 9 December 2006. Retrieved 2 October 2017.
- ↑ Lasrado, Richie (25 November 2006). "A Kandid Konversation with KK". Daijiworld.com. Archived from the original on 23 August 2017. Retrieved 8 January 2018.
- ↑ R, Balaji (6 June 2005). "The KK factor". The Hindu. Archived from the original on 5 November 2012. Retrieved 8 January 2018.
- ↑ "KK sang 3,500 jingles before Bollywood break". Sify movies. 28 April 2009. Archived from the original on 12 April 2015. Retrieved 8 January 2018.
- ↑ "KK". www.saavn.com. Retrieved 2017-12-15.
- ↑ "Bollywood playback singer KK passes away at the age of 53 owing to cardiac arrest". Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-31.
- ↑ "Singer KK Dies After Concert In Kolkata". NDTV. 31 May 2022.
- ↑ Sakshi (1 June 2022). "సింగర్ కేకే హఠాన్మరణం:విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి". Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.
- ↑ "The singer KK died in Kolkata after a concert, Tributes Pour in - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-06-01. Retrieved 2022-06-01.