కొండపల్లి కోట, కృష్ణా జిల్లా, విజయవాడకు సమీపంలో ఉన్న ఒక శిథిలమైన కోట. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.

కొండపల్లి కోట
Part of కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Vijayawada-Kondapalli Quilla.jpg
రాజభవన వీక్షణం
Fourcourt.JPG
భవనం ముందు భాగం
కొండపల్లి కోట is located in Andhra Pradesh
కొండపల్లి కోట
కొండపల్లి కోట
Coordinates16°37′31″N 80°31′50″E / 16.625283°N 80.530667°E / 16.625283; 80.530667Coordinates: 16°37′31″N 80°31′50″E / 16.625283°N 80.530667°E / 16.625283; 80.530667[1]
TypeFort
Site information
Controlled byఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
Conditionశిథిలాలు
Site history
Built14వ శతాబ్దం
Built byముసునూరి కమ్మ రాజులు
Materialsగ్రానైటు రాళ్ళు, సున్నం
Battles/warsముసునూరి కమ్మ రాజులు, కొండపల్లి కమ్మరాజులు, ఒరిస్సాకు చెందిన గజపతులు, కుతుబ్ షాహీ వంశం, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ సుల్తానులు, ఆంగ్లేయులు

చరిత్రసవరించు

ముసునూరి కమ్మ రాజులు కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు.అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు.

ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా, కొల్లూరులో శాసనం వేయించాడు. ముసునూరు (పెమ్మసాని), గుంటుపల్లి, అడపా, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 300 ఏళ్లు ఈ కోటని పాలించారు. ఈ కమ్మ వంశాల రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.

కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం - ఇవన్నీ ఒకే కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతం పునర్నిర్మిస్తున్నారు. సా.శ.1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కమ్మరాజ్య చివరి ప్రభువు పెమ్మసాని తిమ్మనాయుడిని సంహరించి ఈ కోట ఆక్రమించాడు. తరువాత గోల్కొండ నవాబు లు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.

సా.శ. 1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా సా.శ. 1767లో బ్రిటీష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో సా.శ. 1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు.

కొండపల్లి బొమ్మలుసవరించు

 
కొండపల్లి బొమ్మలు

కొండపల్లి కమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది.ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు.ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు