కొల్లేరు సరస్సు

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో ఉన్న మంచినీటి సరస్సు
(కొల్లేరు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలోలో ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది.[3] ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.

కొల్లేరు సరస్సు
కొల్లేరుపై వంతెన
కొల్లేరుపై వంతెన
ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు స్థానం
ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు స్థానం
కొల్లేరు సరస్సు
ప్రదేశంఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు16°39′N 81°13′E / 16.650°N 81.217°E / 16.650; 81.217
సరస్సులోకి ప్రవాహంరామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, పోలరాజ కాలువ
వెలుపలికి ప్రవాహంఉప్పుటేరు
ప్రవహించే దేశాలుభారత దేశం
ఉపరితల వైశాల్యం90,100 హెక్టారులు (222,600 ఎకరం) [1] (245 sq km lake area)
సరాసరి లోతు1.0 మీటరు (3 అ. 3 అం.)
గరిష్ట లోతు2.0 మీటర్లు (6 అ. 7 అం.)
ద్వీపములుకొల్లేరు కోట(Heart of Kolleru Lake), Gudivakalanka
ప్రాంతాలుఏలూరు
గుర్తించిన తేదీ19 August 2002
రిఫరెన్సు సంఖ్య.1209[2]
పెద్దింటి అమ్మవారి దేవస్థానం
కొల్లేరు సరస్సు
కొల్లేరు పెద్దింట్లమ్మవారి ఉత్సవం కొల్లేరు.
కొల్లేరులో పడవప్రయాం.

చరిత్ర

మార్చు
center

రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు భావించాడు. ఈ విషయమై "ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము"లో ఇలా వ్రాశాడు - [4]

ఈ దండకారణ్య మధ్యమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళ వైశాల్యము గల) మహా సరస్సొకటి గలదనియు, అది జల విహంగములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు .... ఆప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు నగస్త్యుడు శ్రీరామ చంద్రునితో జెప్పినట్లు రామాయణమున చెప్పబడినది.... ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్ర దేశములోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యని కొలను మన యాంధ్ర దేశముననే గాని మఱియెచ్చటను గానరాదు.
మఱియు దండియను మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణించుచు నిందొక మహా సరస్సు గలదనియు నది సారస నిలయమనియు నది యాంధ్రనగరికి ననతి దూరముగా నున్నదనియు బేర్కొని యుండుటచేత నట్లభివర్ణింపబడిన కొలను కొల్లేరు గాక మఱియొక్కటి కానేరదు. (ఆంధ్ర నగరి యనగా వేంగి కావచ్చునని చిలుకూరి వీరభద్రరావు అభిప్రాయం). "కొల్లేటికొంగ" యను లోకోక్తియె కొల్లేరు కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్నది. దక్షిణ హిందూస్థానమున నెన్నందగిన పెద్ద తియ్య నీటికొలను "కొల్లేరు" మాత్రమేయై దండి చెప్పినట్లుగా జలరాశి.

రవాణా సౌకర్యాలు

మార్చు

సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో సింగిల్ లైన్ బ్రిడ్జి మీదుగా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.

పెద్దింట్లమ్మ దేవాలయము

మార్చు

కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము ఉంది. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.

మూలాలు, వనరులు

మార్చు
  1. Ramsar Convention Ramsar Convention of Kolleru Lake www.ramsar.org
  2. "Kolleru Lake". Ramsar Sites Information Service. Retrieved 25 April 2018.
  3. The calanoid and cyclopoid fauna (Crustacea Copepoda) of Lake Kolleru, South India[permanent dead link], Hydrobiologia, Volume 119, Number 1 / December, 1984, 27-48
  4. ఆంధ్రుల చరిత్రము - చిలుకూరి వీరభద్రరావు ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల 1-4-0. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా