కౌరవుడు 2000 లో వి. జ్యోతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో నాగబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ చిత్రాన్ని కె. పద్మజ, సాయి వరుణ్‌తేజ్ ఆర్ట్స్ పతాకంపై, అంజనా ప్రొడక్షన్స్ సమర్పణలో నిర్మించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. మోహన్ చంద్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, కె. రాంగోపాల్ రెడ్డి ఎడిటర్ గా వ్యవహరించాడు.

కౌరవుడు
DVD cover
దర్శకత్వంవి. జ్యోతికుమార్
రచనఅంజనా ప్రొడక్షన్స్ యూనిట్ (కథ, స్క్రీన్ ప్లే), చింతపల్లి రమణ (మాటలు)
నిర్మాతకె. పద్మజ (నిర్మాత), మన్యం రమేష్ (ఎక్జిక్యూటివ్ నిర్మాత)
తారాగణంనాగబాబు, రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంమోహన్ చంద్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2000
దేశంభారతదేశం
భాషతెలుగు

సూర్య గ్రామీణ ప్రాంతంలో నివసించే ఒక జమీందారు. అతనికి మహిళలంటే ఎక్కడలేని ద్వేషం. అది ఎంత వరకు వెళుతుందంటే తన ఊర్లో ఉన్న అమ్మవారి దేవాలయాన్ని కూడా మూసివేయించేటంత. రోజంతా ఊర్లో తిరగడం, తప్పులు చేసిన వాళ్ళను సరిదిద్దడం, రాత్రికి ఇంటికి వచ్చి మందు కొట్టడం అతని దినచర్య. ఆ ఊర్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయడంతో ఊరికి ఆయన స్థానంలో కొత్తగా వస్తుంది శశి. అందరికీ సూర్య అంటే హడల్. కానీ ఆమె మాత్రం అతనంటే భయం లేకుండా ఉంటుంది. దాంతో ఇద్దరూ ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఉంటారు.

కొంతకాలానికి శశికి సూర్య సోదరుడు ఒక మహిళ చేసిన ద్రోహం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనీ, తన భార్య అదే కారణం చేత చనిపోయిందనీ అప్పటి నుంచే సూర్య మహిళలంటే ద్వేషం పెంచుకున్నాడనీ తెలుస్తుంది. దీంతో ఆమెకు సూర్య మీద జాలి కలుగుతుంది. ఆమె సూర్య మనసును ఎలాగైనా మార్చాలని అనుకుంటుంది. ఒకసారి సూర్యం కొడుకుని ప్రమాదం నుండి రక్షిస్తుంది. దాంతో సూర్య మనసు మారుతుంది. సూర్య శశిని ప్రేమించడం మొదలు పెడతారు. కానీ ఆమె ఇదివరకే వేరే వ్యక్తిని ప్రేమించిందన్న విషయం తెలిసి విచలితుడవుతాడు. దానికి తోడు గ్రామంలో అతనంటే గిట్టని వాళ్ళు శశి జంట మధ్యలో చిచ్చు పెట్టాడని ఆరోపణలు చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న శశి ఊరు వదిలి వెళ్ళిపోతుంది. కానీ చివరికి తాను కూడా సూర్యని ప్రేమిస్తున్నానని తెలుసుకుని ఇద్దరూ ఒకటవ్వడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు
  • దర్శకత్వం: వి. జ్యోతి కుమార్
  • కథ, స్క్రీన్ ప్లే: అంజనా ప్రొడక్షన్స్ యూనిట్
  • మాటలు: చింతపల్లి రమణ
  • పోరాటాలు: కణల్ కణ్ణన్
  • కూర్పు: కె. రాంగోపాల్ రెడ్డి
  • కెమెరా: మోహన్ చంద్
  • సంగీతం: మణి శర్మ

సంగీతం

మార్చు

ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర, ధర్మతేజ పాటలు రాసారు. సంగీత దర్శకుడు మనీశర్మ 1998 లో కన్నడ మూవీ కౌరవ నుండి కు కు కూ పాటను కాపీ చేసారు, దీనికి అసలు సంగీతం హంసలేఖ.

మూలాలు

మార్చు
  1. "Kauravudu Movie review". fullhyderabad. Archived from the original on 2019-02-03.
"https://te.wikipedia.org/w/index.php?title=కౌరవుడు&oldid=4351453" నుండి వెలికితీశారు