కౌశల్ మండా

భారతీయ నటుడు, మోడల్

కౌశల్ మండా (జ. 1980 మే 13) భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్, సినిమా నటుడు, వ్యాపార ప్రకటనల చిత్ర దర్శకుడు. అతడు అనేక సినిమాలలో నటించాడు. అతడి " ద లుక్స్ ప్రొడక్షన్స్" అనే మోడల్ మేనేజిమెంటు ఏజన్సీకి వ్యవస్థాపకుడు, సి.ఇ.ఓ. అతను భారతదేశంలో సుమారు 230 వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు. తెలుగు సీరియల్ "ఎవ్వని చెదనుంచు (1983)" లో బాల నటుడిగా ప్రముఖ పాత్ర పోషించినందుకు తెలుగు టెలివిజన్ పరిశ్రమలో కౌశల్ మంచి పేరు పొందాడు. జెమిని టెలివిజన్ లో పేరొందిన సీరియల్ "చక్రవాకం (2003-2008) లో ప్రధాన పాత్ర పోషించాడు. డాన్స్ బేబీ డాన్స్ (2005) షోలో అతిథిగా ఉన్నాడు. జీ తెలుగు లోని "సూర్యవంశం" సీరియల్ (2017 -ప్రస్తుతం) లో ప్రధాన పాత్రధారునిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు-2 టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్నాడు. అతడు తెలుగు సినిమాలైన "రాజకుమారుడు (1999)", "మిస్టర్ పెరఫెక్ట్ (2011)" లలో సహాయ పాత్రధారునిగా నటించాడు.[2] బిగ్- బాస్ తెలుగు-2 రియాలిటీ షోలో అనేక మండి అభిమానులను పొందాడు. అతనిని అభిమానించే వర్గం "కౌశల్ ఆర్మీ"గా పిలువబడుతుంది.[3] బిగ్ బాస్ 2లో గెలుపొందిన అతను తనకు బహుమతిగా వచ్చిన నగదును కేన్సర్ బాధితుల కోసం వినియోగిస్తానని గ్రాండ్ ఫినాలే వేదికపై ప్రకటించాడు.

కౌశల్ మండా
కె.ఎల్.ఎం ఫాషన్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కౌశల్
జననం
మండా కౌశల్ ప్రసాద్

(1980-05-13) 1980 మే 13 (వయసు 44)
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటుడు, మోడల్, ఏడ్ ఫిల్మ్‌ డైరక్టర్, టెలివిజన్ హోస్ట్, నృత్యకారుడు, వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జీవిత భాగస్వామినీలిమా కౌశల్
పిల్లలునికుంష్, లల్లీ [1]
వెబ్‌సైటుKaushal Manda

జీవిత విశేషాలు

మార్చు

కౌశల్ 1981 మే 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జన్మించాడు. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యొగి మరియూ నాటక రంగ కళాకారుడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి 2003లో బి.టెక్ పూర్తిచేసాడు. అతను నీలిమా కౌశల్ ను వివాహమాడాడు. అతను పాఠశాల, కళాశాల స్థాయిలలో బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు. అతనికి కళాకారులలో అర్జున్ రాంపాల్ యిష్టమైన మోడల్ గానూ, కమల్ హాసన్ యిష్టమైన నటునిగానూ ఉన్నారు. అతను బాడీ బిల్డర్. అతను గుర్రపు స్వారీ కూడా చేస్తాడు.[1] వీరి కుటుంబం వైజాగ్‌లోని సుజాతా నగర్‌లో ఉండేది. తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. అతను స్కూళ్లో చదువుతున్న రోజుల నుంచి ఆయన తండ్రిలా నటుడు కావాలని తపించాడు. తొలుత మోడలింగ్‌లో అవకాశాలు అందుకున్న ఆయన అనంతరం నటుడిగా మారాడు. మారుతి కార్గో, విజయ్ టెక్స్‌టైల్స్ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనలకు మోడల్‌గా పనిచేసిన అతను మహేశ్ బాబు చిత్రం రాజకుమారుడితో వెండితెరపై కాలుమోపాడు. బుల్లితెరపై పలు ధారావాహికల్లో కౌశల్ నటిస్తున్నాడు. 200కిపైగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన కౌశల్ హైదరాబాద్‌లో సొంతంగా యాడ్ ఏజెన్సీ, ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నాడు.[4] 'లుక్స్' పేరుతో మోడలింగ్ ఏజెన్సీని 1999లో ప్రారంభించాడు. 1999లో మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్లాడు.

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఛానల్
1982- 1984 ఎవ్వని చెదనుంచు బాలనటుడు
1998 గ్రాసిం మిస్టర్ ఇండియా టాప్ 6 పోటీదారు బ్యూటీ పాగంట్
2003- 2008 చక్రవాకం సాగర్ జెమినీ టీవీ
2005 డాన్స్ బేబీ డాన్స్ హోస్ట్ జెమినీ టీవీ
2010 దేవత జెమినీ టీవీ
2011 నం.23 మహాలక్ష్మి నివాసం విక్రం జెమినీ టీవీ
2017- ప్రస్తుతం సూర్యవంశం (సీరియల్) ఆది శంకర్ జీ తెలుగు
2018 బిగ్ బాస్ తెలుగు - 2 పొటిదారు/ విజేత స్టార్ మా

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 https://starsunfolded.com/kaushal-manda/
  2. Devalla, Rani (2013-04-18). "At his creative best". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-08-19.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-05. Retrieved 2018-08-09.
  4. "కౌశల్: బిగ్‌బాస్ 2 విజేత విశేషాలు".

బయటి లంకెలు

మార్చు