ఖలేజా (సినిమా)

2010 సినిమా

ఖలేజా 2010 సెప్టెంబరులో విడుదలైన తెలుగు చిత్రం.[1][2] ఘట్టమనేని మహేశ్ ‌బాబు, అనుష్క,ప్రకాశ్ రాజ్ ప్రధాన తారాగణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. దైవం మానుష రూపేణా అనే భావన చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఓ శక్తివంతుడైన వ్యాపారవేత్త చేతిలో పడి నలిగిపోతున్న పేదలను ఓ టాక్సీ డ్రైవర్ కాపాడటం స్థూలంగా ఈ చిత్ర కథ.

ఖలేజా
ఖలేజా.jpg
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతశింగనమల రమేశ్,
సి. కళ్యాణ్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నటులుఘట్టమనేని మహేశ్ ‌బాబు,
అనుష్క శెట్టి
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంయష్ భట్,
సునీల్ పటేల్
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
పంపిణీదారుగీతా ఆర్ట్స్
విడుదల
సెప్టెంబరు  7, 2010 (2010-09-07)
దేశంభారతదేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ఈ చిత్ర కథ ఒక మారుమూల పల్లె పాలి అనే గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గ్రామంలో జరిగే వరుస మరణాలు గ్రామస్థులను కలవర పెడుతూ ఉంటాయి. గ్రామపెద్ద (రావు రమేష్) సిధ్ధా (షిపి) అనే యువకుడితో ఈ అనర్ధాన్ని ఆపే దైవం కోసం వెతకమని చెబుతాడు. రాజస్ధాన్ పై డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ఒక టెలివిజన్ టీం (సునీల్) కు రాజు (మహేష్) అనే టాక్సీ డ్రైవర్ తారస పడతాడు. రాజు రాజస్థాన్ రావడానికి దారితీసిన పరిస్ధితుల గురించి చెబుతూ తన జీవితంలో తారసపడిన ఒక యువతి (అనుష్క) వలన తను పడిన అగచాట్లు (ఇబ్బందులు) చెబుతాడు. అంతలోనే ఆ యువతి అక్కడ తారస పడుతుంది. రాజస్ధాన్ లో పాకిస్ధాన్ సరిహద్దులకు సమీపంగా ఒక గ్రామంలో తన పని ముగించుకుని తిరిగి వెళ్లబోతుండగా అతని పై దాడి, హత్యా ప్రయత్నం జరుగుతాయి. తన గ్రామాన్ని కాపాడాల్సిన దైవాన్ని వెతుకుతున్న సిధ్దాకి గ్రామపెద్ద చెప్పిన దైవం లక్షణాలు రాజులో కనబడతాయి. రాజును తమ గ్రామం తీసుకు వెళతాడు సిధ్ధ. గ్రామస్థులు రాజుని దైవంగా చూస్తే, రాజు తను దేవుణ్నీ కాదంటాడు. ఆ గ్రామంలో నెలకొల్పిన మెడికల్ కేంప్ ను అర్ధాంతరంగా ముగించడంతో రాజు ప్రారంభించిన శోధనలో ఒకొక్క నిజం బయట పడుతుంది. రాజస్థాన్ గ్రామంలో ఒక జియాలిజిస్ట్ ఆసక్తిని గ్రహించిన ఒక పారిశ్రామిక వేత్త (ప్రకాష్ రాజ్) పరిశోధనకు శాస్త్రవేత్తను ప్రోత్సాహిస్తాడు. పరిశోధన బంగారం కంటే విలువైన ఖనిజం పాలి గ్రామ పరిసరాలలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నదని తెలుస్తుంది. శాస్త్రవేత్త ప్రభుత్వానికి ఈ విషయం తెలియ చేయాలనుకుంటాడు. స్వార్ధపరుడైన పారిశ్రామిక వేత్త అతడిని అడ్డుకుంటాడు. శాస్త్రవేత్తను అతనికి సహాయపడిన రాజస్ధాన్ యువకడిని పారిశ్రామిక వేత్త ప్రభుత్వ కార్యాలయంలో హత్య చేయిస్తాడు.. వాళ్లను అక్కడికి తన టాక్సీలో తీసుకువచ్చిన రాజు ఈ హత్యలకి కారణం అని తెలుసుకొని అతడిని దూరప్రాంతంలో హత్య చేయించడానికి రాజు ఓనర్ని లోబరుచుకొని రాజుని రాజస్ధాన్ పంపుతాడు. పాలీ గ్రామాన్ని సడి లేకుండా ఖాళీ చేయించడానికి గ్రామం సమీపంలో ఉన్న తన ఫ్యాక్టరీ ద్వారా విషాన్ని గ్రామంలో నీటి కాలువలో కలుపుతాడు. దానితో గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తాయి. తన ఎత్తు పారక పోవడంతో పారిశ్రామిక వేత్త అక్కడికి వస్తాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో సినిమా ముగిస్తుంది.

నటీనటులుసవరించు

నిర్మాణంసవరించు

స్క్రిప్టు అభివృద్ధిసవరించు

ప్రీప్రొడక్షన్ సమయంలో స్క్రిప్టు రాసుకోవడం పూర్తయ్యాకా షూటింగ్ మొదలై నడుస్తున్న సమయంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ సినిమా తెరకెక్కించారు.

తారాగణం ఎంపికసవరించు

చిత్రీకరణసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రం లోని అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రి రాశాడు.

  • ఓం నమో శివరుద్రాయ (గానం - వినాయగం రమేశ్, కారుణ్య) (హిట్ సాంగ్)
  • భూం షకలక - (గానం: రంజిత్, శ్రవణ భార్గవి)
  • పిలిచే పేదవుల పైనా - (గానం: హేమచంద్ర, శ్వేత)
  • మకతిక మాయ - (గానం: కార్తీక్, సైంధవి)
  • సండే మండే - (గానం: హేమచంద్ర, మాళవిక)
  • టాక్సీ - (గానం: రంజిత్)

బయటి లింకులుసవరించు

  1. ప్రమోద్. "ఖలేజా సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 28 February 2018. CS1 maint: discouraged parameter (link)
  2. జి. వి., రమణ. "చిత్ర సమీక్ష". idlebrain.com. Retrieved 28 February 2018. CS1 maint: discouraged parameter (link)