ఖుదీరాం బోస్

భారతీయ విప్లవకారుడు

ఖుదీరాం బోస్ (1889 డిసెంబరు 3 - 1908 ఆగస్టు 11) భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు.[1] భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.

ఖుదీరాం బోస్
Khudiram Bose 1905 cropped.jpg
ఖుదీరాం బోస్
జననం(1889-12-03)1889 డిసెంబరు 3
మరణం1908 సెప్టెంబరు 11(1908-09-11) (వయస్సు 18)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడుస్వాతంత్ర్య సమరవీరుడు

జీవిత విశేషాలుసవరించు

ఇతడు పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్ జిల్లా హబిబ్‌పూర్‌లో 1889 డిసెంబర్ 3న త్రైలోక్యనాథ్ బోస్ మరియు లక్ష్మీప్రియాదేవీ దంపతులకు పుత్రుడుగా జన్మించాడు. బోస్ చిన్నవయస్సులోనే తన తల్లితండ్రులను పోగుట్టుకునాడు.పాఠశాలలో చదువుతున్న రోజుల్లో అరవిందఘోష్ సోదరి నివెదితా లేఖన వంటి వారు ప్రవచనాలకు బోస్ చాలా ప్రభావితుడైనాడు. అప్పుడే అతనికి స్వాతంత్ర్య కాంక్ష కలిగింది. అందుకే చిన్ననాటి నుంచి తీవ్రమైన స్వాతంత్ర్య కాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరాడు. తన నాయకత్వ లక్షణాలు, సాహసోపేతమైన స్ఫూర్తితో ఆ సంస్థలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి అతను టీచర్ సత్యేంవూదనాథ్ బోస్, భగవద్గీత స్ఫూర్తిగా నిలిచాయి. 1905లో బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లను బాంబులతో పేల్చివేశాడు[2],[3].

1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్నికొద్దిదూరంలో నిలబడి చూస్తున్నసుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ళ యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కుమీద ఒక్కగుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్ ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి ఇతడు పెట్టింది పేరు. ఇతను యుగాంతర్అనే పత్రిక మీద ఇతను ప్రతికూల నిబంధనలు ఎప్పుడూ విధిస్తూ, ఆ పత్రికా కార్యకర్తలకు నరకయాతన పెట్టేవాడు. చిన్నవాడన్న దయ లేకుండా సుశీల్ కుమార్ కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదించాడు.

ఈ సంఘటన తరువాత స్వతంత్రవీరులంతా కింగ్స్ ఫోర్డ్ కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. నిర్దయుడైన ఫోర్డ్ లాంటి వారు ఉన్నంతవరకు దేశభక్తవీరులకు కష్టాలేనని భావించి అతనిని చంపడానికి నిశ్చయించుకున్నారు.

1908 ఏప్రిల్ మొదటివారంలో జుగాంతర్ అనే విప్లవ సంస్థకి చెందిన విప్లవవీరులు కొందరు కోల్‌కతలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ ఫోర్ట్ ను అంతంచెయ్యడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవిందఘోష్ కూడా ఉన్నాడు. ఖుదీరాంబోసునూ ప్రఫుల్లచాకి అనే మరో నవయువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్ పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒక బాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్ ఫోర్డ్ క్లబ్ వాహనం బయటకురాగానే దానిపై బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తివెళ్లిపోయారు.

అయితే ఖుదీరాం, ప్రఫుల్లచాకిలు గమనించని విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్‌లో టీ తాగుతుండగా ఖుదీరాంబోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణ చేశారు. ముజఫర్ పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికికారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగష్టు 11న ఈ శిక్ష అమలుపరచబడింది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని న్యాయాధికారి అడిగినప్పుడు, ఆ జనసంద్రమైన కోర్టు ఆవరణలో ఖుదీరాం " మీరు నాకు కొంచెం సమయమిస్తే బాంబుల తయారీ గురుంచి చదువుతాను" అని నవ్వి ఊరుకున్నాడు. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు.

బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్‌కు ఖుదీరాంబోస్ పూసా అని ఈ మధ్యే పేరు పెట్టారు.

మీడియాసవరించు

ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఖుదీరామ్ బోస్ చిత్రం తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా కొత్త నిర్మాతగా విజయ్ జాగర్లమూడి పరిచయం అయ్యాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో  పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదతరులు నటించారు. ఖుదీరామ్ బోస్ టైటిల్‌ ఫస్ట్ లుక్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2022 ఆగస్టు 11న విడుద‌ల చేశారు.

మూలాలుసవరించు

  1. "ఖుదీరాం బోస్ చివరి రోజుల్లో...". స్వాతి సపరివార పత్రిక: 71. 23 November 2012.
  2. ఖుదీరాం బోస్ బలిదానం
  3. "స్వేచ్ఛ కోసం 19 ఏళ్లకే ప్రాణార్పణం". Archived from the original on 2015-12-04. Retrieved 2017-08-15.