ఖుదీరామ్ బోస్ (2022 సినిమా)

ఖుదీరామ్ బోస్ అనేది 2022లో వచ్చిన భారతీయ సినిమా. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం.[1] గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజితా విజయ్ జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు డి. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు.

ఖుదీరామ్ బోస్
దర్శకత్వండి. విద్యాసాగర్ రాజు
స్క్రీన్ ప్లేడి. విద్యాసాగర్ రాజు
కథడి. విద్యాసాగర్ రాజు
నిర్మాతరజిత విజయ్ జాగర్లమూడి
తారాగణంరాకేష్ జాగర్లమూడి
అతుల్ కులకర్ణి
నాజర్
వివేక్ ఒబెరాయ్
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
డిసెంబరు 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలయిన ఖుదీరామ్ బోస్ సినిమాను గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2022లో ప్రదర్శించారు.[2] భారత పార్లమెంటు సభ్యుల కోసం 2022 డిసెంబరు 22న ఈ సినిమాను ప్రత్యేకంగా ఢిల్లీలోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు.[3]

నేపథ్యం

మార్చు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో 1889 డిసెంబరు 3న ఖుదీరామ్ బోస్ జన్మించాడు. దేశాన్ని పట్టి వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు అతడు. 18 సంవత్సరాల వయస్సులో 1908 ఆగస్టు 11న చేతిలో భగవద్గీత పట్టుకుని చిరునవ్వుతో దేశంకోసం ఉరికంభం ఎక్కిన ఖుదీరామ్ బోస్ చిరస్మరణీయుడు.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • సమర్పణ జాగర్లమూడి పార్వతి
  • దర్శకత్వం డి. విద్యాసాగర్ రాజు
  • రైటర్‌ బాలాదిత్య
  • ఎడిటర్‌ మార్తాండ్ కె. వెంకటేశ్
  • సంగీత దర్శకుడు మణిశర్మ
  • ప్రొడక్షన్ డిజైనర్‌ తోట తరణి
  • స్టంట్ డైరెక్టర్‌ కనల్ కణ్ణన్
  • సినిమాటోగ్రాఫర్‌ రూసూల్ ఎల్లోర్
  • నిర్మాత రజితా విజయ్ జాగర్లమూడి
  • బ్యానర్‌ గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్

మూలాలు

మార్చు
  1. "'ఖుదీరామ్‌ బోస్‌' జీవిత కథతో." web.archive.org. 2022-12-22. Archived from the original on 2022-12-22. Retrieved 2022-12-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Khudiram Bose,Kida Movies Selected For Indian Panorama - Sakshi". web.archive.org. 2022-12-22. Archived from the original on 2022-12-22. Retrieved 2022-12-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Wayback Machine". web.archive.org. 2022-12-22. Archived from the original on 2022-12-22. Retrieved 2022-12-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)