అతుల్ కులకర్ణి
అతుల్ కులకర్ణి భారతదేశానికి చెందిన సినీ నటుడు. ఆయన హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం మరియు తెలుగు భాష చిత్రాల్లో నటించాడు. ఆయన హే రామ్, చాందిని బార్ చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. ఆయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ నుండి నటనలో డిప్లొమా పొందాడు. ఆయనలో థియేటర్ నటి గీతాంజలిని 1996లో వివాహ చేసుకున్నాడు. 1997లో తొలిసారిగా "భూమిగీత"అనే కన్నడ చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు..[2]
అతుల్ కులకర్ణి | |
---|---|
![]() | |
జననం | 1965 సెప్టెంబరు 10 |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | గీతాంజలి కులకర్ణి (m.1996) [1] |
వెబ్‌సైటు | www.atulkulkarni.com |
జననం & విద్యాభాస్యంసవరించు
ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో సెప్టెంబర్ 10, 1965లో జన్మించాడు. ఈయన మహారాష్ట్ర, సోలాపూర్ లోని హరిభాయ్ డియోకరన్ హై స్కూల్ లో ఉన్నత చదువులను పూర్తి చేశాడు. డి.ఎ.వి కాలేజీ, సోలాపూర్ నుండి బి.ఎ (ఆంగ్ల సాహిత్యం) పూర్తి చేసి, నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ నుండి పీజీ పూర్తి చేశాడు.
తెలుగు చిత్రాలుసవరించు
అతుల్ కులకర్ణి 2000లో ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన జయం మనదేరా (2000 సినిమా) సినిమాతో తెలుగు చిత్రసీమలోకి వచ్చాడు. ఆయన తరువాత ఆంధ్రావాలా (సినిమా), చంటి (2004 సినిమా), గౌరి (2004 సినిమా), లీలామహల్ సెంటర్, రామ్ , పంజా (సినిమా), కాఫీ బార్, మజిలీ (సినిమా), వైల్డ్ డాగ్ చిత్రాల్లో నటించాడు.
టీవీ & వెబ్ సిరీస్సవరించు
Year | Series | Role | Network | Notes |
---|---|---|---|---|
2017-18 | ది టెస్ట్ కేసు | కల్నల్ అజింక్య సాఠే | ఆల్ట్ బాలాజీ | |
2019 | సిటీ అఫ్ డ్రీమ్స్ | అమయ్ రావు గైక్వాడ్ | హాట్ స్టార్ స్పెషల్స్ | |
2020 | ది రైకర్ కేసు | యశ్వంత్ నాయక్ రైకర్ | ఊట్ సెలెక్ట్ | |
2020 | బందీష్ బాండిట్స్ | దిగ్విజయ్ రాథోర్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
2020 | స్యాండ్విచ్డ్ ఫరెవర్ | వి.కె. సార్నాయక్ | సోనీ లివ్ | [3] |
2021-ప్రస్తుతం | ఫారార్ - కబ్ తక్? | హోస్ట్ | ఇషారా టీవీ | |
2022 | రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
మూలాలుసవరించు
- ↑ "Theatre actor Geetanjali Kulkarni gets 'stamp' for film journey". The Times of India. 5 April 2015. Archived from the original on 9 November 2015. Retrieved 3 August 2015.
- ↑ "www.atulkulkarni.com/". atulkulkarni.com. 3 April 2018. Archived from the original on 5 June 2018. Retrieved 30 May 2018.
- ↑ "Sandwiched Forever Review: Kunaal and Aahana show is a feel-good Christmas watch" (in అమెరికన్ ఇంగ్లీష్). India Today. Retrieved 29 December 2020.