గారపాటి సత్యనారాయణ

భారతీయ రాజకీయనేత

గారపాటి సత్యనారాయణ, ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, శాసనసభ్యుడు. అతను ఆంధ్రప్రదేశ్, ఏలూరు నియోజకవర్గం నుండి ఎన్నికైన మొదటి శాసనసభ సభ్యుడు.

గారపాటి సత్యనారాయణ
దస్త్రం:Satyanarayana Garapaty.jpg
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1951–1953
అంతకు ముందు వారుNone (మొదటి శాసనసభ్యుడు)
తరువాత వారుశీర్ల బ్రహ్మయ్య[1]
నియోజకవర్గంఏలూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వ్యక్తిగత వివరాలు
జననం(1911-09-06)1911 సెప్టెంబరు 6
పెదపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, బ్రిటిష్ ఇండియా
మరణం2002 డిసెంబరు 13(2002-12-13) (వయసు 91)
హైదరాబాద్, భారతదేశం
రాజకీయ పార్టీసిపిఐ
జీవిత భాగస్వామికమల
తల్లిదండ్రులుగారపాటి నాగమ్మ (తల్లి)
గారపాటి లక్ష్మయ్య (తండ్రి)

వ్యక్తిగత జీవితం మార్చు

అతను 1911 సెప్టెంబరు 6న ప.గో.జిల్లా, పెదపాడు మండలం, పెదపాడు గ్రామంలో లక్ష్మయ్య, నాగమ్మ దంపతులకు జన్మించాడు. అతను భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడానికి అధ్యయనాలను వదులుకునే ముందు మూడవఫారం వరకు మాత్రమే చదువుకున్నాడు.కమలను వివాహమాడాడు. దాదాపు నలభైసంవత్సరాలపాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటికీ, 1980ల ప్రారంభం నుండి మరణం వరకు అతను పూర్తిగా రాజకీయాల నుండి ఒంటరి జీవితాన్ని గడిపాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు.

రాజకీయ జీవితం మార్చు

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంతో ఆగ్రహించిన సత్యనారాయణ తన యుక్తవయసులో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు.అతను1930లో మొదటిసారిగా 19 సంవత్సరాల వయస్సులో అరెస్టైయ్యాడు. వెల్లూరు కారాగారంలోని బాలుర జైలుకు తరలించారు. అప్పటినుండి అతను బ్రిటిష్ ప్రభుత్వానికి అడ్డంకిగా నిలిచాడు. అతను భూగర్భనుండి సాగించిన కార్యకలాపాలలో భాగంగా "వీరభారతి", "ఢంకా", మొదలైన పత్రికలను నడిపాడు. వాటిపై నిషేధం ఉన్నప్పటికీ స్వాతంత్ర్యోద్యమంలో జరిగిన రాజకీయ సమావేశాలలో అవి చాలా ప్రభావాన్ని కలిగించాయి. పోలీసులు అతన్నిఅనేక సందర్భాల్లో నిర్బందించారు. పౌర అవిధేయత చట్టం, యుద్ధ నిరోధక చట్టం, అప్పటి భారత నిర్బంధ చట్టం నియమాల క్రింద స్వాతంత్ర్యపోరాటంలో అతను పది సంవత్సరాలకు పైగా వివిధ జైళ్లలో గడిపాడు.

ఆందోళనలు మార్చు

క్విట్ ఇండియా ఉద్యమం, తెలంగాణ ఆందోళనలో పాల్గొన్నందుకు అతడిని నిర్బందించి, లాఠీఛార్జి చేశారు. గారపాటి తన జైలు జీవిత కాలంలో నిరాహార దీక్షలు, ఆందోళనలలోపాల్గొనడం ద్వారా చురుకైన పాత్ర పోషించాడు.

అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, తరువాత కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితమయ్యాడు.పశ్చిమ గోదావరిజిల్లా అంతటా పార్టీని చురుకుగా ప్రోత్సహించి బలపరిచాడు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా,అతను ఏలూరు నియోజకవర్గం నుండిఎన్నికైన మొదటి శాసనసభ సభ్యుడు.1951 నుండి 1953 వరకు ఆ పదవిలో పనిచేశాడు.[2]

అతను పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకడు. గొప్ప వక్త, ఎప్పుడూ జనసమూహంతోకలిసి ఉండే రాజకీయనాయకుడు. రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అతడిని అందరూ గౌరవించారు.

జైలు జీవితం మార్చు

 • ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు నెల్లూరు, వెల్లూరు కారాగారంలో 1930 ఆగస్టు 2 నుండి నాలుగు నెలల కఠిన కారాగార శిక్ష.[3]
 • పౌర అవిధేయత ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932 జూన్ 27న ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష,రూ.400 జరిమానా విధించబడింది.అతను రాజమండ్రి, తిరుచిరాపల్లి, మధుర, వేలూరు కారాగారాల్లో నిర్బంధించబడ్డాడు.అతను 1933 ఏప్రిల్ 1 న విడుదల చేయబడ్డాడు.[3]
 • 1940 ఏప్రిల్ 6 న అరెస్ట్ చేయబడి,1940 జులై 15 వరకు పెదపాడులో గృహనిర్బంధంలో ఉన్నాడు. [3]
 • అతను వైద్య కారణాల మీద విడుదలైనప్పుడు 1940 జులై 17 నుండి 1942 జనవరి 26 వరకు వెల్లూరు, కడలూరు జైళ్లలో నిర్బంధించబడ్డాడు [3]
 • 1942 సెప్టెంబరు 24న మళ్లీ అరెస్టయ్యాడు. వెల్లూరు, పాళయంకోట, తంజావూరు జైళ్లలో1943 డిసెంబరు 30 వరకు నిర్బంధించారు. [3]

నాయకులతో అనుబంధాలు మార్చు

తన వివిధ జైలు శిక్షల సమయంలో, అతను జాతీయ స్థాయికి చెందిన మోహన్ లాల్ , ప్రత్యూల్ చంద్ర గంగూలీ, జీవన్‌లాల్ ఛటర్జీ, భట్టుకేశ్వర్ దత్, సర్దార్ భగత్ సింగ్, కన్నెగంటి హనుమంతు వంటి వారితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాడు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, నీలం సంజీవ రెడ్డి, స్వతంత్ర భారతదేశ అధ్యక్షులుగా కొనసాగిన ఆర్. వెంకట్రామన్ వంటి నాయకులతో అతను జైలుజీవితం పంచుకున్నాడు.(25 జూలై 1977-25 జూలై 1982), (25 జూలై 1987-25 జూలై 1992)

1937లో గాంధీజీని,1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఏలూరు పట్టణానికి తీసుకురావడానికి, వారికి మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించడానికి బాధ్యత వహించాడు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో అతను జిల్లా కాంగ్రెస్ సంఘం కార్యదర్శి హోదాలో ఉత్తరప్రత్యత్తరాల ద్వారా ప్రతిస్పందనలు తెలియచేసాడు.

అతను దండునారాయణ రాజు, కాళీపట్నం కొండయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు వంటి రాష్ట్ర స్థాయి నాయకుల సమూహానికి చెందినవాడు. దృఢమైన కమ్యూనిస్టు నాయకులతో సాన్నిహిత్యం ఉంది. కారాగారంలో ఉన్నసమయంలో మార్క్స్ సాహిత్యాన్నిఅధ్యయనం చేయడం అతడిని ఉపేక్షించేలా చేసింది.

నిర్వహించిన పదవులు మార్చు

అతను రాజకీయనాయకుడు మాత్రమే కాదు. కార్మికుల సంక్షేమం కోసం వివిధ కార్మికసంఘాలు, సంస్థలను స్థాపించడంలో సహాయపడ్డాడు. వాటిలో అనేక కార్మిక సంఘాల నాయకుడిగా పనిచేశాడు.

ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉన్న కొన్నిసంస్థలు మార్చు

 • 1935-1936 యువజన కూటమి స్థాపించబడింది. [3]
 • 1935 సంవత్సరంలో ఏలూరు పట్టణ ముద్రణ కార్మికుల సంఘం స్థాపించబడింది.[3]
 • 1937లో ఏలూరు పట్టణ చర్మకారుల సంఘం ఏర్పాటుచేసి నిర్వహించబడింది.[3]
 • 1935 సంవత్సరంలో ఏలూరులో జనపనార కార్మికుల సంఘం ఏర్పాటు చేసి 1982 వరకు దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. [3]
 • 1936-1937 సంవత్సరాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసాడు.[3]
 • 1937-1939 సంవత్సరాలలో జిల్లా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.[3]
 • 1942లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడుగా పనిచేసాడు.[3]
 • 1963-1968 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జిల్లా కార్యవర్గ సభ్యుడుగా పనిచేసాడు.[3]

మూలాలు మార్చు

 1. Election Commission of India, Election Reports 1955
 2. Election Commission of India, Election Reports 1951
 3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 Regani, Sarojini; Krishnam Raju, P & Borgaonkar, Sitaramrao (1982). Who's Who Of Freedom Struggle In Andhra Pradesh. pp.491 The State Committee For The Compilation Of The History Of The Freedom Struggle In Andhra Pradesh, Ministry Of Education, Government Of Andhra Pradesh, Hyderabad

వెలుపలి లంకెలు మార్చు