గీతాంజలి మళ్ళీ వచ్చింది
గీతాంజలి మళ్ళీ వచ్చింది 2024లో విడుదలైన తెలుగు సినిమా. 2014లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఎంవీవీ సినిమాస్, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేశ్, షకలక శంకర్, ఆలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేసి,[1] సినిమాను ఏప్రిల్ 11న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు.[2]
గీతాంజలి మళ్లీ వచ్చింది | |
---|---|
దర్శకత్వం | శివ తుర్లపాటి |
రచన | |
కథ | కోన వెంకట్ |
నిర్మాత | ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సుజాత సిద్ధార్థ |
సంగీతం | ప్రవీణ్ లక్కరాజు |
నిర్మాణ సంస్థలు | ఎంవీవీ సినిమాస్, కోన ఫిలిం కార్పొరేషన్ |
విడుదల తేదీs | 11 ఏప్రిల్ 2024(థియేటర్) 8 మే 2024 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నిర్మాణం
మార్చుతొమ్మిదేళ్ల తర్వాత, అంజలి నటించిన గీతాంజలి సినిమా సీక్వెల్, గా గీతాంజలి మళ్లీ వచ్చింది, ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ 2023 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. ఈ సినిమా నటి అంజలి కి 50వ సినిమా ఈ సినిమాలో అంజలి హారర్ కామెడీలో తన పాత్రను పోషించనుంది.[3][4]
చిత్రీకరణ
మార్చుగీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా చిత్రీకరణ తెలంగాణలోని హైదరాబాద్ లోను తమిళనాడులోని ఊటీలోనూ జరిగింది.[5]
కొత్త సంవత్సరం సందర్భంగా గీతాంజలి మళ్లీ వచ్చేసింది సినిమా ఫస్ట్ లుక్ 2024 జనవరి 1 విడుదలైంది.[6][7] ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 24న విడుదలైంది.[8]
ఈ చిత్రాన్ని మొదట మార్చి 22న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అది వాయిదా పడి, చివరికి ఏప్రిల్ 11న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు.[2]
నటీనటులు
మార్చు- గీతాంజలిగా అంజలి
- శ్రీనుగా శ్రీనివాస్ రెడ్డి
- నానిగా సునీల్[9]
- సత్యం రాజేశ్
- ఆలీ
- షకలక శంకర్
- సత్య
- రవి శంకర్
- శ్రీకాంత్ అయ్యంగార్
- రాహుల్ మాధవ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎంవీవీ సినిమాస్, కోన ఫిలిం కార్పొరేషన్
- నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్
- కథ: కోన వెంకట్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ తుర్లపాటి
- మాటలు: భాను భోగవరపు, నందు సవరిగాన
- సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
- సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
మూలాలు
మార్చు- ↑ Sakshi (24 February 2024). "గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ 2.0 2.1 NT News (28 February 2024). "విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ "Geethanjali Malli Vachindhi goes on floors". Cinema Express. 23 September 2023. Archived from the original on 17 January 2024. Retrieved 16 January 2024.
- ↑ "'Geethanjali Malli Vachindi' team shares their excitement about the film". The Hans India. 7 January 2024. Retrieved 16 January 2024.
- ↑ "Geethanjali Mallivachindi in Ooty and Hyderabad". indiaglitz.com. 26 November 2023.
- ↑ "Geethanjali Malli Vachindi: 'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. అంజలి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్" [Anjali new movie Geethanjali Malli Vachindi Poster release]. Zee News (in Telugu). January 2024. Archived from the original on 17 January 2024. Retrieved 16 January 2024.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "First Look of Geethanjali Malli Vachindi Reminds Fans of Rajinikanth's Chandramukhi". news18.com. 2 January 2024. Archived from the original on 2 January 2024. Retrieved 16 January 2024.
- ↑ "Geethanjali Malli Vachindi Anjali Teaser anchors this horror comedy". Film Companion. 26 February 2024.
- ↑ NT News (5 January 2024). "'గీతాంజలి మళ్లీ వచ్చింది' నుంచి కిల్లర్ నానిని పరిచయం చేసిన మేకర్స్". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.