గూఢచారి 116 1966, ఆగస్టు 11న విడుదలైన తెలుగు సినిమా.[1]

గూఢచారి 116
(1966 తెలుగు సినిమా)
Goodhachari 116.jpg
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
శోభన్ బాబు,
ముక్కామల,
తమ్మారెడ్డి చలపతిరావు
జయలలిత,
రాజబాబు,
గీతాంజలి,
నెల్లూరు కాంతారావు
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

దేశంలో దౌర్జన్యకాండలు, విధ్వంసాలు, సృష్టిస్తూ శత్రుదేశాలకు సాయపడే విద్రోహుల ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజంట్‌ 303 (శోభన్‌బాబు)ని గూఢచార సంస్థ నియమిస్తుంది. విదేశీయ విద్రోహులకు సహాయపడే మనదేశపు ముఠాకు దామోదర్‌ (ముక్కామల) నాయకుడు, అతని డెన్లో ఎంతోమంది రౌడీలు పనిచేస్తూ వుంటారు. విద్రోహశక్తులు దామోదర్‌ ముఠా సాయంతో బండ్లకు నిప్పంటించడం, రిజార్వాయిర్లకు డైనమైట్లు పెట్టి గండికొట్టించడం, డ్యాములను కూల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే వారి మూలాలను పసిగట్టి వాళ్లు వాడిన కారు నెంబరు వంటి కొన్ని ఆధారాలను సంపాదిస్తాడు. వాటిని గూఢచార సంస్థకు చేరవేసేలోపు శత్రువ్యూహంలో చిక్కుకొని మరణిస్తాడు. సి.ఐ.డి. ఉన్నతాధికారి (జూ।। ఎ.వి. సుబ్బారావు) ఈ చిక్కును విడదీసే బాధ్యతను గోపి (కృష్ణ) అనే ఏజెంట్‌ 116కు అప్పగిస్తాడు. ఆ విద్రోహ ముఠాకు ఒక విదేశీయుడు (రాజనాల) బాస్‌. అతడు తన ఏజెంట్‌ దామోదరం (ముక్కామల)ను ‘ఆర్‌డి’ అనే కోడ్‌ భాషలో సంప్రదిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ఉంటాడు. దామోదరం కూతురు రాధ (జయలలిత) ఏజెంట్‌ 303 సేకరించిన ఆధారాలను సంపాదించే ప్రయత్నంలో దామోదరం, ఆ ఏజెంట్‌ చెల్లెలు సుగుణ (గీతాంజలి) ను కలిసి, తను సి.ఐ.డి. అధికారి అని పరిచయం చేసుకొని, ఆమెను పావుగా వాడుకొనే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా గోపి ఆమె వద్దకు వచ్చి తనను గూఢాచారి 116 పరిచయం చేసుకుంటాడు. కానీ సుగుణ గోపినీ నమ్మదు. ఆ ఇంట్లో ఉన్న ఏజెంట్‌ 303 ఫోటో మీద ఉన్న అడ్రస్‌ ఆధారంగా గోపి నెగిటివ్‌లు సంపాదించి, వాటి ఆధారంగా విద్రోహక ముఠా ఆనుపానులు తెలుసుకుని వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో, రాధ ప్రేమలో పడతాడు. రాధకు ఆమె తండ్రే విధ్వంసాలు సృష్టిస్తున్న విషయాన్ని తెలియజెప్పి ఆమె ద్వారా దామోదరంలో పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దామోదరం విదేశీ ముఠా నాయకుడిని కలిసి ఇకపై నేరప్రవృత్తికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెబుతాడు. అందుకు ఆగ్రహించిన ముఠా నాయుకుడు రాధను బంధిస్తాడు. ఇక గోపి చాకచక్యంతో విద్రోహ ముఠాను మట్టికరిపించి, ముఠా నాయకుడు విమానంలో పారిపోతుంటే తన జీపుతో డీకొట్టి ఆ విమానాన్ని పేల్చివేస్తాడు. ఏజెంట్‌ 116కు అప్పగించిన పని పూర్తవడంతో సినిమా కూడా పూర్తవుంతుంది. గోపి, రాధ, ఒకటౌతారు[2].

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఓహో వాలు చూపుల వన్నెలాడి నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి[3] ఆరుద్ర టి.చలపతిరావు ఘంటసాల
నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె - జివ్వు మంటుంది మనసు రివ్వు మంటుంది వయసు సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు ఏంచేస్తావోయి సోగ్గాడా సి.నారాయణ రెడ్డి టి.చలపతిరావు పి.సుశీల, ఘంటసాల బృందం
డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే సొంపులన్ని టి.చలపతిరావు ఘంటసాల
నీతో ఏదో పనివుంది అది నీకే నీకే భోధపడుతుంది ఆరుద్ర టి.చలపతిరావు పి.సుశీల
పడిలేచే కెరటం చూడు పడుచు పిల్ల బింకం చూడు తొంగిచూచు ఆరుద్ర టి.చలపతిరావు పి.సుశీల
మనసుతీరా నవ్వులే నవ్వులే నవ్వులి మనం రోజూ పండుగె ఆరుద్ర టి.చలపతిరావు పి.సుశీల, ఘంటసాల బృందం

విశేషాలుసవరించు

  • కేవలం "నువ్వు నా ముందుంటే" పాట కలర్ లో చిత్రీకరించబడింది. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం.

వనరులుసవరించు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. ఆచారం షణ్ముఖాచారి. "తొలి తెలుగు బాండ్‌ సినిమా 'గూఢచారి 116'". సితార. USHODAYA ENTERPRISES PVT LTD. Archived from the original on 10 నవంబర్ 2019. Retrieved 31 July 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/w/index.php?title=గూఢచారి_116&oldid=3250543" నుండి వెలికితీశారు