రాజనాల కాళేశ్వరరావు

ప్రతినాయక పాత్రలకు పేరొందిన సినీ నటుడు
(రాజనాల నుండి దారిమార్పు చెందింది)

రాజనాల (జనవరి 3, 1925 - మే 21, 1998) తెలుగు సినిమా నటుడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు పోషించాడు. తెలుగు సినిమా, నాటకాల్లో ఎక్కువగా నటించాడు. కొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాలలో కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించాడు.[1][2]

రాజనాల కాళేశ్వరరావు నాయుడు
Rajanala.JPG
జన్మ నామంరాజనాల కాళేశ్వరరావు నాయుడు
జననం (1925-01-03)1925 జనవరి 3
మరణం 1998 మే 21(1998-05-21) (వయసు 73)
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు రాజనాల
భార్య/భర్త ఆర్.బి.దేవి

జీవిత విశేషాలుసవరించు

నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు). ఈయన 1925, జనవరి 3న జన్మించాడు. ఇంటర్‌ చదువుతూనే 1948లో నెల్లూరులో స్నేహితుడు లక్ష్మీకుమార్‌ రెడ్డితో కలిసి నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ అనే నాటక సంస్థను ప్రారంభించాడు. మొదటగా నెల్లూరు టౌన్‌హాలులో ఆచార్య ఆత్రేయ ‘ఎవరు దొంగ’ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం చూసిన జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలోని అవినీతిని బట్టబయలు చేశావంటూ రాజనాలపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆ తరువాత ‘ప్రగతి’ అనే నాటకాన్ని ప్రదర్శించగా కోపగించిన కలెక్టర్‌ రాజనాలను సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత ఉద్యోగం వచ్చినా ఇష్టంగా చేసేవారు కాదు.

సినిమా ప్రస్థానంసవరించు

1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి నుంచి మద్రాసుకు పిలుపువచ్చింది. అప్పటికే లక్ష్మీకుమార్‌రెడ్డి నిర్మాత హెచ్. ఎం. రెడ్డి వద్ద పని చేస్తున్నారు. వారు తీసే ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్‌గా రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/– జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1953లో విడుదలైన ఆ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాడు. అప్పటినుంచి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు విలన్‌గా, హాస్యనటుడుగా తారాజువ్వలా వెలుగొందాడు.

రాజనాలా 1950, 1960 లలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతికూల పాత్రలకు ప్రసిద్ది చెందారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలలో నటించినందుకు పలు అవార్డులు, ప్రశంసలు పొందారు. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ నటుడు ఎన్.టి.రామారావుకు తగ్గ ప్రసిద్ధి చెందిన విలన్.రాజనాలా చాలా మంచి, నిష్పత్తిలో ఉన్న శరీరాన్ని కలిగి ఉండేవాడు. అతని ఐకానిక్ నటన ఎక్కువగా అతని కళ్ళ కదలిక ద్వారా జరిగింది. అతను ఒక విలన్ యొక్క క్రూరత్వాన్ని తన కళ్ళను చూడటం, విస్తరించడం ద్వారా వివిధ స్థాయిలకు చూపించేవాడు. అతని విలన్ నవ్వు చాలా ప్రసిద్ది చెందింది.అతను 100 కంటే ఎక్కువ తెలుగు చిత్రాలలో విలన్ గా నటించాడు, నెల్లూరు జిల్లా నుండి మంచి నటుడిగా పేరు పొందాడు. అతను తెరపై గొప్ప ఆధిపత్య విలన్, అతను అప్పట్లో తెలుగు కథానాయకులకి తగ్గ సమానమైన వేతనం పొందేవాడు.

ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడు రాజనాలా, అంటే ఎన్.టి.రామారావు, ఎం.జి.రామచంద్రన్, జె.జయలలిత.రాజనాలాకు ఇతర సినిమా పరిశ్రమ కోలీవుడ్, బాలీవుడ్లలో మంచి స్నేహితులు ఉన్నారు.

మరణంసవరించు

మధుమేహంతో బాధపడుతుండడం వల్ల, 1995లో అరకు లోయలో తెలుగు వీర లేవరాలో సినిమాలో పూర్తిస్థాయి పాత్ర పోషిస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో గాయపడిన అతని కాలిని హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో కత్తిరించాల్సి వచ్చింది. రాజనాలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 1998, మే 21న చెన్నైలో మరణించాడు. అతని అంత్యక్రియలకు చాలామంది నటులు, చిత్ర పరిశ్రమ గౌరవం ఇచ్చింది.[3]

నటించిన చిత్రాలుసవరించు

  1. హలో బ్రదర్ (1994)
  2. భలే తమ్ముడు (1985)
  3. పటాలం పాండు (1981)
  4. నకిలీ మనిషి (1980)
  5. గంధర్వ కన్య (1979)
  6. ఉత్తమురాలు (1976)
  7. అందరూ బాగుండాలి (1975)
  8. అల్లూరి సీతారామరాజు (1974) - మేజర్ గుడాల్
  9. గండర గండడు (1969)
  10. సప్తస్వరాలు (1969)
  11. వరకట్నం (1968)
  12. గూఢచారి 116 (1967)
  13. శ్రీకృష్ణావతారం (1967)
  14. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
  15. పల్నాటి యుద్ధం (1966)
  16. శ్రీకృష్ణ పాండవీయం (1966)
  17. దేవత (1965)
  18. సత్య హరిశ్చంద్ర (1965)
  19. బొబ్బిలి యుద్ధం (1964)
  20. రాముడు భీముడు (1964)
  21. నర్తనశాల (1963)
  22. పరువు ప్రతిష్ఠ (1963)
  23. గుండమ్మ కథ (1962)
  24. దక్షయజ్ఞం (1962)
  25. సిరిసంపదలు (1962)
  26. గులేబకావళి కథ (1962)[4]
  27. జగదేకవీరుని కథ (1961)
  28. ఉషాపరిణయం (1961) - శివుడు
  29. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  30. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
  31. రాజమకుటం (1959)
  32. సువర్ణసుందరి (1957)
  33. కుటుంబ గౌరవం (1957)
  34. వినాయక చవితి (1957)
  35. తెనాలి రామకృష్ణ (1956)
  36. జయసింహ (1955)
  37. ప్రతిజ్ఞ
  38. పిడుగురాముడు
  39. అగ్గిపిడుగు

మూలాలుసవరించు

  1. "The original swashbuckler". The Hindu. 3 April 2009. Retrieved 15 July 2018.
  2. M.L. Narasimham (11 February 2016). "Rajamakutam (1960)". The Hindu. Retrieved 15 July 2018.
  3. జీ తెలుగు, వినోదం (3 January 2018). "రాజనాల... తెలుగు విలన్లకే రారాజు..!". Archived from the original on 15 April 2019. Retrieved 15 April 2019.
  4. ఆంధ్రభూమి (19 January 2019). "గులేబకావళి కథ (నాకు నచ్చిన సినిమా)". కాకుటూరి సుబ్రహ్మణ్యం. Archived from the original on 15 April 2019. Retrieved 15 April 2019.

వనరులుసవరించు

  1. వెండితెర నేలనేలిన రాజనాల, సితార వెబ్ Archived 2019-04-15 at the Wayback Machine
  2. ఈతకోట సుబ్బారావు, ఆంధ్రజ్యోతి, 3.1.2018