గెల్లు శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[3] 2023 ఏప్రిల్ 4న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించబడ్డాడు.[4][5]

గెల్లు శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) రాష్ట్ర అధ్యక్ష్యుడు
వ్యక్తిగత వివరాలు
జననం21 ఆగష్టు 1983
హిమ్మత్ నగర్, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామిశ్వేత[1][2]
సంతానంసంఘమిత్ర(కూతురు), తారకరామారావు(కొడుకు)
తల్లిదండ్రులుగెల్లు మల్లయ్య , లక్ష్మి
నివాసంహైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని, హిమ్మత్ నగర్ గ్రామంలో గెల్లు మల్లయ్య, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య అంత వీణవంకలో పూర్తి చేసి, అంబర్‌పేట ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ దోమల‌గూడలోని ఏవీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ (జానపద కళలు), ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (రాజనీతి శాస్త్రం) పూర్తి చేసి, ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నాడు. ఆయన ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ రాజనీతిశాస్త్రం విభాగంలో చేరి ‘తెలంగాణ ఉద్యమం- కేసీఆర్‌ గారి పాత్ర’ అనే అంశంపై పరిశోధన చేస్తున్నాడు.[6]

రాజకీయ జీవితం మార్చు

గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య‌తో కలిసి బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాటాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడిగా ఉన్నాడు. ఆయన దోమల‌గూడ లోని ఏవీ కళాశాల టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా (2003-2006), తెలుగు విశ్వవిద్యాలయం టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా (2006-2007), తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, 2010 నుండి ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ 2017 మే 29లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7][8]

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు టిఆర్ఎస్ అభ్యర్థిగా 2021 ఆగస్టు 11న కేసీఆర్ ప్రకటించాడు.[9][10] ఆయనకు 2021 సెప్టెంబరు 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీ-ఫారంను, ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ ఫండ్‌ నుంచి 28 లక్షల రూపాయల చెక్కును అందజేశాడు.[11] 2021 అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్‌ చేతిలో 23, 855 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[12]

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను 2023 ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించాడు. శ్రీనివాస్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్టు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి నియామక ఉత్తర్వు (జీవో ఆర్.టి. నెం. 513) జారీచేయబడింది.[13] గెల్లు శ్రీనివాస్ యాదవ్ 2023 ఏప్రిల్ 15న పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[14]

ఎన్నికల సమన్వయకర్తగా మార్చు

శ్రీనివాస్ యాదవ్ 2006లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విద్యార్థి విభాగం సమన్వర్యకర్తగా పనిచేశాడు. ఆయన 2008లో జడ్చెర్ల శాసనసభ నియోజకవర్గం విద్యార్థి విభాగం ఇంచార్జ్ గా, 2009లో జరిగిన హుజురాబాదు శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. గెల్లు శ్రీనివాస్ 2012లో కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విద్యార్థి విభాగం సమన్వర్యకర్తగా కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో పనిచేశాడు. ఆయన 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ ఇంచార్జ్ గా పనిచేశాడు.[15]

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (28 September 2021). "హుజూరాబాద్ ప్రచారంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి." Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
 2. Namasthe Telangana (19 October 2021). "క్యాంపస్‌ టూ కమలాపూర్‌.. ఉద్యమం కలిపిన సోపతి". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
 3. V6 Velugu (11 August 2021). "గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ బయోడేటా" (in ఇంగ్లీష్). Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. "రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్‌". EENADU. 2023-04-05. Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-05.
 5. Namasthe Telangana, NT News (5 April 2023). "ఉద్యమకారుడికి మరో పదవి". Retrieved 6 April 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 6. Namasthe Telangana (1 August 2021). "హుజూరాబాద్‌ అభ్యర్థి ఎవరు?". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
 7. Suryaa (12 July 2017). "టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యవర్గం నియామకం". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
 8. Tnewstelugu (11 August 2021). "విద్యార్ధి నాయకుడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి దాకా.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేపథ్యమంతా ఉద్యమలే. - TNews Telugu". Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
 9. The Hans India, Telangana (11 August 2021). "Gellu Srinivas is TRS candidate for Huzurabad by-election" (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
 10. The Times of India, Hyderabad News (11 August 2021). "K Chandrashekhar Rao announces Gellu Srinivas Yadav as TRS candidate" (in ఇంగ్లీష్). Roushan Ali. Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
 11. Namasthe Telangana (1 October 2021). "విజయోస్తు!". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
 12. Sakshi (2 November 2021). "హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్‌ ఘన విజయం". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
 13. telugu, NT News (2023-04-04). "Gellu Srinivas Yadav | తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్". www.ntnews.com. Archived from the original on 2023-04-04. Retrieved 2023-04-04.
 14. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 15. Telangana Today (21 November 2020). "GHMC polls: TRSV president confident of TRS' victory in Old Malakpet". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.