గోల్‌మాల్ గోవిందం

తాతినేని రామారావు దర్శకత్వంలో 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం

గోల్‌మాల్ గోవిందం 1992, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాతినేని రామారావు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అనూష జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3] ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్[4] పతాకంపై ఎ.వి. సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది.[5] మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన వెడ్డింగ్ బెల్ నవల ఆధారంగా రూపొందించబడిన గౌరి గణేష (1990) అనే కన్నడ సినిమాకి రిమేక్ ఇది.

గోల్‌మాల్ గోవిందం
గోల్‌మాల్ గోవిందం విసిడి కవర్
దర్శకత్వంతాతినేని రామారావు
రచనచిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు)
స్క్రీన్ ప్లేతాతినేని రామారావు
కథమల్లాది వెంకట కృష్ణమూర్తి
దీనిపై ఆధారితంగౌరి గణేష (1990)
నిర్మాతఎ.వి. సుబ్బారావు
తారాగణంరాజేంద్ర ప్రసాద్
అనూష
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుజె. కృష్ణస్వామి
బాలు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్[1]
విడుదల తేదీ
8 ఫిబ్రవరి 1992 (1992-02-08)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

గోల్‌మాల్ గోవిందం (రాజేంద్ర ప్రసాద్) చిన్నచిన్న మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఒక రోజు, అతను ఉచిత వసతి, భోజనం కోసం ఆసుపత్రిగా వెలుతాడు. అక్కడ కుమారి (శ్రీ భాను) అనే అమ్మాయి గుండెపోటుతో మరణిస్తుంది. గోవిందం ఆమె వస్తువులను తీసుకొని వాటినుండి కొంత డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ వస్తువులలో కుమారి డైరీని దొరుకుతుంది. తన జీవితాన్ని మార్చిన ముగ్గురు వ్యక్తుల గురించి కుమారి అందులో రాసింది. మొదటి వ్యక్తి ఆమె మాజీ బాస్ మన్మధరావు (గిరి బాబు), ఆమెను తనతో ఒకరోజు గడుపమన్నాడు. రెండవ వ్యక్తి రాజశేఖర్ (దిలీప్), తన తల్లిదండ్రులకు చూపించడానికి తన భార్యగా నటించాలని అందుకు బదులుగా ఆమెకు గుండె చికిత్స కోసం డబ్బులు ఇస్తానంటాడు. మూడవవ్యక్తి సుధాకర్ (సుధాకర్) రాజశేఖర్ స్నేహితుడు. తాగిన మైకంలో కుమారిని అనుభవించానని అనుకుంటాడు. నిజం ఏమిటంటే ఈ ముగ్గురిలో ఎవరికీ ఆమెతో శారీరక సంబంధం లేదు. ఈ ముగ్గురి నుండి డబ్బును తీపుకునేందుకు గోవిందం ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. కుమారి ఒక కొడుకుకు జన్మనిచ్చిందని, అతనికి గోపాల్ అని పేరు పెట్టారని గోవిందం వారికి ఉత్తరాలు రాస్తాడు. ఆ ముగ్గురూ ఒకే రోజు గోవిందాన్ని కలవడానికి వస్తారు. దాంతో అనాథాశ్రమం నుండి గణపతి (మాస్టర్ ఆనంద్) అనే పిల్లవాడిని తీసుకువచ్చి గోల్‌మాల్ డ్రామా ఆడటం ప్రారంభిస్తాడు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • చిత్రానువాదం, దర్శకత్వం: తాతినేని రామారావు
  • నిర్మాత: ఎ.వి. సుబ్బారావు
  • మాటలు: చిలుకోటి కాశీ విశ్వనాథ్
  • కథ: మల్లాది వెంకట కృష్ణమూర్తి
  • ఆధారం: గౌరి గణేష (1990)
  • సంగీతం: కె. చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: హరి అనుమోలు
  • కూర్పు: జె. కృష్ణస్వామి, బాలు
  • నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్

పాటలు

మార్చు
గోల్‌మాల్ గోవిందం
సినిమా by
Released1992
Genreసినిమా పాటలు
Length18:19
Labelలియో ఆడియో
Producerకె. చక్రవర్తి
కె. చక్రవర్తి chronology
వదినగారి గాజులు
(1992)
గోల్‌మాల్ గోవిందం
(1992)
సీతాపతి చలో తిరుపతి
(1992)

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. లియో ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]

సం.పాటగాయకులుపాట నిడివి
1."గోల్‌మాల్ గోవిందం"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:29
2."ఏం తాపమో"మనో, ఎస్.పి. శైలజ4:29
3."అందంలో చందురుడు"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:35
4."డాడీ డాడీ"ఎస్.పి. శైలజ4:46
మొత్తం నిడివి:18:19

మూలాలు

మార్చు
  1. "Golmaal Govindam (Overview)". IMDb.
  2. "Golmaal Govindam (Direction)". Telugu Cinema Profile.
  3. "Golmaal Govindam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-09-26. Retrieved 2020-08-08.
  4. "Golmaal Govindam (Banner)". Chitr.com.[permanent dead link]
  5. "Golmaal Govindam (Review)". The Cine Bay. Archived from the original on 2021-09-21. Retrieved 2020-08-08.
  6. "Golmaal Govindam (Songs)". Cineradham.[permanent dead link]

ఇతర లంకెలు

మార్చు