చంటిగాడు, 2003 నవంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూపర్‌హిట్ ఫ్రెండ్స్ బ్యానరులో బి.ఎ. రాజు నిర్మించిన ఈ చిత్రానికి బి. జయ దర్శకత్వం వహించింది. ఇందులో బాలాదిత్య, సుహాసిని, రాజీవ్ కనకాల, ఆహుతి ప్రసాద్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]

చంటిగాడు
Chantigadu Movie DVD Cover.jpg
చంటిగాడు సినిమా డివిడి కవర్
దర్శకత్వంబి. జయ
రచనమరుధూరి రాజా (మాటలు)
గజ్జల సైదిరెడ్డి (రచనా సహకారం)
నిర్మాతబి.ఎ. రాజు
తారాగణంబాలాదిత్య
సుహాసిని
రాజీవ్ కనకాల
ఆహుతి ప్రసాద్
ఛాయాగ్రహణంకె. పూర్ణ
కూర్పుఆవుల వెంకటేష్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
సూపర్‌హిట్ ఫ్రెండ్స్
విడుదల తేదీ
2003, నవంబరు 26
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

గ్రామంలోని రాముడి ఆలయంలో వంటరిగా పనిచేస్తున్న ఒక వితంతువు (శరణ్య) కుమారుడైన చంటిగాడు (బాలదిత్య) తన స్నేహితులతో హాయిగా గ్రామంలో గడుపుతుంటాడు. సీతామహాలక్ష్మి (సుహాసిని) ఒక భూస్వామి రెడ్డప్ప (అహుతి ప్రసాద్) కుమార్తె. చంటిగాడు, సుహాసిని తమ 10వ తరగతి పూర్తిచేసి, పట్టణంలోని ఒక కళాశాలలో చేరతారు. ప్రతిరోజూ వారు పడవ ద్వారా ఆ పట్టణానికి వెళ్ళాలి. ఆ సమయంలో సీతామహాలక్ష్మి, చంటిగాడిని చూసి అతనితో ప్రేమలో పడుతుంది. చంటిగాడు కూడా ఆమెను ఇష్టపడతాడు. సీతమహాలక్ష్మిని ఎవరైతే వివాహం చేసుకుంటారో, ఆ వ్యక్తి తల్లి వివాహం తరువాత మరణింస్తుందని గ్రామంలోని ఆలయ పూజారి చంటిగాడితో చెబుతాడు. సీతామహాలక్ష్మిపై ఉన్న ప్రేమకంటే తన తల్లి జీవితం ముఖ్యమని చంటిగాడు నిర్ణయించుకుంటాడు. తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.[3][4]

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. భువనచంద్ర, కాసర్ల శ్యామ్‌, పూడి శెట్టిరామ్, జిల్లెళ్ళ వరప్రసాద్ పాటలు రాశారు.[5][6]

  1. స్వాతి ముత్యమే - కార్తీక్, ఉష
  2. ఒక్కసారి పిలిచావంటే - ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మీ అయ్యర్
  3. చిరుగాలిలా - ఎస్. పి. చరణ్, ఉష
  4. సీతాకోక చిలుకలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  5. కొక్కరకో - శంకర్ మహదేవన్
  6. లవ్ మీ లవ్ మీ - శ్రేయా ఘోషాల్
  7. సిగ్గులొలికే సీతాలు - గంగాధర శాస్త్రి, సునీత

మూలాలుసవరించు

  1. "Chantigadu (2003)". Indiancine.ma. Retrieved 2021-06-05.
  2. "Telugu cinema Review - Chantigadu - Baladitya, Suhasini - Jaya - BA Raju - Vandemataram". www.idlebrain.com. Retrieved 2021-06-05.
  3. "చంటిగాడు". TeluguOne-TMDB-Movie Newsglish. Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.
  4. "Chantigadu Preview, Chantigadu Story & Synopsis, Chantigadu Telugu Movie". FilmiBeat. Retrieved 2021-06-05.
  5. "Chantigadu Songs Download". Naa Songs-US. 2016-04-20. Retrieved 2021-06-05.
  6. "Chantigadu Mp3 Songs Download". AtoZmp3-US. 2020-12-16. Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=చంటిగాడు&oldid=3805005" నుండి వెలికితీశారు