గంగాధర శాస్త్రి
లక్కవఝల వెంకట గంగాధర శాస్త్రి ఒక ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, విలేఖరి. భగవద్గీతను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం చెయ్యడానికి భగవద్గీత ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు.[2] భగవద్గీతలోని మొత్తం శ్లోకాలను తాత్పర్యంతో సహా గానం చేశాడు. ఇందులో ఘంటసాల గానం చేసిన 106 శ్లోకాలను అదే రాగంలో పాడి మిగతా శ్లోకాలను స్వంతంగా స్వరపరిచాడు.[3] ఘంటసాల పాటలు ఆయన గాత్ర ధర్మంతో ఆలపించడం ద్వారా అభినవ ఘంటసాల అనే పేరు పొందాడు.
ఎల్. వి. గంగాధర శాస్త్రి | |
---|---|
![]() | |
జననం | లక్కవఝల వెంకట గంగాధర శాస్త్రి జూన్ 27, 1967[1] |
విద్య | బి. ఏ |
విద్యాసంస్థ | నాగార్జున విశ్వవిద్యాలయం |
వృత్తి | గాయకుడు, విలేఖరి, ప్రయోక్త, సంగీత దర్శకుడు |
సుపరిచితుడు | భగవద్గీత ఫౌండేషన్ |
జీవిత భాగస్వాములు | అర్చన |
పిల్లలు |
|
తల్లిదండ్రులు |
|
వ్యక్తిగత వివరాలుసవరించు
గంగాధర శాస్త్రి 1967, జూన్ 27 న కృష్ణా జిల్లా, అవనిగడ్డ లో కాశీవిశ్వనాథ శర్మ, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయనకు వేణుగోపాల్ అనే తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ వరకు స్వస్థలంలోనే చదువుకున్నాడు. నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల నుంచి బి.ఏ పూర్తి చేశాడు. తల్లిదండ్రులిద్దరికీ సంగీత పరిజ్ఞానం ఉండటంతో చిన్నప్పుడు వారి దగ్గర కొంత సంగీతం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఘంటసాలను అభిమానించేవాడు. ఆయన పాటలు స్ఫూర్తిగా తీసుకునేవాడు. ఆయన స్ఫూర్తితోనే హైదరాబాదులో శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఐదేళ్ళ పాటు సంగీతం నేర్చుకున్నాడు. కర్ణాటక సంగీతం శ్రీరంగం గోపాలరత్నం నుంచి నేర్చుకున్నాడు. డాక్టర్ కోవెల శాంత, వాసా పద్మనాభం, హరిప్రియ, రేవతి రత్నస్వామి దగ్గర కూడా సంగీతాన్ని అభ్యసించాడు.[1]
1995లో ఆయనకు అర్చనతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇరువురు సంతానం. కుమారుడు విశ్వతేజ. కుమార్తె కీర్తి ప్రియ.
వృత్తిసవరించు
1990 నుంచి 2002 వరకు ఈనాడు, సితార పత్రికల్లో సినీ జర్నలిస్టుగా పనిచేశాడు. అంతే కాకుండా గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. సినిమాల్లోనూ, రేడియోలోనూ, టీవీ సీరియళ్ళలోనూ, వేదికల మీద పాటలు పాడుతుంటాడు. సినిమాల్లో పాత్రలకు గాత్రదానం చేస్తుంటాడు. టీవీ కార్యక్రమాలకు, ప్రత్యేక కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించాడు.
సినిమా పాటలుసవరించు
1994లో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన నాన్నగారు అనే సినిమాలో పాటకు గాను ఉత్తమ నూతన గాయకుడిగా వంశీ ఇంటర్నేషనల్ ఫిలిం సొసైటీ వారి నుంచి పురస్కారం అందుకున్నాడు. నేపథ్య గాయకుడిగా ఆయన తొలి సినిమా ఇది. అన్నమయ్య సినిమాలో కొన్ని పాటలు పాడాడు. శ్రీ మంజునాథ సినిమా లో ఓం అక్షరాయ నమః అనే పాటను గానం చేశాడు.
పురస్కారాలుసవరించు
- 1994 లో నాన్నగారు సినిమాకు గాను ఉత్తమ నూతన గాయకుడిగా వంశీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సొసైటీ నుంచి పురస్కారం.
- 1995 లో అమ్మమనసు టెలీ సీరియల్ కు గాను ఉత్తమ గాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం.
- 1995 లో గీతా ఆర్ట్స్ థియేటర్, హైదరాబాదు వారిచే రాజీవ్ గాంధీ నేషనల్ ఇంటిగ్రేటెడ్ అవార్డు
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.[4]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "Gangadhar Sastry Bhagavadgita". bhagavadgitafoundation.org. భగవద్గీత ఫౌండేషన్. Archived from the original on 12 డిసెంబర్ 2016. Retrieved 4 January 2017. Check date values in:
|archive-date=
(help) - ↑ "గాయకుడు గంగాధర శాస్త్రి 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'గీతా జయంతి' వేడుకలు". indiaglitz.com. indiaglitz. Retrieved 12 December 2016.
- ↑ రెంటాల, జయదేవ. "గీతా గంగకు... అపర భగీరథుడు". sakshi.com. సాక్షి. Retrieved 9 December 2016.
- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి