చంద్రముఖి 2 2023లో విడుదలైన తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమాకు పి. వాసు దర్శకత్వం వహించాడు. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ నిర్మించిన ఈ సినిమాలో లారెన్స్‌, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘స్వాగ‌తాంజ‌లి’ లిరికల్ పాటను ఆగష్టు 11న విడుదల చేశారు.[1]

చంద్రముఖి 2
దర్శకత్వంపి. వాసు
రచనపి. వాసు
నిర్మాతసుభాస్కరన్‌
తారాగణంలారెన్స్‌
కంగనా రనౌత్
వడివేలు
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుఆంథోనీ
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుశ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ
విడుదల తేదీs
15 సెప్టెంబరు 2023 (2023-09-15)(థియేటర్)
26 అక్టోబరు 2023 (2023-10-26)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలై, అక్టోబర్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[2][3]

నటీనటులు

మార్చు

రంగనాయకి (రాధిక) కుటుంబంలో ఒక్కసారిగా సమస్యలు వచ్చి పడతాయి. ఫ్యాక్టరీలో ప్రమాదం, కూతురికి యాక్సిడెంట్ ఇలా అన్నీ ఒకే సారి సమస్యలు రావడంతో కుల దైవాన్ని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయ్ అని స్వామీజీ (రావు రమేష్) చెబుతాడు. దీంతో తమ కుల దైవానికి పూజ చేయాలని ఊరికి వెళ్తారు. ఆ ఊర్లోని వేట్టయ్యపురం కోటలో కుటుంబంతో వస్తుంది. ఇక అక్కడికి మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత వాళ్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆ ఇంట్లో ఉన్న చంద్రముఖి ఆత్మ (కంగనా రనౌత్) ఆ కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహించింది. చివరకు చంద్రముఖి ఏం చేసింది? అనేదే మిగతా సినిమా కథ.[5]

విడుదల

మార్చు

‘చంద్రముఖి 2’ సినిమాను వినాయక చవితి సంద‌ర్భంగా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది.[6] తెలుగు రాష్ట్రాల్లో ఈ  సినిమాని శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.[7]

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
  • నిర్మాత: సుభాస్కరన్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. వాసు
  • సంగీతం: ఎం. ఎం. కీరవాణి[8]
  • సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
  • ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : తోట త‌ర‌ణి
  • ఎడిట‌ర్‌: ఆంథోని
  • పాటలు: చైతన్య ప్రసాద్‌

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (11 August 2023). "'చంద్రముఖి 2' నుంచి 'స్వాగతాంజలి' లిరికల్ సాంగ్ విడుదల." Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (27 October 2023). "ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  3. Hindustantimes Telugu (25 October 2023). "రేపే ఓటీటీలోకి 'చంద్రముఖి 2' సినిమా: స్ట్రీమింగ్ వివరాలివే". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  4. HMTV (1 December 2022). "చంద్రముఖి 2 లో కీలకపాత్ర పోషించనున్నబాలీవుడ్ బ్యూటీ". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  5. Eenadu (28 September 2023). "రివ్యూ: చంద్రముఖి-2". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  6. A. B. P. Desam (29 June 2023). "'చంద్రముఖి 2' వచ్చేస్తోంది - 18 ఏళ్ల తర్వాత మళ్లీ లకలకలక!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  7. ABP (20 September 2023). "తెలుగులో 'చంద్రముఖి 2' రిలీజ్ చేస్తున్నది ఎవరంటే?". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  8. TV9 Telugu (24 July 2023). "'మరణ భయంతో రెండు నెలలు నిద్రలేని రాత్రులు'.. ఎమ్ ఎమ్ కీరవాణి ఆసక్తికర ట్వీట్." Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు