చదలవాడ (నాగులుప్పలపాడు మండలం)

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని గ్రామం
(చదలవాడ(నాగులుప్పలపాడు మండలం) నుండి దారిమార్పు చెందింది)


చదలవాడ, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523183., ఎస్.టి.డి కోడ్ = 08592.

చదలవాడ
రెవిన్యూ గ్రామం
చదలవాడ is located in Andhra Pradesh
చదలవాడ
చదలవాడ
నిర్దేశాంకాలు: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E / 15.633; 80.149Coordinates: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E / 15.633; 80.149 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,639 హె. (4,050 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,053
 • సాంద్రత190/కి.మీ2 (480/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523183 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

మద్దిరాలపాడు 3 కి.మీ, హెచ్.నిడమానూరు 4 కి.మీ, పోతవరం 4 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ, నందిపాడు 5 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

నాగులుప్పలపాడు 2.4 కి.మీ, మద్దిపాడు 7.1 కి.మీ, ఒంగోలు 14.2 కి.మీ, కొరిసపాడు 14.8 కి.మీ.

సమీప మండలాలుసవరించు

పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంసవరించు

వీధి దీపాలుసవరించు

ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం మంజూరయినది. ఈ పథకం క్రింద 25 సౌర విద్యుద్దీపాల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఒక్కో దీపానికి రు. 3500 చొప్పున పంచాయతీ వారు తమ వాటా క్రింద జమ చేయాల్సి ఉంది. దీనికి తగిన నిధులు పంచాతీలో లేనందు వలన, సర్పంచ్ శ్రీ గూడూరు వెంకటరావు, తన స్వంత నిధులు ఒక లక్ష రూపాయలు (దీపాలకు, ఇతర ఖర్చులకు కలిపి) వెచ్చించి, ఈ 25 సౌర విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. దీనితో గ్రామానికి, నిర్వహణ ఖర్చు లేకుండా, నిరంతరంగా విద్యుద్దీపకాంతులు వెలసినవి. [9]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రఘునాయకస్వామి ఆలయంసవరించు

  1. మనదేశంలో దక్షిణ భాగాన వున్న హిందూ ఆలయాల్లోని శ్రీరామునికి కుడివైపున సీతాదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో శ్రీరఘునాయకస్వామి ఆలయం ప్రాచుర్యం పొందింది. సహంజాగా స్వామి వారికి ఎడమవైపున సీతాదేవి వుండటం చూస్తుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఈచతుర్వాటికలో అగస్త్య ముని విగ్రహాలను ప్రతిష్ఠించారు. పూర్వాపరాలను ఒక్కసారి పరికించి చూసినట్లయితే నాగులుప్పలపాడు మండలకేంద్రానికి కూతవేటు దూరంలో దక్షిణవైపు వున్న చదలవాడ గ్రామం ఒకప్పుడు చతుర్వాటికగా ప్రసిద్ధికెక్కింది. అయితే త్రేతయుగంలో సీతాదేవిని రావణుడు అపహరించిన నేపథ్యంలో ఆమెను వెదుకుతూ ఈప్రాంతానికి వచ్చి శ్వేతగిరి అని పిలవబడే ప్రస్తుతం ఆలయం నిర్మింపబడిన స్ధలంలో తపస్సు చేసుకోవడానికి కూర్చొన్నారని అప్పుడు వామభాగాన (ఎడమవైపు)లక్ష్మణుడు వున్నాడని పురాణోక్తి. అందుకే అగస్త్యముని అమ్మవారిని కుడివైపున వుండేలా తరువాత విగ్రహ ప్రతిష్ఠ చేసారని ఆర్యోక్తి. అలాగే సుగ్రీవుని ఆజ్ఞమేరకు వానరసైన్యం సీతాదేవిని వెదకడానికి ఇక్కడినుండే నలుదిక్కులు వెళ్ళారని అందుకే ఈగ్రామం చతుర్వాటికగా పేరొందిందని ప్రతీతి. ఈఆలయానికి ఐదు ప్రాంతాలను శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించేందుకు సంకల్పించారని,తరువాతి కాలంలో ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో వారి మంత్రులు అక్కన్న,మాదన్నల పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది. అద్దంకి సీమ నేలిన రెడ్డిరాజులు కూడా ఈ ఆలయ నిర్వహణలో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. కవిత్రయంలోని ఎర్రన కూడా తనభారత అరణ్య పర్వశేషభాగాన్ని ఇక్కడే తెనుగించాడని చారిత్రక ఆధారాలున్నాయి. ఇంతటి మహత్తరమైన ఆలయ ప్రతిష్ఠకోసం అగస్త్యముని నారదుని ప్రేరణచే బ్రహ్మక మండలం లోని జలాన్ని తెచ్చాడని అది బ్రహ్మకుండిగా నదిగా ప్రసిద్ధి చెంది తదుపరి గుండ్లకమ్మ నదిగా మారిందని తొలుత ఇది ఆలయ ప్రదక్షిణలా ఉత్తరం వైపునుండి దక్షిణం వైపుకు తర్వాత తూర్పునకు ప్రవహించినట్లు ఆతర్వాత ఎడంగా ప్రవహిస్తున్నట్లు ఆర్యోక్తి. ఇంతటి ప్రాశస్త్యం కలిగినగ ఈ ఆలయంలోని స్వామివారికి తిరునాళ్ళు త్రేతాయుగం నుండి శ్రీరామనవమి నుండి తొమ్మిదిరోజులపాటు జరిగి చివరిరోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి తలంబ్రాలు భద్రాచలం నుండి ఇక్కడికి వస్తాయి. ఈ ఘట్టం రోజే ఉదయం 7 గంటలనుండి ప్రారంభమయ్యే కళ్యాణానికి భక్తులు చుట్టుప్రక్క గ్రామాలనుంచేగాక సుదూర ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే తలంబ్రాలు పోయడానికి ముందు ఆకాశ మార్గంలో గరుడపక్షి వచ్చి మూడుసార్లు స్వామివారి కళ్యాణమండపంపై ప్రజక్షిణ చేసిన అనంతరం తలంబ్రాలను పోస్తారు.దీంతో వేలాదిమంది భక్తులు అనాదినుండి గరుడపక్షి ఎప్పుడు వస్తుందా అని ఆకాశ మార్గం వైపు ఎదురుచూస్తూ వుంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథాన్ని లాగడానికి భక్తులు,యువత ఎక్కువసంఖ్యలో పాల్గొని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ యధాస్ధానానికి చేరుకొంటారు. చదలవాడ గ్రామంలో తొమ్మిదిరోజులపాటు పండుగ వాతావరణంలా వుంటుంది. ప్రతి ఇంటిలో తమతమ బంధువులతో ఇళ్లని కళకళలాడుతూ కనిపిస్తాయి.
  2. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మార్చి-19, బుధవారం నాడు కన్నులపండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో, ద్వారతోరణ బలిహరణ, మహా పూర్ణాహుతి, మహా కుంభసంప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయకలశాన్ని, చిన జియ్యరుస్వామి ఏర్పాటుచేశారు. మూలవిరాట్టును ఉదయం 10-08 గంటలకు ప్రతిష్ఠించారు. సీతా, లక్ష్మణ, రఘునాయకస్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు, గరుత్మంతుని విగ్రహం గూడా ఏర్పాటుచేశారు. [5]
  3. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో, 2014 ఏప్రిల్ లో, స్వామివారికి 229 వ శ్రీరామనవమి వేడుకలు జరుగుచున్నవి. [7]

లింగోద్భవస్వామి ఆలయంసవరించు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలోని స్వామివారికి దాత, 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారంనాడు, మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కొప్పోలు ఆంజనేయులు దంపతులు వెండి కిరీటాన్ని, కర్ణపత్రాలనూ సమర్పించారు. వీటిని అదే రోజున స్వామివారికి అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. [11]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో హనుమజ్జయంతికి వారంరోజులపాటు సప్తాహవేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరిరోజున స్వామివారికి ఘనంగా ఊంజల్ సేవ, విశేష అలంకరణ, రథోత్సవం నిర్వహించెదరు. భక్తులు స్వామివారికి హారతులిచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు. [8]

ఆధ్యాత్మిక విశేషాలుసవరించు

శ్రీరంగం పీఠాధిపతి శ్రీ లక్మీనర్సింహబట్టల్, జనవరి-12,2014న ఈ గ్రామాన్ని సందర్శించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం చదలవాడలోని ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [3]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

Dasari Balakrishna.

గ్రామ విశేషాలుసవరించు

ఇక్కడ ఒక ఒంగోలు గిత్తల పశుక్షేత్రం ఉంది. మొదట ఈ క్షేత్రం రామతీర్ధంలో ఉండేది. అక్కడ గెలాక్సీ నిక్షేపాలు ఉండటంతో, ఇక్కడకు మార్చారు. ఇక్కడి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం రఘునాధస్వామివారికి చెందిన 200 ఎకరాల భూమిని ఈ పశువుల క్షేత్రానికి ఇచ్చారు. ఈ పశువుల క్షేత్ర పరిధిలో గుండ్లకమ్మ నది నుండి నీటిని పొలాలకు పంపించి, గడ్డిపెంచటం కోసం, ఒక పంపు హౌసు ఏర్పాటు చేశారు. వేసవిలో పశువులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచేటందుకు, 8 ఎకరాల చెరువును గూడా ఏర్పాటుచేశారు. అయినా, ప్రస్తుతం ఈ క్షేత్రం పనితీరు అంత సంతృప్తిగా లేదు. [6]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,550.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,332, మహిళల సంఖ్య 1,218, గ్రామంలో నివాస గృహాలు 608 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,639 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,053 - పురుషుల సంఖ్య 1,539 - స్త్రీల సంఖ్య 1,514 - గృహాల సంఖ్య 783

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం, డిసెంబరు-31,2013. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జనవరి-13; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-27; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మార్చి-19; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2014,ఏప్రిల్-9; 3వ పేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014; ఏప్రిల్-11; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-31; 1వ పేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగస్టు-29; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఫిబ్రవరి-14; 2వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఫిబ్రవరి-25; 1వపేజీ.