చదలవాడ (నాగులుప్పలపాడు మండలం)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని గ్రామం


చదలవాడ ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 783 ఇళ్లతో, 3053 జనాభాతో 1639 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1539, ఆడవారి సంఖ్య 1514. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 911 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 116. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591034.[2].

చదలవాడ (నాగులుప్పలపాడు మండలం)
పటం
చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) is located in ఆంధ్రప్రదేశ్
చదలవాడ (నాగులుప్పలపాడు మండలం)
చదలవాడ (నాగులుప్పలపాడు మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 15°36′33.624″N 80°5′33.900″E / 15.60934000°N 80.09275000°E / 15.60934000; 80.09275000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంనాగులుప్పలపాడు
విస్తీర్ణం16.39 కి.మీ2 (6.33 చ. మై)
జనాభా
 (2011)[1]
3,053
 • జనసాంద్రత190/కి.మీ2 (480/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,539
 • స్త్రీలు1,514
 • లింగ నిష్పత్తి984
 • నివాసాలు783
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523183
2011 జనగణన కోడ్591034

సమీప గ్రామాలు

మార్చు

మద్దిరాలపాడు 3 కి.మీ, హెచ్.నిడమానూరు 4 కి.మీ, పోతవరం 4 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ, నందిపాడు 5 కి.

మౌలిక సదుపాయాలు

మార్చు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

మార్చు

వీధి దీపాలు

మార్చు

ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం మంజూరయినది. ఈ పథకం క్రింద 25 సౌర విద్యుద్దీపాల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఒక్కో దీపానికి రు. 3500 చొప్పున పంచాయతీ వారు తమ వాటా క్రింద జమ చేయాల్సి ఉంది. దీనికి తగిన నిధులు పంచాతీలో లేనందు వలన, సర్పంచ్ శ్రీ గూడూరు వెంకటరావు, తన స్వంత నిధులు ఒక లక్ష రూపాయలు (దీపాలకు, ఇతర ఖర్చులకు కలిపి) వెచ్చించి, ఈ 25 సౌర విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. దీనితో గ్రామానికి, నిర్వహణ ఖర్చు లేకుండా, నిరంతరంగా విద్యుద్దీపకాంతులు వెలసినవి. [9]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రఘునాయకస్వామి ఆలయం

మార్చు
  1. మనదేశంలో దక్షిణ భాగాన వున్న హిందూ ఆలయాల్లోని శ్రీరామునికి కుడివైపున సీతాదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో శ్రీరఘునాయకస్వామి ఆలయం ప్రాచుర్యం పొందింది. సహంజాగా స్వామి వారికి ఎడమవైపున సీతాదేవి వుండటం చూస్తుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఈచతుర్వాటికలో అగస్త్య ముని విగ్రహాలను ప్రతిష్ఠించారు. పూర్వాపరాలను ఒక్కసారి పరికించి చూసినట్లయితే నాగులుప్పలపాడు మండలకేంద్రానికి కూతవేటు దూరంలో దక్షిణవైపు వున్న చదలవాడ గ్రామం ఒకప్పుడు చతుర్వాటికగా ప్రసిద్ధికెక్కింది. అయితే త్రేతయుగంలో సీతాదేవిని రావణుడు అపహరించిన నేపథ్యంలో ఆమెను వెదుకుతూ ఈప్రాంతానికి వచ్చి శ్వేతగిరి అని పిలవబడే ప్రస్తుతం ఆలయం నిర్మింపబడిన స్ధలంలో తపస్సు చేసుకోవడానికి కూర్చొన్నారని అప్పుడు వామభాగాన (ఎడమవైపు)లక్ష్మణుడు వున్నాడని పురాణోక్తి. అందుకే అగస్త్యముని అమ్మవారిని కుడివైపున వుండేలా తరువాత విగ్రహ ప్రతిష్ఠ చేసారని ఆర్యోక్తి. అలాగే సుగ్రీవుని ఆజ్ఞమేరకు వానరసైన్యం సీతాదేవిని వెదకడానికి ఇక్కడినుండే నలుదిక్కులు వెళ్ళారని అందుకే ఈగ్రామం చతుర్వాటికగా పేరొందిందని ప్రతీతి. ఈఆలయానికి ఐదు ప్రాంతాలను శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించేందుకు సంకల్పించారని,తరువాతి కాలంలో ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో వారి మంత్రులు అక్కన్న,మాదన్నల పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది. అద్దంకి సీమ నేలిన రెడ్డిరాజులు కూడా ఈ ఆలయ నిర్వహణలో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. కవిత్రయంలోని ఎర్రన కూడా తనభారత అరణ్య పర్వశేషభాగాన్ని ఇక్కడే తెనుగించాడని చారిత్రక ఆధారాలున్నాయి. ఇంతటి మహత్తరమైన ఆలయ ప్రతిష్ఠకోసం అగస్త్యముని నారదుని ప్రేరణచే బ్రహ్మక మండలం లోని జలాన్ని తెచ్చాడని అది బ్రహ్మకుండిగా నదిగా ప్రసిద్ధి చెంది తదుపరి గుండ్లకమ్మ నదిగా మారిందని తొలుత ఇది ఆలయ ప్రదక్షిణలా ఉత్తరం వైపునుండి దక్షిణం వైపుకు తర్వాత తూర్పునకు ప్రవహించినట్లు ఆతర్వాత ఎడంగా ప్రవహిస్తున్నట్లు ఆర్యోక్తి. ఇంతటి ప్రాశస్త్యం కలిగినగ ఈ ఆలయంలోని స్వామివారికి తిరునాళ్ళు త్రేతాయుగం నుండి శ్రీరామనవమి నుండి తొమ్మిదిరోజులపాటు జరిగి చివరిరోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి తలంబ్రాలు భద్రాచలం నుండి ఇక్కడికి వస్తాయి. ఈ ఘట్టం రోజే ఉదయం 7 గంటలనుండి ప్రారంభమయ్యే కళ్యాణానికి భక్తులు చుట్టుప్రక్క గ్రామాలనుంచేగాక సుదూర ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే తలంబ్రాలు పోయడానికి ముందు ఆకాశ మార్గంలో గరుడపక్షి వచ్చి మూడుసార్లు స్వామివారి కళ్యాణమండపంపై ప్రజక్షిణ చేసిన అనంతరం తలంబ్రాలను పోస్తారు.దీంతో వేలాదిమంది భక్తులు అనాదినుండి గరుడపక్షి ఎప్పుడు వస్తుందా అని ఆకాశ మార్గం వైపు ఎదురుచూస్తూ వుంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథాన్ని లాగడానికి భక్తులు,యువత ఎక్కువసంఖ్యలో పాల్గొని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ యధాస్ధానానికి చేరుకొంటారు. చదలవాడ గ్రామంలో తొమ్మిదిరోజులపాటు పండుగ వాతావరణంలా వుంటుంది. ప్రతి ఇంటిలో తమతమ బంధువులతో ఇళ్లని కళకళలాడుతూ కనిపిస్తాయి.
  2. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మార్చి-19, బుధవారం నాడు కన్నులపండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో, ద్వారతోరణ బలిహరణ, మహా పూర్ణాహుతి, మహా కుంభసంప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయకలశాన్ని, చిన జియ్యరుస్వామి ఏర్పాటుచేశారు. మూలవిరాట్టును ఉదయం 10-08 గంటలకు ప్రతిష్ఠించారు. సీతా, లక్ష్మణ, రఘునాయకస్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు, గరుత్మంతుని విగ్రహం గూడా ఏర్పాటుచేశారు.
  3. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో, 2014 ఏప్రిల్ లో, స్వామివారికి 229 వ శ్రీరామనవమి వేడుకలు జరుగుచున్నవి.

లింగోద్భవస్వామి ఆలయం

మార్చు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలోని స్వామివారికి దాత, 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారంనాడు, మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కొప్పోలు ఆంజనేయులు దంపతులు వెండి కిరీటాన్ని, కర్ణపత్రాలనూ సమర్పించారు. వీటిని అదే రోజున స్వామివారికి అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో హనుమజ్జయంతికి వారంరోజులపాటు సప్తాహవేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరిరోజున స్వామివారికి ఘనంగా ఊంజల్ సేవ, విశేష అలంకరణ, రథోత్సవం నిర్వహించెదరు. భక్తులు స్వామివారికి హారతులిచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు.

ఆధ్యాత్మిక విశేషాలు

మార్చు

శ్రీరంగం పీఠాధిపతి శ్రీ లక్మీనర్సింహబట్టల్, జనవరి-12,2014న ఈ గ్రామాన్ని సందర్శించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం చదలవాడలోని ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామ విశేషాలు

మార్చు

ఇక్కడ ఒక ఒంగోలు గిత్తల పశుక్షేత్రం ఉంది. మొదట ఈ క్షేత్రం రామతీర్ధంలో ఉండేది. అక్కడ గెలాక్సీ నిక్షేపాలు ఉండటంతో, ఇక్కడకు మార్చారు. ఇక్కడి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం రఘునాధస్వామివారికి చెందిన 200 ఎకరాల భూమిని ఈ పశువుల క్షేత్రానికి ఇచ్చారు. ఈ పశువుల క్షేత్ర పరిధిలో గుండ్లకమ్మ నది నుండి నీటిని పొలాలకు పంపించి, గడ్డిపెంచటం కోసం, ఒక పంపు హౌసు ఏర్పాటు చేశారు. వేసవిలో పశువులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచేటందుకు, 8 ఎకరాల చెరువును గూడా ఏర్పాటుచేశారు. అయినా, ప్రస్తుతం ఈ క్షేత్రం పనితీరు అంత సంతృప్తిగా లేదు. [6]

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,550. ఇందులో పురుషుల సంఖ్య 1,332, మహిళల సంఖ్య 1,218, గ్రామంలో నివాస గృహాలు 608 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,639 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి నాగులుప్పలపాడులోను, మాధ్యమిక పాఠశాల మద్దిరాలపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మద్దిపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల మద్దిరాలపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ONGOLలోను, పాలీటెక్నిక్‌ చేకూరుపాడులోను, మేనేజిమెంటు కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

చదలవాడలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

చదలవాడలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

చదలవాడలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 165 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1473 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1466 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 6 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

చదలవాడలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • ఇతర వనరుల ద్వారా: 6 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

చదలవాడలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

నువ్వులు, శనగ, పొగాకు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు