చర్చ:టీ.జి. కమలాదేవి
Untitled
మార్చుఈ వారం వ్యాసం పరిగణనకు ఈ వ్యాసం అర్హమైనదేనా? --నవీన్ 03:15, 13 జూన్ 2007 (UTC)
- తప్పకుండా. ఈమె గురించి చాలామందికి తెలియదనుకుంటా నాకైతే ఈ వ్యాసం చదివేవరకు తెలియలేదు --వైజాసత్య 03:19, 13 జూన్ 2007 (UTC)
http://www.cinegoer.com/titbits.htm నుండి
- తెవికీ లొ చాలా అంశాలు చదివేవరకు నాకూ తెలియవు.--మాటలబాబు 03:09, 12 జూలై 2007 (UTC)
suddhiki praSna
మార్చు" ఓ సారి 'జ్ఞాన సుందరి' నాటకం వేస్తుండగా నాగయ్య గారితో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూడడానికి వచ్చారు. పిఠాపురం రాజవారు కమలాదేవి నటించిన 'సక్కుబాయి' నాటకాన్ని చూసి అందులొ ఈమె బాగా నటించినందుకు బంగారపు గొలుసు ప్రదానం చేస్తానని చెప్పినా , సమయానికి రాజా వారు తన మెడలొ గొలుసు లేకపోవడంతో మరో కార్యక్రమంలో రాజావారు ఈమె కు గొలుసు బహుమానం చేశారు. "
- రెండు వాక్యాలు చదువుతుంటే continuity లేదు, ఒకసారి వాక్యాలు పరిశీలించి మార్పుల కొరకు చర్చ జరపాలి --మాటలబాబు 02:44, 12 జూలై 2007 (UTC)
- ఇక్కడ రెండు వేర్వెరు సంఘటనలు ఉన్నాయి
- " ఓ సారి 'జ్ఞాన సుందరి' నాటకం వేస్తుండగా నాగయ్య గారితో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూడడానికి వచ్చారు.
- పిఠాపురం రాజవారు కమలాదేవి నటించిన 'సక్కుబాయి' నాటకాన్ని చూసి అందులొ ఈమె బాగా నటించినందుకు బంగారపు గొలుసు ప్రదానం చేస్తానని చెప్పినా , సమయానికి రాజా వారు తన మెడలొ గొలుసు లేకపోవడంతో మరో కార్యక్రమంలో రాజావారు ఈమె కు గొలుసు బహుమానం చేశారు. "
నా సవరణ
- "కమలాబాయి నటించిన జ్ఞాన సుందరి నాటకాన్ని నాగయ్యతో పాటు పలువులు ప్రముఖలు ప్రముఖులు చూశారు" (చూసి ఆమె నటనను అభినందించారు ..అని ఉంటే వాక్యం ఉంకా బాగుంటుంది కానీ అభినందించారో లేదో మనకు తెలియదే ;-)). సక్కుబాయి నాటకంలో కమలాదేవి నటనకు (ముగ్ధుడై/మెచ్చుకోలుగా) పిఠాపురం రాజా ఆమెకు బంగారు గొలుసు బహుమతిని ప్రకటించాడు. అయితే సమయానికి ఆయన దగ్గర గొలుసు లేకపోవడంవలన కమలాబాయి పాల్గొన్న మరో కార్యక్రమంలో రాజాగారు ఆమెకు గొలుసు ప్రధానం చేశాడు.
--వైజాసత్య 02:58, 12 జూలై 2007 (UTC)
- నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి.
- వాక్యం మధ్యలొ ఉన్న అభిమాన రంగం అనే మాట నాకు అర్థం కావడం లేదు--మాటలబాబు 03:26, 12 జూలై 2007 (UTC)
- అభిమాన రంగం అంటే ఆమెకు వివిధ రంగాలలో ప్రవేశముందికదా అందులో ఆమె బాగా అభిమానించే రంగం నాటకరంగమని. ఈ వాక్యాన్ని "నాటక రంగమంటే ఆమెకు ప్రత్యేక అభిమానమున్నది. అదే ఆమె ప్రధాన వ్యాపకం" అని తిరిగిరాయచ్చనుకుంటా --వైజాసత్య 03:44, 12 జూలై 2007 (UTC)
సినిమాల జాబితా - మూలం
మార్చుఈ సినిమాల జాబితా ఎక్కడిది. IMDBలో చూస్తే నాకు అన్ని సినిమాలు కనిపించలేదు. ఇంకెకడినుంచయినా తీసుకుని వాచ్చామా. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 05:57, 12 జూలై 2007 (UTC)
- కొన్ని ఈ వ్యాసంలోనే వివిధ చోట్ల ప్రస్తావించబడ్డాయి. ఇంకో లింకు. అమె ఒక ఇంటర్యూలో 50దాకా సినిమాలు నటించినట్లు చెప్పుకొన్నది (లింకు మళ్ళీ వెతుకుతా) (చాలామటుకు సహాయపాత్రలు కావచ్చు) అందుకే సమాచారం దొరకటం కష్టం. ఇక్కడ ఐ.ఎం.డి.బి సమగ్రం (కేవలం 1800 తెలుగు సినిమాలే ఉన్నాయి) కాదని గుర్తుచేసుకోవాలి --వైజాసత్య 06:43, 12 జూలై 2007 (UTC)
ఇంకో కమాలాదేవి???
మార్చుఇంకో కమలాదేవి ఎవెరయినా ఉన్నారా? ఇక్కడ మరియు ఇక్కడ కమలాదేవి రెండు ఆంగ్ల(పాశ్చాత్య) సినిమాలలో నటించినట్లు ఉంది. అవి కూడా 1962, 1964లలో విడుదలయిన సినిమాలు. ఇద్దరు కామాలా దేవిలా, లేక ఇద్దరూ ఒక్కరేనా???
- ఆంగ్ల సినిమాలలో నటించినామే ఇంకో కమలా దేవి. IMDBలో చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 07:03, 12 జూలై 2007 (UTC)
- వీళ్ళిద్దరూ వేర్వేరు అనుకుంటా ఈ లింకులో 8 మరియు 24 సంఖ్యలలో కమాలాదేవులున్నారు. మొదటామె ఆంగ్ల సినిమాల్లో నటించినామె. రెండవ ఆమె తెలుగు సినిమా నటి. మొదటి కమలాదేవి పుట్టింది బొంబాయి మరియు ఇద్దరు ఆంగ్లేయులను పెళ్ళి చేసుకున్నట్టుంది --వైజాసత్య 07:13, 12 జూలై 2007 (UTC)
స్నూకర్
మార్చుకమలాదేవి సినిమాలలో నటించిందని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆమె నటించిన సినిమాలే అందుకు ఉదాహరణ. మరి స్నూకర్ ఆడింది, అని చెప్పటానికి ఒక్క రుజువు కూడా లేదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 07:20, 12 జూలై 2007 (UTC)
- స్నూకర్ ఆడిందనటానికే బోలెడన్ని పటిష్ట ఆధారాలున్నాయి. కాకపోతే ఇక్కడ కిటుకేంటంటే ఈ స్నూకర్ ఆడటం 54వ యేట ప్రారంభించింది. అప్పటికి ఆమెకు పెళ్లై చాలా యేళ్ళయ్యింది కాబట్టి భర్త ఆవుల చంద్రబాబు నాయుడు పేరుమీదుగా కమలా చంద్రబాబుగా వ్యవహరించబడింది. ఈమె గురించి పెద్దగా సమాచారం దొరకటం లేదేంటబ్బా అనుకుంటున్న నాకు ఈ లింకు తాళం తెరిచింది. అంతే కమలా చంద్రబాబు పేరుతో శోధిస్తే గూగూల్లో చాలా సమాచారం ప్రత్యక్షం--వైజాసత్య 07:35, 12 జూలై 2007 (UTC)
- చర్చా బాగా జరుగుతొంది--మాటలబాబు 08:30, 12 జూలై 2007 (UTC)
ఆంగ్ల పేరు
మార్చువ్యాసానికి అంగ్ల పేరు అవసరమా.. తెలుగు వికి కదా ఇది--మాటలబాబు 03:48, 13 జూలై 2007 (UTC)
- అవును, ఇంగ్లీషు పేర్లతో పేజీలు వద్దు. ఇంగ్లీషుతో Kamala అని శోధిస్తే ఈ వ్యాసంతో పాటూ అనువాదాలు చేయాల్సిన ఆంగ్ల పేజీలు కూడా కనిపిస్తాయి. తెలుగు వికీలో ఎక్కడ చూసినా అక్కడ ఆంగ్లము కనిపిస్తే కొత్తవాళ్ళు కూడా ఆంగ్లములోనే రాయటానికి సిద్ధపడతారు. అదీకాక ఇక తెలుగులో శోధించటం ఎన్నటికీ అలవాటు కాదు. (తెలుగులో శోధించటం అలవాటు చెయ్యడం వికీ లక్ష్యం కాకపోయినా...తెవికీ సముదాయం యొక్క ఆకాంక్షగా నేను భావిస్తున్నాను.) ఇక ఇంగ్లీషులోనే శోధిస్తూ ఉంటే ఇంగ్లీషు వికీనే చదువుకోవచ్చు కదా అన్న ఆలోచన కూడా వస్తుంది. అప్పుడు తెలుగు వికీకి సార్ధకత ఉండదు). పద్మగారు మంచి సమస్యను బయటికి తెచ్చారు. ఆల్గారిథం మార్పించటానికి ప్రయత్నం చేద్దాం. తాత్కాలిక పరిష్కారంగా విస్తృత శోధనా పేజీనుండి గూగుల్ శోధనా యంత్రంతో శోధించేటట్టు ఏర్పాటు చేద్దాం. --వైజాసత్య 04:03, 13 జూలై 2007 (UTC)
ఆటలు, క్రీడారంగం
మార్చుఆటలు, క్రీడారంగం అని రెండు విభాగాలున్నాయి. వీటిని కలిపేయాలి. కానీ అందులోని సమాచారానికి పొంతన కుదరట్లేదు. చిక్కుతెచ్చిన కొన్ని అంశాలు
- ఆటల విభాగంలో 1947లో బిలియర్డ్స్ నేర్చుకుంది అని ఉంది అంటే 17-18యేళ్ల వయసులో. క్రీడారంగం విభాగములో 54 యేళ్లకి స్నూకర్ నేర్చుకున్నదని వ్రాసి ఉంది. ఏది నిజం?
54యేళ్ళ వ్యాఖ్యకు మూలమైన ఈ మనీస్ స్పేసనే లైవ్ స్పేసెస్ టపాలో శీర్షిక గమనిస్తే ఇది TOI (టైమ్స్ ఆఫ్ ఇండియా)లో వచ్చిన వ్యాసంగా కనిపిస్తుంది. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా సైట్లో వెతికితే దొరకలేదు??? --వైజాసత్య 13:49, 13 జూలై 2007 (UTC)
- నేను ఇప్పటికే "ఆటలు" అని ఇంకో విభాగం ఉండటాన్ని గమనించలేదు. కానీ ఆ విభాగంలో ఉన్న "1947లో బిలియర్డ్స్ నేర్చుకుంది" అనే వాఖ్యానికి సరయిన మూలంలేదు. ఇంకా నేను చేర్చిన "54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్‌ను ఆడటం ప్రారంభించింది" అనే వాఖ్యానికి ఒక మూలం ఉన్నా కూడా అది ఒక బ్లాగు, దానిని మనం అసలు సిసలు మూలంగా పరిగనించలేము. మొదటి దానికి కూడా ఏదో ఒక మూలం దొరికితే రెండు వాక్యాలను ఉంచేసి చదివేరికే ఏది సరయినదో అని తేల్చుకునే పనిని వదిలేద్దాం. సరయిన మూలం దొరికినప్పుడు ఈ రెండు వాక్యాలనూ సరి చేద్దాం. అలాగే స్నూకర్, బిలియర్డ్స్ రెండూ వేరు వేరు ఆటలు, కానీ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. మిగతాదంతా నేను, ఇంతకు ముందు ఉన్న సమాచారాన్ని చూడకుండా, మళ్ళీ రాసినట్లున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 14:50, 13 జూలై 2007 (UTC)
ఈ వారం వ్యాసం
మార్చుఈ వ్యాసం యొక్క ఈ వెర్షనును ఈ-మెయిలు ద్వారా పంపుతున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:04, 15 జూలై 2007 (UTC)