వినోద్ తెలుగు చలనచిత్ర నటుడు. 1980వ సంవత్సరంలో విడుదైన కీర్తి కాంత కనకం సినిమాతో సినీరంగప్రవేశం చేసిన వినోద్, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు.[1]

వినోద్
జననంఅరిసెట్టి నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు జిల్లా
మరణంజూలై 14, 2018
హైదరాబాద్
మరణ కారణంబ్రెయిన్ స్ట్రోక్‌
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లువినోద్
వృత్తినటుడు
భార్య / భర్తవీనావతి
పిల్లలుశిరీష, సురేష్‌, తేజస్వి

వినోద్ గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

వినోద్‌ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (రెండు హిందీ సినిమాలు, 28 తమిళ సినిమాలు) తోపాటూ అనేక టీవీ ధారవాహికల్లో కూడా నటించాడు.

నటించిన సినిమాలు

మార్చు
  1. నల్లత్రాచు (1987)
  2. లారీ డ్రైవర్ (1990)
  3. ఆయుధం (1990)
  4. చంటి (1991)
  5. చిట్టెమ్మ మొగుడు (1992)
  6. అసాధ్యులు (1992)
  7. భైరవద్వీపం (1994)
  8. సాంబయ్య (1999)
  9. డార్లింగ్ డార్లింగ్ (2001)
  10. ఇంద్ర (2002)
  11. 24 గంటలు (2004)
  12. నేనుసైతం (2004)
  13. శంఖారావం (2004)
  14. నరసింహనాయుడు (2001)

వినోద్ 2018, జూలై 14 శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాదు లో మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి (14 July 2018). "టాలీవుడ్‌ నటుడు వినోద్‌ మృతి". Archived from the original on 14 July 2018. Retrieved 14 July 2018.