చూడాలని వుంది
చూడాలని ఉంది 1998లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, సౌందర్య, ప్రకాష్ రాజ్, అంజలా జవేరి ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించాడు. దివాకర్ బాబు మాటలు రాశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఈ చిత్ర సంగీతానికి గాను మణిశర్మకు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
చూడాలనివుంది | |
---|---|
దర్శకత్వం | గుణశేఖర్ |
రచన | గుణశేఖర్, దివాకర్ బాబు (సంభాషణలు) |
నిర్మాత | సి. అశ్వనీదత్ |
తారాగణం | చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి, ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఆగస్టు 27, 1998 |
భాష | తెలుగు |
కథ
మార్చురామకృష్ణ అనే వ్యక్తి కలకత్తాకు కొత్తగా రావడంతో కథ మొదలవుతుంది. బెంగాలీ భాష తెలియక ఇబ్బంది పెడుతూ ఒక చిన్న అపార్టుమెంటుకు చేరుకుంటాడు. అక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు ఆ అపార్టుమెంటును నిర్వహిస్తూ ఉంటారు. వారితో మాట్లాడి ఎప్పట్నుంచో అద్దె కట్టకుండా ఓ గదిలో ఉంటున్న పద్మావతి అనే తెలుగు అమ్మాయితో పాటు గదిలో దిగుతాడు. పద్మావతిని ప్రేమ పేరుతో మోసం చేసి పారిపోయి ఉంటాడు.
తారాగణం
మార్చు- రామకృష్ణ గా చిరంజీవి
- పద్మావతి గా సౌందర్య
- తేజ సజ్జా
- అంజలా జవేరి
- మహేంద్రగా ప్రకాష్ రాజ్
- బ్రహ్మానందం
- ఎం. ఎస్. నారాయణ
- లక్ష్మీపతి
- బ్రహ్మాజీ
- వేణు మాధవ్
- ఆహుతి ప్రసాద్
- అల్లు రామలింగయ్య
- గుండు హనుమంతరావు
- ధూళిపాళ
- మోనికా బేడి
సాంకేతిక వర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
- మాటలు: దివాకర్ బాబు
- కెమెరా: ఛోటా కె. నాయుడు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- కళ: తోట తరణి
- నృత్యాలు: రాఘవ లారెన్స్, సరోజ్ ఖాన్
- పోరాటాలు: ఎస్. విజయన్
విశేషాలు
మార్చు- సినిమాలో చాలాభాగం కలకత్తాలో చిత్రీకరించారు.
- ఈ సినిమాలో " రామ్మా చిలకమ్మా " అనే పాట ఉదిత్ నారాయణ్ కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది.
పాటలు
మార్చుఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు, చంద్రబోస్ పాటలు రాశారు.[2] మణి శర్మకు నంది పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా దక్కింది.
- అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత)
- యమహా నగరి (గాయకుడు: హరిహరన్)
- రామ్మా చిలకమ్మా (గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
- ఒ మారియ ఒ మారియ (గానం: శంకర్ మహదేవన్)
- మనస్సా ఎప్పుడొచ్చావ్ (గాయకులు: బాలు, సుజాత)
- సింబలే సింబలే (గాయకులు: బాలు, చిత్ర)
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్: పి. మధుసూధన్ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ "Choodalani Vundi box office report Archives". Telugu360.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
- ↑ "Megastar Chiranjeevi Choodalani Vundi Completes 21 Years". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-27. Retrieved 2020-11-24.