లక్ష్మీపతి (నటుడు)

హాస్య నటుడు

లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.

లక్ష్మీపతి
జననం
లక్ష్మీపతి
వృత్తినటుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2000 - 2008
బంధువులుశోభన్ (సోదరుడు)

నటుడిగా మార్చు

లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. తరువాత అల్లరి, కితకితలు లాంటి సినిమాలో హాస్య పాత్రలు పోషించాడు.

సినిమాలు మార్చు

మరణం మార్చు

ఆయన స్నానాల గదిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కిందపడిపోయి మరణించాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతని భౌతిక కాయాన్ని గుర్తించారు. [2]

మూలాలు మార్చు

  1. "Lakshmipati Kalpana Rai are no more". indiaglitz.com. Archived from the original on 3 డిసెంబరు 2015. Retrieved 19 August 2016.
  2. "Veteran comedian Lakshmipati life history and film career". www.nettv4u.com. Archived from the original on 22 ఆగస్టు 2016. Retrieved 19 August 2016.

బయటి లింకులు మార్చు