జాతీయ తెలుగు వారపత్రిక జనధర్మ 27 నవంబర్, 1958లో ప్రారంభమైనది[1]. వరంగల్లు నుండి ప్రతి గురువారం వెలువడేది. 1976 నుండి ఈ పత్రిక వారాని రెండుసార్లు ప్రతి సోమవారం, ప్రతి గురువారం వెలువడేది. ఎం.ఎస్.ఆచార్య ఈ పత్రికను నడిపాడు. ఈ పత్రిక పతాక శీర్షిక పై భాగాన అనవరత జాగరమే ప్రజాస్వామ్య సుస్థిరతకు ఆధారము అనే వాక్యాన్ని ప్రచురించేవారు. ఈ పత్రికలో దేశ, రాష్ట్ర, ప్రాంతీయ వార్తలతో పాటుగా, కథలు, ఏకాంకికలు, గేయనాటికలు, కవితలు, సీరియల్ నవలలు ప్రచురితమయ్యాయి.THE LARGEST CIRCULATED BI-WEEKLY IN APగా ఈ పత్రిక గుర్తించబడింది. వరంగల్లుకు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాకతీయ కాలువ, కాకతీయ విశ్వవిద్యాలయ స్థాపన, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు తెప్పించటం లాంటి అనేక అభివృద్ధి పనులను వరంగల్లుకు సాధించి పెట్టడంలో ఈ పత్రిక కృషి ఉంది.[2]

జనధర్మ
జనధర్మ ప్రారంభ సంచిక మొదటిపేజీ
జనధర్మ
రకంప్రతి గురువారం వారపత్రిక
రూపం తీరుటాబ్లాయిడ్
ప్రచురణకర్తఎం.శంకరరావు
సంపాదకులుఎం.శంకరరావు
సహ సంపాదకులుఎం.ఎస్.ఆచార్య, టి.వై.నరసింహాచార్య
స్థాపించినది27-11-1958
భాషతెలుగు
కేంద్రంవరంగల్లు

శీర్షికలు మార్చు

  • లంబోదరాయణం
  • నారదవీణ
  • గీతామృతం
  • గ్రామాయణం
  • మన పార్లమెంటు
  • లేఖావళి
  • వాణిజ్యరంగం
  • రూప్య శతకం
  • స్థానిక వార్తలు
  • క్రీడావని
  • కులాసా కబుర్లు
  • రాజధాని విశేషాలు
  • భావతరంగిణి
  • జనవాణి
  • పుస్తక సమీక్ష
  • చిత్ర సమీక్ష
  • శేషధర్మములు
  • చాణక్య నీతి సూత్రములు
  • మిర్చీ-మసాలా
  • కళారవళి
  • ఇంతే సంగతులు
  • కత్తిరింపులు
  • జీవనగమ్యం
  • చదువు సంధ్యలు
  • మినీమనసులు
  • వార్తాలేఖ మొదలైనవి.

రచయితలు మార్చు

మూలాలు మార్చు

  1. అకాడెమీ ఆర్కీవ్స్‌లో జనధర్మ ప్రతి[permanent dead link]
  2. కోవెల, సంతోష్ కుమార్. "అక్షరాయుధంతో అలుపెరుగని పోరు". ఆనందిని. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 30 January 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=జనధర్మ&oldid=3923306" నుండి వెలికితీశారు