జయమ్ము నిశ్చయమ్మురా (2016 సినిమా)
జయమ్ము నిశ్చయమ్మురా 2016లో కనుమూరి శివరాజ్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీనివాస రెడ్డి, పూర్ణ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు.
జయమ్ము నిశ్చయమ్మురా | |
---|---|
దర్శకత్వం | కనుమూరి శివరాజ్ |
స్క్రీన్ ప్లే | కనుమూరి శివరాజ్ పరం సూర్యాంషు |
కథ | కనుమూరి శివరాజ్ |
నిర్మాత | కనుమూరి శివరాజ్ సతీష్ శివరాజ్ |
తారాగణం | శ్రీనివాసరెడ్డి పూర్ణ పోసాని కృష్ణమురళి శ్రీ విష్ణు కృష్ణుడు (నటుడు) రవివర్మ కృష్ణ భగవాన్ ప్రవీణ్ తాగుబోతు రమేష్ |
ఛాయాగ్రహణం | నాగేష్ బానెల్ |
కూర్పు | వెంకట్ |
సంగీతం | రవిచంద్ర |
నిర్మాణ సంస్థ | కనుమూరి శివరాజ్ |
పంపిణీదార్లు | శ్రేష్ఠ్ మూవీస్ |
విడుదల తేదీ | 25 నవంబరు 2016 |
సినిమా నిడివి | 162 నిమిషాలు |
దేశం | India |
భాష | తెలుగు |
కథ
మార్చుసర్వేష్ అలియాస్ సర్వమంగళం కరీంగనర్‌లోని సదాశివపల్లెలో తన తల్లితో కలిసి ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అన్నీ ప్రయత్నాలు చేస్తుంటాడు.అయితే సర్వమంగళం(శ్రీనివాసరెడ్డి) మూఢనమ్మకాలను కూడా బాగా నమ్ముతుంటాడు. సర్వ మంగళం మూఢనమ్మకాలను, అమాయకత్వాన్ని పితా(జీవా) క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా సర్వమంగళంకు కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కోసం ఆనారోగ్యంతో బాధపడే తల్లిని విడిచిపెట్టలేక, తల్లి కోసం తొందరగా ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని కరీంనగర్‌కు వచ్చేస్తానని తల్లికి మాట ఇచ్చి బయలుదేరుతాడు సర్వమంగళం. కాకినాడ చేరుకున్న సర్వమంగళం అమాయకత్వాన్ని చూసి అందరూ అతన్ని చిన్నచూపు చూస్తుంటారు.
ఓ రోజు రాణి(పూర్ణ)ని ప్రేమలో పడ్డ సర్వమంగళం ఆమె సమాధానం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. సర్వమంగళం పనిచేసే మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న మీ సేవ ఆఫీస్‌లో పనిచేసే రాణికి ఓ నర్సరీ ప్రారంభించాలనే కోరిక ఉంటుంది. సర్వమంగళం భయంతో రాణికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమను చెప్పాలనుకుంటున్న తరుణంలో రాణి మరెవరినో ప్రేమిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ రాణీ ప్రేమించేదెవరిని? సర్వమంగళం తన ప్రేమను గెలిపించుకున్నాడా? జె.సికి, సర్వమంగళంకు ఉన్న గొడవేంటి? అనే విషయాలు మిగతా కథలో భాగం.[1]
తారాగణం
మార్చు- సర్వేష్ అలియాస్ సర్వమంగళం గా శ్రీనివాసరెడ్డి
- రాణి గా పూర్ణ
- జె. సి గా రవివర్మ
- శ్రీవిష్ణు
- సర్వేష్ తల్లి గా డబ్బింగ్ జానకి
- కృష్ణ భగవాన్
- పోసాని కృష్ణమురళి
- హోటల్ సర్వరు గా గుండు సుదర్శన్
- ప్రభాస్ శ్రీను
- కారుమంచి రఘు
- పితా గా జీవా
- ప్రవీణ్
- రాహుల్ రామకృష్ణ
- జోగి బ్రదర్స్
- జి. వి. నారాయణరావు
సాంకేతికవర్గం
మార్చు- సమర్పణ: ఎ.వి.ఎస్.రాజు
- నిర్మాణ సంస్థ: శివరాజ్ ఫిలింస్
- ఆర్ట్: రఘుకులకర్ణి
- కూర్పు: వెంకట్,
- సంగీతం: రవిచంద్ర
- నేపథ్య సంగీతం: కార్తీక్ రోడ్రిగ్వెజ్
- చాయాగ్రహణం: నగేష్ బానెల్
- నిర్మాతలు: శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి
- రచన, దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
మూలాలు
మార్చు- ↑ "జయమ్ము నిశ్చయమ్మురా". andhrajyothy.com. 2016-11-25. Archived from the original on 2016-11-25. Retrieved 2016-11-25.