కారుమంచి రఘు

నటుడు

కారుమంచి రఘు ఒక తెలుగు సినీ హాస్యనటుడు. 150 కి పైగా సినిమాల్లో నటించాడు.[1][2][3]టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమంలో రోలర్ రఘు అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు.

రఘు కారుమంచి
RaghuKarumanchi.jpg
జననం
రఘు కారుమంచి

విద్యఎంబీయే
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం

రఘు 2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.[4] అదుర్స్ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.[2]

జీవితంసవరించు

రఘు వాళ్ళ స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. తండ్రి మాజీ సైనికాధికారి. తల్లి గృహిణి. రఘు ఎంబీఎ పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఓ సాఫ్టువేరు కంపెనీలో పనిచేశాడు. రఘుకు ఇద్దరు పిల్లలున్నారు.[2]

కెరీర్సవరించు

వి. వి. వినాయక్, సురేందర్ రెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటి నుంచి రఘుకు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ రఘును సినీ పరిశ్రమలోకి ఆహ్వానించారు. రఘు కూడా నటనా రంగం వైపు ఆసక్తితో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. రఘుకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Raghu Karumanchi". maastars.com. Movie Artists Association. Retrieved 18 September 2016. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 2.2 "Interview : Raghu Karumanchi – My role in Adhurs was career defining". 123telugu.com. Mallemala Entertainments. Archived from the original on 6 October 2016. Retrieved 18 September 2016. CS1 maint: discouraged parameter (link)
  3. "Telugu Movie Actor Raghu Karumanchi". nettv4u.com. Archived from the original on 18 September 2016. Retrieved 18 September 2016. CS1 maint: discouraged parameter (link)
  4. GV. "Comedian Raghu Karumanchi new films". idlebrain.com. Archived from the original on 2 September 2014. Retrieved 18 September 2016. CS1 maint: discouraged parameter (link)
  5. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020. CS1 maint: discouraged parameter (link)
  6. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019. CS1 maint: discouraged parameter (link)
  7. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020. CS1 maint: discouraged parameter (link)