జాటోత్ రామ్ చందర్ నాయక్
జాటోత్ రామచంద్రు నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]
జాటోత్ రామచంద్రు నాయక్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
ముందు | రెడ్యా నాయక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | డోర్నకల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 06 మే 1974 బొమ్మకల్ గ్రామం, పెద్దవంగర మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | జాటోత్ రాములు నాయక్,మారోణి బాయి | ||
జీవిత భాగస్వామి | డా. ప్రమీల | ||
సంతానం | శివ తరుణ్ ,శివ సాకేత్ | ||
నివాసం | ఇంటి. నెం. 5-3-8/1, మరిపెడ పట్టణం, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా |
జననం, విద్యాభాస్యం
మార్చుజాటోత్ రామచంద్రు నాయక్ తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సమీపంలోని పెద్దవంగర మండలంలోని బొమ్మకల్ తాండలో జాటోత్ రాములు నాయక్ మారోణి బాయి గిరిజన దంపతులకు 06 మే 1974లో ఆనంద నామ సంవత్సరం స్వాతి నక్షత్రమున 2వ పాదం రాత్రి జన్మించారు.1989 లో పదవ తరగతి,1991లో ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో ఇంటర్మీడియట్,1998లో ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాదు నుండి యం బి బి ఎస్ ,2001లో ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాదు నుండి యం.ఎస్ జెనరల్ ఉత్తీర్ణులైనారు. ఆయన ఉస్మానియా నుంచి ఎంబీబీఎస్ తో పాటు ఎంఎస్ సర్జన్ పట్టాలు అందుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో శివసాయి ఆస్ప త్రిని స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నాడు.
రాజకీయ జీవితం
మార్చుజాటోత్ రాంచంద్రునాయక్ రాజకీయాల పట్ల ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరి 2006లో టీడీపీ అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో డోర్నకల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
జాటోతు రాంచంద్రునాయక్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యా నాయక్ పై 53131 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి[4], 2023 డిసెంబర్ 15న ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించింది.[5][6][7]
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namaste Telangana (15 December 2023). "ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు.. నియమించిన ప్రభుత్వం". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.
- ↑ Eenadu. "విప్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Andhrajyothy (16 December 2023). "ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.