జానకిరాముడు

1988 సినిమా

జానకిరాముడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కాట్రగడ్డ మురారి నిర్మాతగా యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం. అక్కినేని నాగార్జున, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

జానకిరాముడు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
నిర్మాణం కాట్రగడ్డ మురారి
తారాగణం అక్కినేని నాగార్జున,
విజయశాంతి,
జీవిత
సంగీతం కె.వి.మహదేవన్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ యువచిత్ర ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం సవరించు

నిర్మాణం సవరించు

అభివృద్ధి సవరించు

నాగార్జున కథానాయకునిగా నిర్మాత కాట్రగడ్డ మురారి సినిమా తీద్దామని భావించి విజయేంద్ర ప్రసాద్తో కథ రాయించారు. తర్వాతికాలంలో పలు విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ కు కథారచయితగా ఇదే తొలి చిత్రం. మూగ మనసులు సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.[1]

ప్రభావాలూ, థీమ్స్ సవరించు

సినిమాను అభివృద్ధి దశలోనే మూగ మనసులు ఇతివృత్తం ఆధారంగానే తీద్దామని నిర్ణయించుకోవడంతో [1] ఇతివృత్తంపై మూగమనసుల ప్రభావం ఉంది.

పాటలు సవరించు

  • నా గొంతు శృతిలోనా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ,రచన: ఆత్రేయ
  • అరెరే పరుగెత్తి పోతోంది , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, రచన: సిరివెన్నెల.
  • చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • నీ చరణం కమలం మృదులం , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , జానకి, రచన: వేటూరి.
  • అదిరింది మామా అదిరిందిరో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,సుశీల, రచన: ఆత్రేయ .

మూలాలు సవరించు

  1. 1.0 1.1 సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.