జూహీ బబ్బర్
జూహీ బబ్బర్ భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె నటిగా, దర్శకురాలిగా రంగస్థలానికి కూడా సహకరించింది. ఆమె బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్, అతని మొదటి భార్య నాదిరా బబ్బర్ల కుమార్తె.[1] భారతీయ టెలీవిజన్ నటుడు, యాంకర్ అనూప్ సోనీకి జూహీ బబ్బర్ రెండవ భార్య.[2]
జూహీ బబ్బర్ | |
---|---|
జననం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | రాజ్ బబ్బర్ నాదిరా బబ్బర్ |
వ్యక్తిగత జీవితం
మార్చుజూహీ బబ్బర్ మొదటి భర్త స్క్రీన్‌ప్లే రచయిత అయిన బిజోయ్ నంబియార్, వీరి వివాహం 2007 జూన్ 27న జరగగా[3][4]. ఈ జంట జనవరి 2009లో విడాకులు తీసుకున్నారు.[5] ఆ తర్వాత, ఆమె టీవీ నటుడు అనూప్ సోనీతో ప్రేమలో పడింది.
అయితే, గతంలోనే అనూప్ సోనీకి రీతూతో వివాహం అయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, వారు 2011 మార్చి 14న విడిపోయారు. ఆ తరువాత, జూహీ బబ్బర్ అనూప్ సోనీల రెండవ వివాహం జరిగింది.[6] వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు.[7]
కెరీర్
మార్చుఆమె సోనూ నిగమ్ సరసన కాష్ ఆప్ హమారే హోతే సినిమాతో తొలిసారిగా నటించింది.[8] 2005లో, ఆమె జిమ్మీ షెర్గిల్‌తో కలిసి యారా నాల్ బహరన్ అనే పంజాబీ సినిమా చేసింది. ఈ చిత్రం పంజాబ్‌లోనే కాక, ఓవర్సీస్ పంజాబీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత, ఆమె మలయాళ నటుడు మోహన్‌లాల్‌తో మూకీ సినిమా చేసింది. 2006లో, ఆమె నటుడు సంజయ్ కపూర్, రితుపర్ణ సేన్‌గుప్తాతో కలిసి ఉన్స్ చిత్రంలో నటించింది.[9] ఆమె తన తదుపరి చిత్రం ఇట్స్ మై లైఫ్‌లో సోనియా జైసింగ్ పాత్రలో నటులు హర్మాన్ బవేజా, జెనీలియా డిసౌజా, నానా పటేకర్ల సరసన చేసింది. 2009లో, షారుఖ్ ఖాన్ నిర్మించిన టీవీ కామెడీ ఘర్ కీ బాత్ హైలో ఆమె గృహిణి పాత్రను పోషించి అందరిని ఆకట్టుకుంది.
మూలాలు
మార్చు- ↑ "Raj Babbar And Smita Patil Love Story In Bollywood - Sakshi". web.archive.org. 2022-04-09. Archived from the original on 2022-04-09. Retrieved 2024-01-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Dilip., Soni, Anoop. Babbar, Raj. Sheen. Arora, Tarun. Shravan, Nadeem. Sameer. Kumar, Raman. Khan, Nadeem. Pandit, Ashok. Day (2004), Sheen : a refuge in my own country, Eros International, OCLC 56516753, retrieved 1 April 2022
{{citation}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ Sonal Chawla (22 January 2009). "Bejoy and Juhi are now formally divorced". Mid Day. Retrieved 13 February 2013.
- ↑ Nimisha Tiwari (23 July 2008). "Is Juhi's marriage in trouble?". The Times of India. Archived from the original on 17 September 2011. Retrieved 13 February 2013.
- ↑ Chawla, Sonal (22 January 2009). "Juhi Babbar is formally divorced". Mid-day.com. Retrieved 19 July 2012.
- ↑ "What lead [sic] to Anup Soni – Ritu split?". The Times of India. 16 March 2011. Archived from the original on 16 July 2013. Retrieved 13 February 2013.
- ↑ "Babbar grandson". Filmfare. 23 October 2012. Retrieved 31 August 2010.
- ↑ Movies don't offer solutions to social problems: Raj Babbar Archived 27 సెప్టెంబరు 2011 at the Wayback Machine
- ↑ Nikhat Kazmi (18 November 2006). "Uns movie". The Times of India. Archived from the original on 11 April 2013. Retrieved 13 February 2013.