జెఫ్రీ జాన్ క్రోవ్ (జననం 1958 సెప్టెంబరు 14) న్యూజిలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు . అతను 1983 నుండి 1990 వరకు న్యూజిలాండ్ తరపున టెస్టులు, వన్డే ఇంటర్నేషనళ్ళు ఆడాడు. సౌత్ ఆస్ట్రేలియాకు, తర్వాత ఆక్లాండ్ కొరకూ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

జెఫ్ క్రోవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జెఫ్రీ జాన్ క్రోవ్
పుట్టిన తేదీ (1958-09-14) 1958 సెప్టెంబరు 14 (వయసు 66)
ఆక్లండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm, మీడియం pace
పాత్రమ్యాచ్ రిఫరీ
బంధువులుమార్టిన్ క్రోవ్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 151)1983 మార్చి 4 - శ్రీలంక తో
చివరి టెస్టు1990 మార్చి 19 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 42)1983 జనవరి 9 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1990 మార్చి 11 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1977/78–1981/82సౌత్ ఆస్ట్రేలియా
1982/83–1991/92ఆక్లండ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 39 75 180 139
చేసిన పరుగులు 1,601 1,518 10,233 2,974
బ్యాటింగు సగటు 26.24 25.72 37.90 26.31
100లు/50లు 3/6 0/7 22/56 1/14
అత్యుత్తమ స్కోరు 128 88* 159 130*
వేసిన బంతులు 18 6 100 6
వికెట్లు 0 0 1 0
బౌలింగు సగటు 55.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/10
క్యాచ్‌లు/స్టంపింగులు 41/– 28/– 199/– 56/–
మూలం: Cricinfo, 2016 నవంబరు 4

అతను 2004 నుండి ICC మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు.

జీవితం తొలినాళ్ళు

మార్చు

క్రోవ్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జన్మించాడు. అతను డేవ్ క్రో కుమారుడు, మార్టిన్ క్రోవ్‌కు అన్నయ్య. క్రోవ్ సోదరులు ఆస్కార్ -విజేత నటుడు రస్సెల్ క్రోవ్‌కు బంధువులు. రస్సెల్ తండ్రి జాన్ అలెగ్జాండర్ క్రోవ్, డేవ్ క్రోవ్ సోదరుడు; వారి తాత జాన్ డబుల్‌డే క్రోవ్, వేల్స్‌లోని వ్రెక్స్‌హామ్ నుండి న్యూజిలాండ్‌కు వలస వచ్చాడు. అతను ఆల్ బ్లాక్ ఫ్రాన్సిస్ జెర్విస్ (అతని తల్లి తాత) మునిమనవడు కూడా.

క్రోవ్ తండ్రి 1953, 1957 మధ్య కాంటర్‌బరీ, వెల్లింగ్‌టన్ తరపున మూడు ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.

దేశీయ కెరీర్

మార్చు

క్రోవ్ తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌ను సౌత్ ఆస్ట్రేలియాలో ప్రారంభించాడు. అక్కడ అతను 1977-78 నుండి 1981-82 వరకు ఆడాడు. అతను ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కోసం ఆడవచ్చని చెప్పారు గానీ, అతను 1982-83లో న్యూజిలాండ్‌కు ఆడాలనే ఆశతో న్యూజిలాండ్‌కి తిరిగి వచ్చాడు. ఆక్లాండ్‌ జట్టులో ఆడాడు. తన ఫీల్డింగును మెరుగుపరచుకుంటూ అప్పుడప్పుడు వికెట్ కీపింగు కూడా చేసాడు.

1990–91లో ఆక్లాండ్‌లో బెనిఫిట్ సీజన్, మరో దేశీయ సీజన్ తర్వాత, అతను 1991-92 సీజన్ చివరిలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం నుండి రిటైర్ అయ్యాడు.

అంతర్జాతీయ కెరీర్

మార్చు

అతను తన తమ్ముడు మార్టిన్ ఆడడం మొదలుపెట్టిన సంవత్సరం తర్వాత 1983 మార్చిలో క్రైస్ట్‌చర్చ్‌లో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌లో న్యూజిలాండ్ తరపున తన టెస్ట్ ప్రవేశం చేసాడు. 1984 ఫిబ్రవరిలో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో అతను తన తొలి టెస్టు సెంచరీ (128) సాధించాడు.

1984-85లో వెస్టిండీస్ జట్టుతో ఆడుతూ, 1985 మేలో జమైకాలోని కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరిగిన నాల్గవ టెస్టులో అతని జట్టు 225 పరుగుల లోటుతో ఫాలో ఆన్‌ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో స్కోరు 1–13 వద్ద ఉండగా క్రోవ్ 3వ స్థానంలో దిగాడు. కోర్ట్నీ వాల్ష్, మాల్కం మార్షల్, జోయెల్ గార్నర్‌లతో కూడిన భీకర ఫాస్ట్ బౌలింగ్ దాడికి వ్యతిరేకంగా, అతను తన రెండవ టెస్ట్ సెంచరీ (112) సాధించాడు; కానీ న్యూజిలాండ్ ఇప్పటికీ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. [1]

అతను ఆరు టెస్టులకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు - 1987 ఏప్రిల్‌లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన ఏకైక టెస్టు (అతను తన టెస్ట్ సెంచరీలలో మూడవ, చివరి సెంచరీ 120 నాటౌట్ ఆ టెస్టులోనే చేసాడు) డ్రా అయింది. ఆ తరువాత 1987 డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనలో మూడు, చివరకు 1988 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో రెండు తేస్టులకు నాయకత్వం వహించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఒకటి ఓడిపోగా, మిగతా ఐదు డ్రా అయ్యాయి. క్రోవ్ తన చివరి టెస్టును ఆస్ట్రేలియాతో 1990 మార్చిలో వెల్లింగ్టన్‌లో ఆడాడు. అతను 1983 నుండి 1990 వరకు 75 వన్‌డేలలో కూడా ఆడాడు, 1983లో ఇంగ్లాండ్‌లో, 1987లో భారతదేశంలో క్రికెట్ ప్రపంచ కప్‌లతో సహా.

క్రికెట్ తర్వాత

మార్చు

క్రోవ్ 1999 నుండి 2003 వరకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు. అతను ఫ్లోరిడాలో కొంత కాలం పాటు గోల్ఫ్ హాలిడే వ్యాపారాన్ని నడిపాడు. 2004 నుండి అతను ICC మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు. 2007, 2011లో ప్రపంచ కప్ ఫైనల్స్‌లో కూడా రిఫరీగా పనిచేసాడు. 75 పైలిచుకు టెస్టుల్లో రిఫరీగా పనిచేసిన ముగ్గురిలో అతనొకడు (మిగతావారు క్రిస్ బ్రాడ్, రంజన్ మదుగల్లె). 220 కంటే ఎక్కువ వన్‌డేలలో రిఫరీగా పనిచేసిన నలుగురిలో ఒకడు (మిగతా ముగ్గురు బ్రాడ్, మడుగల్లె, రోషన్ మహానామ). 2017 జనవరిలో అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఐదవ వన్‌డే, రిఫరీగా అతని 250వది.[2]

మూలాలు

మార్చు
  1. 4th Test: West Indies v New Zealand at Kingston, May 4-8, 1985. ESPNcricinfo.
  2. "Jeff Crowe reaches 250 ODIs as match referee". International Cricket Council. Archived from the original on 29 January 2017. Retrieved 26 January 2017.