1983 క్రికెట్ ప్రపంచ కప్
1983 క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటులో జరిగిన 3వ పోటీ. దీన్ని అధికారికంగా ప్రుడెన్షియల్ కప్ '83 అన్నారు. 1983 జూన్ 9 నుండి జూన్ 25 వరకు ఇంగ్లాండ్, వేల్స్‌లలో జరిగింది. ఇందులో భారతదేశం ఛాంపియన్ అయింది. ఈ పోటీలో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్ లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ప్రిలిమినరీ మ్యాచ్‌లు, ఒక్కొక్కటి నాలుగు జట్లతో కూడిన రెండు గ్రూపులుగా జరిగాయి. వీటిలో ప్రతి దేశం తన గ్రూపులోని ఇతర జట్లతో రెండుసార్లు ఆడింది. ఒక్కో గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
ఈ పోటీ లోని మ్యాచ్‌లలో ఒకో ఇన్నింగ్స్‌కు 60 ఓవర్‌లు ఉన్నాయి. సాంప్రదాయికంగా ధరించే తెల్లని దుస్తులతో, ఎరుపు రంగు బంతులతో ఆడారు. మ్యాచ్‌లన్నీ పగటిపూటే జరిగాయి.
ఫార్మాట్
మార్చుటోర్నమెంటులో పాల్గొన్న ఎనిమిది జట్లను నాలుగేసి జట్లతో కూడిన రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతరులతో రెండుసార్లు ఆడింది. ఒక్కో గ్రూపు నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక్కడి నుండి సింగిల్-ఎలిమినేషన్ టోర్నమెంట్‌గా ఆడారు. ప్రతి మ్యాచ్ లోను ఒక్కొక్క జట్టు 60 ఓవర్లు ఆడింది. డే/నైట్ మ్యాచ్‌లు లేవు.
పాల్గొనేవారు
మార్చుటోర్నమెంటుకు ఎనిమిది జట్లు అర్హత సాధించాయి (అప్పుడే కొత్తగా పూర్తి సభ్యత్వం పొందిన శ్రీలంక, 1982 ICC ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా అర్హత సాధించిన జింబాబ్వే, ఏడు పూర్తి ICC సభ్యదేశాలు, ).
జట్టు | అర్హత విధానం | ఫైనల్స్ ప్రదర్శనలు | చివరి ప్రదర్శన | మునుపటి అత్యుత్తమ ప్రదర్శన |
---|---|---|---|---|
ఇంగ్లాండు | హోస్ట్‌లు | 3వ | 1979 | రన్నరప్ (1979) |
భారతదేశం | పూర్తి సభ్యుడు | 3వ | 1979 | గ్రూపు దశ (1975, 1979) |
ఆస్ట్రేలియా | 3వ | 1979 | రన్నరప్ (1975) | |
పాకిస్తాన్ | 3వ | 1979 | సెమీ-ఫైనల్ (1979) | |
వెస్ట్ ఇండీస్ | 3వ | 1979 | విజేత (1975, 1979) | |
న్యూజీలాండ్ | 3వ | 1979 | సెమీ-ఫైనల్ (1975, 1979) | |
శ్రీలంక | 3వ | 1979 | గ్రూపు దశ (1975, 1979) | |
జింబాబ్వే | 1982 ICC ట్రోఫీ | 1వ | - | అరంగేట్రం |
వేదికలు
మార్చువేదిక | నగరం | కెపాసిటీ | మ్యాచ్‌లు | |
---|---|---|---|---|
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ | లండన్ | 30,000 | 3 | |
ట్రెంట్ బ్రిడ్జ్ | నాటింగ్‌హామ్ | 15,350 | 3 | |
హెడ్డింగ్లీ | లీడ్స్ | 14,000 | 3 | |
ది ఓవల్ | లండన్ | 23,500 | 3 | |
ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ | బర్మింగ్‌హామ్ | 21,000 | 3 | |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | డెర్బీ | 9,500 | 1 | |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | బ్రిస్టల్ | 16,000 | 1 | |
కౌంటీ గ్రౌండ్ | టౌంటన్ | 6,500 | 1 | |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | చెమ్స్‌ఫోర్డ్ | 6,500 | 1 | |
సెయింట్ హెలెన్స్ రగ్బీ అండ్ క్రికెట్ గ్రౌండ్ | స్వాన్సీ, వేల్స్ | 4,500 | 1 | |
గ్రేస్ రోడ్ | లీసెస్టర్ | 12,000 | 1 | |
ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ | మాంచెస్టర్ | 19,000 | 3 | |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | సౌతాంప్టన్ | 7,000 | 1 | |
న్యూ రోడ్ | వోర్సెస్టర్ | 4,500 | 1 | |
నెవిల్ గ్రౌండ్ | రాయల్ టన్‌బ్రిడ్జ్ వెల్స్ | 6,000 | 1 |
గ్రూపు దశ
మార్చుమునుపటి క్రికెట్ ప్రపంచ కప్‌ల మాదిరిగా కాకుండా, గ్రూపు దశలు డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగాయి. గ్రూపు Aలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు ఉండగా, గ్రూపు Bలో గత ఛాంపియన్ వెస్టిండీస్, ఇండియా, ఆస్ట్రేలియా, ఏకైక క్వాలిఫైయరైన జింబాబ్వేలు ఉన్నాయి. తరువాత జేరిగిన ప్రపంచ కప్‌లలో టెలివిజన్‌లో అన్ని ఆటలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ఫార్మాట్లను రూపొందించారు. ఈ టోర్నమెంటులో మాత్రం, ఏకకాలంలో వివిధ మ్యాచ్‌లు వివిధ వేదికలపై జరిగాయి. రోజు విడిచి రోజు మ్యాచ్‌లు జరిగాయి. వర్షం వచ్చి మ్యాచ్ రద్దైన సందర్భంలో మధ్యలో ఉన్న రోజున ఆ మ్యాచ్‌లు మళ్ళీ జరిగేలా ఈ ఫార్మాటును రూపొందించారు. మూడు మ్యాచ్‌లు అలా రద్దవగా రెండవ రోజున మళ్ళీ జరిగాయి. [1]
ఓవల్‌లో జరిగిన గ్రూపు A మ్యాచిలో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌పై 106 పరుగులతో విజయం సాధించింది. ఇంగ్లండ్ 322/6 స్కోర్ చేసింది. అలన్ లాంబ్, మైక్ గాటింగ్ లు 16 ఓవర్లలో 115 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 60 ఓవర్లలో 338/5 స్కోర్ చేసిన పాకిస్తాన్, శ్రీలంకపై 50 పరుగుల తేడా విజయంతో టోర్నమెంటును ప్రారంభించింది.[2] గాయంతో ఇమ్రాన్ ఖాన్ టోర్నమెంటు మొత్తం బౌలింగ్ చేయలేదు. ఇంగ్లండ్ రెండవ గ్రూపు మ్యాచ్‌లో శ్రీలంకపై 47 పరుగులతో తన రెండవ విజయాన్ని అందుకుంది. డేవిడ్ గోవర్ ఐదు సిక్సర్లు, 12 ఫోర్లతో 130 పరుగులు చేసాడు. కాగా, అబ్దుల్ ఖాదిర్ 12 ఓవర్లలో 4/21 సాధించినప్పటికీ, న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఇంగ్లండ్ లార్డ్స్‌లో దాదాపు పది ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. రిచర్డ్ హ్యాడ్లీ 25 పరుగులకు 5 వికెట్లు తీయడంతో శ్రీలంక 206 పరుగులకు ఆలౌటైంది, న్యూజిలాండ్ 20 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం చేపట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో గ్రూపు దశల్లో ఇంగ్లండ్‌కు ఏకైక ఓటమి ఎదురైంది. అబ్దుల్ ఖాదిర్ (5/44) తో దారిచూపగా పాకిస్థాన్, మరోసారి శ్రీలంకపై విజయం సాధించింది.
జూన్ 18న జరిగిన ఐదవ రౌండ్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ సెమీ-ఫైనల్‌లో తమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రేమ్ ఫౌలర్, క్రిస్ టావరేలు 115 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ చేసిన 232 పరుగులలో దాదాపు సగం స్కోరు చేసారు. మరోవైపు న్యూజిలాండ్, తక్కువ స్కోరు మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయి, నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైంది. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ఫైనల్‌కి చేరుకుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ రెండో క్వాలిఫయర్‌ను నిర్ణయించనుంది. న్యూజిలాండ్ ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే చాలు, ఫైనల్‌కు చేరుకుంటుంది. పాకిస్తాన్ మాత్రం, గెలవడమే కాకుండా, న్యూజిలాండ్ సగటు రన్ రేట్‌ను దాటేందుకు సరిపడినంత తేడాతో గెలిస్తేనే ఫైనల్‌కు చేరుకుంటుంది. [3] జహీర్ అబ్బాస్ అజేయంగా 103 పరుగులు చేయడంతో పాకిస్తాన్‌కు 11 పరుగుల విజయం సరిపోయింది.
గ్రూపు B లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడంతో షాక్‌తో ప్రారంభమైంది. విజ్డెన్ దీన్ని, "గత రెండు ప్రపంచ కప్‌లలో కంటే పెద్ద ఆశ్చర్యం"గా అభివర్ణించింది. [4] డంకన్ ఫ్లెచర్ 69* పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇతర ఓపెనింగ్ గ్రూపు B మ్యాచ్‌లో, వెస్టిండీస్‌ను 35 బంతులు మిగిలి ఉండగానే 228 పరుగులకు ఆలౌట్ చేసి భారత్, 34 పరుగుల తేడాతో ఓడించి మరో "షాక్"ను అందించింది. ప్రపంచ కప్ పోటీల్లో వెస్టిండీస్‌కి ఎదురైన మొదటి ఓటమి ఇది. 1975, 1979 టోర్నమెంట్‌లలో వెస్టిండీస్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం చెలాయించింది. జూన్ 11న ఆడిన రెండో రౌండ్ గేమ్‌లలో తడి వాతావరణం వలన తక్కువ స్కోర్‌లు అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్, తమ ఇన్నింగ్స్‌లో 252/9 స్కోర్ చేయగా, అందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా 30.3 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. మైఖేల్ హోల్డింగ్ దెబ్బకు గ్రేమ్ వుడ్‌ను ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది. [5] అదే రోజున జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై సునాయాసంగా విజయం సాధించింది. రెండు రోజుల తర్వాత, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రెవర్ చాపెల్ 131 బంతుల్లో 110 పరుగులు చేయడంతో, కెన్ మాక్‌లే పరుగులకు 6 వికెట్లు తీయడంతో భారత్, ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది. డంకన్ ఫ్లెచర్ మరో అజేయ అర్ధ శతకం సాధించినప్పటికీ వెస్టిండీస్, జింబాబ్వేను 60 ఓవర్లలో కేవలం 217/7కి పరిమితం చేయడంతో ఆ మ్యాచ్ కూడా ఏకపక్షంగా సాగింది, ఆపై మూడో వికెట్‌కు గార్డన్ గ్రీనిడ్జ్, లారీ గోమ్స్ ల 195 పరుగుల భాగస్వామ్యంతో వెస్టిండీస్ విజయం సాధించింది..
రిటర్న్ మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్‌లో, వివ్ రిచర్డ్స్ 119 పరుగుల సాయంతో వెస్టిండీస్, 66 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. మాల్కం మార్షల్ వేసిన బంతి దిలీప్ వెంగ్‌సర్కార్ నోటికి తగిలింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ రిటైర్డ్ హర్ట్ అవడం ఈ టోర్నమెంట్‌లో ఇది రెండవ సారి.[6] ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి, గత పరాజయానికి సర్దుబాటు చేసుకుంది. జూన్ 18న జరిగిన ఇండియా జింబాబ్వే మ్యాచ్‌ను విజ్డెన్ "అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కూడిన అద్భుతమైన మ్యాచ్" అని అభివర్ణించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ వెంటనే మరో వికెట్‌ను కూడా కోల్పోయి స్కోరు 17/5 కు చేరింది. కపిల్ అజేయంగా చేసిన 175 పరుగులతో భారత్ స్కోరు 266/8 అయింది, దీనిని జింబాబ్వే ఛేజ్ చేయడంలో విఫలం కాగా, భారత్ 31 పరుగుల తేడాతో గెలిచింది. [7] గ్రీనిడ్జ్, రిచర్డ్స్ మధ్య రెండో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం కారణంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. దాంతో వెస్టిండీస్, జింబాబ్వే ల మధ్య జరిగిన తరువాతి మ్యాచ్ అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. వెస్టిండీస్ దాదాపు పదిహేను ఓవర్లు మిగిలి ఉండగానే పది వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరి గ్రూపు B మ్యాచ్ ఆస్ట్రేలియా, భారత్ మధ్య క్వాలిఫికేషన్ కోసం నేరుగా జరిగిన పోరు. అయితే, భారత్ 247 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత, మదన్ లాల్, రోజర్ బిన్నీలు చెరి నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా 129 పరుగులకే కుప్పకూలింది. [8]
గ్రూపు A
మార్చుపోస్ | జట్టు |
---|
1983 జూన్ 9 స్కోరు |
ఇంగ్లాండు 322/6 (60 overs) |
v | న్యూజీలాండ్ 216 (59 overs) |
ఇంగ్లాండు 106 పరుగులతో గెలిచింది ది ఓవల్, లండన్ |
1983 జూన్ 9 Scorecard |
పాకిస్తాన్ 338/5 (60 overs) |
v | శ్రీలంక 288/9 (60 overs) |
పాకిస్తాన్ 50 పరుగులతో గెలిచింది St Helen's, Swansea |
1983 జూన్ 11 Scorecard |
ఇంగ్లాండు 333/9 (60 overs) |
v | శ్రీలంక 286 (58 overs) |
ఇంగ్లాండు, 47 పరుగుల తేడాతో గెలిచింది County Ground, Taunton |
1983 జూన్ 11 Scorecard |
న్యూజీలాండ్ 238/9 (60 overs) |
v | పాకిస్తాన్ 186 (55.2 overs) |
న్యూజీల్యాండ్ 52 పరుగుల తేడాతో గెలిచింది ఎడ్జ్‌బాస్టన్, Birmingham |
1983 జూన్ 13 Scorecard |
పాకిస్తాన్ 193/8 (60 overs) |
v | ఇంగ్లాండు 199/2 (50.4 overs) |
ఇంగ్లాండు, 8 వికెట్ల తేడాతో గెలిచింది లార్డ్స్, లండన్ |
1983 జూన్ 13 Scorecard |
శ్రీలంక 206 (56.1 overs) |
v | న్యూజీలాండ్ 209/5 (39.2 overs) |
న్యూజీల్యాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది County Ground, Bristol |
1983 జూన్ 15 Scorecard |
ఇంగ్లాండు 234 (55.2 overs) |
v | న్యూజీలాండ్ 238/8 (59.5 overs) |
న్యూజీల్యాండ్ 2 వికెట్లతో గెలిచింది Edgbaston, Birmingham |
1983 జూన్ 16 స్కోరు |
పాకిస్తాన్ 235/7 (60 overs) |
v | శ్రీలంక 224 (58.3 overs) |
పాకిస్తాన్ 11 పరుగులతో గెలిచింది హెడింగ్లే, లీడ్స్ |
1983 జూన్ 18 స్కోరు |
పాకిస్తాన్ 232/8 (60 ఓవర్లు) |
v | ఇంగ్లాండు 233/3 (57.2 ఓవర్లు) |
ఇంగ్లాండు 7 వికెట్లతో గెలిచింది ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంఛెస్టర్ |
1983 జూన్ 18 స్కోరు |
న్యూజీలాండ్ 181 (58.2 ఓవర్లు) |
v | శ్రీలంక 184/7 (52.5 ఓవర్లు) |
శ్రీలంక 3 వికెట్లతో గెలిచింది కౌంటీ గ్రౌండ్, డెర్బీ |
1983 జూన్ 20 స్కోరు |
శ్రీలంక 136 (50.4 ఓవర్లు) |
v | ఇంగ్లాండు 137/1 (24.1 ఓవర్లు) |
ఇంగ్లాండు 9 వికెట్లతో గెలిచింది హెడింగ్లే, లీడ్స్ |
1983 జూన్ 20 స్కోరు |
పాకిస్తాన్ 261/3 (60 ఓవర్లు) |
v | న్యూజీలాండ్ 250 (59.1 ఓవర్లు) |
పాకిస్తాన్ 11 పరుగులతో గెలిచింది ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ |
గ్రూపు బి
మార్చుపోస్ | జట్టు |
---|
1983 జూన్ 9 Scorecard |
జింబాబ్వే 239/6 (60 overs) |
v | ఆస్ట్రేలియా 226/7 (60 overs) |
జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలిచింది ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ |
1983 జూన్ 9 Scorecard |
భారతదేశం 262/8 (60 overs) |
v | వెస్ట్ ఇండీస్ 228 (54.1 overs) |
భారత్ 34 పరుగుల తేడాతో గెలిచింది ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంఛెస్టర్ |
1983 జూన్ 11 Scorecard |
వెస్ట్ ఇండీస్ 252/9 (60 overs) |
v | ఆస్ట్రేలియా 151 (30.3 overs) |
వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో గెలిచింది Headingley, Leeds |
1983 జూన్ 11 Scorecard |
జింబాబ్వే 155 (51.4 overs) |
v | భారతదేశం 157/5 (37.3 overs) |
భారత్ 5 వికెట్లతో గెలిచింది Grace Road, Leicester |
1983 జూన్ 13 Scorecard |
ఆస్ట్రేలియా 320/9 (60 overs) |
v | భారతదేశం 158 (37.5 overs) |
ఆస్ట్రేలియా 162 పరుగుల తేడాతో గెలిచింది ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ |
1983 జూన్ 13 Scorecard |
జింబాబ్వే 217/7 (60 overs) |
v | వెస్ట్ ఇండీస్ 218/2 (48.3 overs) |
వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది న్యూ రోడ్, వోర్సెస్టర్ |
1983 జూన్ 15 Scorecard |
వెస్ట్ ఇండీస్ 282/9 (60 overs) |
v | భారతదేశం 216 (53.1 overs) |
వెస్టిండీస్ 66 పరుగుల తేడాతో గెలిచింది ది ఓవల్, లండన్ |
1983 జూన్ 16 Scorecard |
ఆస్ట్రేలియా 272/7 (60 overs) |
v | జింబాబ్వే 240 (59.5 overs) |
ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో గెలిచింది County Ground, Southampton |
1983 జూన్ 18 Scorecard |
ఆస్ట్రేలియా 273/6 (60 overs) |
v | వెస్ట్ ఇండీస్ 276/3 (57.5 overs) |
వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది లార్డ్స్, లండన్ |
1983 జూన్ 18 Scorecard |
భారతదేశం 266/8 (60 overs) |
v | జింబాబ్వే 235 (57 overs) |
భారత్ 31 పరుగులతో గెలిచింది నెవిల్ గ్రౌండ్, టన్‌బ్రిడ్జ్ వెల్స్ |
1983 జూన్ 20 Scorecard |
భారతదేశం 247 (55.5 overs) |
v | ఆస్ట్రేలియా 129 (38.2 overs) |
భారత్ 118 పరుగులతో గెలిచింది కౌంటీ గ్రౌండ్, చెమ్స్‌ఫోర్డ్ |
1983 జూన్ 20 Scorecard |
జింబాబ్వే 171 (60 overs) |
v | వెస్ట్ ఇండీస్ 172/0 (45.1 overs) |
వెస్టిండీస్ 10 వికెట్లతో గెలిచింది Edgbaston, Birmingham |
నాకౌట్ దశ
మార్చుSemi-finals | Final | ||||||
జూన్ 22 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంఛెస్టర్ | |||||||
ఇంగ్లాండు | 213 | ||||||
భారతదేశం | 217/4 | ||||||
జూన్ 25 – లార్డ్స్, లండన్ | |||||||
భారతదేశం | 183 | ||||||
వెస్ట్ ఇండీస్ | 140 | ||||||
జూన్ 22– ది ఓవల్, లండన్ | |||||||
పాకిస్తాన్ | 184/8 | ||||||
వెస్ట్ ఇండీస్ | 188/2 |
సెమీ ఫైనల్స్
మార్చు1983 జూన్ 22 స్కోరు |
ఇంగ్లాండు 213 (60 ఓవర్లు) |
v | భారతదేశం 217/4 (54.4 ఓవర్లు) |
భారత్ 6 వికెట్లతో గెలిచింది ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంఛెస్టర్ |
జూన్ 22న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మొదటి సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ చాలా బంతులను తప్పు టైమింగుతో ఆడి, బ్యాట్ ఎడ్జ్‌ను ఎక్కువగా ఉపయోగించారు. పకడ్బందీగా వేసిన భారత బౌలింగు దానికి తోడై, ఇంగ్లాండు 60 ఓవర్లలో 213 స్కోరుకే ఆల్ అవుట్ అయింది. గ్రేమ్ ఫౌలర్ (59 బంతుల్లో 33, 3 ఫోర్లు) అత్యధిక స్కోరు చేయగా, కపిల్ దేవ్ పదకొండు ఓవర్లలో 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, మొహిందర్ అమర్‌నాథ్, రోజర్ బిన్నీలు చెరో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో యశ్‌పాల్ శర్మ (115 బంతుల్లో 61, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సందీప్ పాటిల్ (32 బంతుల్లో 51, 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ 54.4 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో మునుపటి టోర్నమెంట్ రన్నరప్‌పై విజయం సాధించింది. మొహిందర్ అమర్‌నాథ్ (92 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు గాను, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. 46 పరుగుల బ్యాటింగు, 12 ఓవర్లలో 2/27 బౌలింగు ప్రదర్శన అతనికి ఈ అవార్డు సాధించి పెట్టాయి. [9]
1983 జూన్ 22 స్కోరు |
పాకిస్తాన్ 184/8 (60 ఓవర్లు) |
v | వెస్ట్ ఇండీస్ 188/2 (48.4 ఓవర్లు) |
వెస్టిండీస్ 8 వికెట్లతో గెలిచింది ది ఓవల్, లండన్ |
అదే రోజు ఓవల్‌లో పాకిస్థాన్, వెస్టిండీస్‌ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగింది. వెస్టిండీస్ టాస్ గెలిచి, పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వారు కేవలం 184 పరుగులకే పరిమితమయ్యారు (8 వికెట్లు, 60 ఓవర్లు). మోహ్సిన్ ఖాన్ (176 బంతుల్లో 70, 1 ఫోర్) వెస్టిండీస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని 50 పరుగులు చేసి పోరాడాడు 50కి చేరుకున్న ఏకైక పాకిస్తానీ బ్యాట్స్‌మన్ అతను. మాల్కమ్ మార్షల్ (3/28), ఆండీ రాబర్ట్స్ (2/25) బంతితో చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న వివ్ రిచర్డ్స్ (96 బంతుల్లో 80, 11 ఫోర్లు, 1 సిక్స్), లారీ గోమ్స్ (100 బంతుల్లో అజేయ 50) ల సాయంతో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యం చేరుకుంది. [10]
ఫైనల్
మార్చు1983 జూన్ 25 స్కోరు |
India 183 (54.4 ఓవర్లలో) |
v | వెస్ట్ ఇండీస్ 140 (52 ఓవర్లులో) |
43 పరుగుల తేడాతో భారత్ గెలిచింది లార్డ్స్, లండన్ |
ఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. రాబర్ట్స్, మార్షల్, జోయెల్ గార్నర్, మైఖేల్ హోల్డింగ్‌లు భారత బ్యాట్స్‌మెన్‌లను చీల్చిచెండాడారు. గోమ్స్ వారికి సమర్థంగా మద్దతు ఇచ్చాడు. కేవలం కృష్ణమాచారి శ్రీకాంత్ (57 బంతుల్లో 38), మొహిందర్ అమర్‌నాథ్ (80 బంతుల్లో 26) లు మాత్రమే గణనీయమైన ప్రతిఘటనను ప్రదర్శించారు. చివరి బ్యాట్స్‌మెన్లు కనబరచిన ఆశ్చర్యకరమైన ప్రతిఘటనతో భారత బ్యాట్స్‌మెన్లు 54.4 ఓవర్లలో ఆలౌట్ అయ్యేలోపు 183 చేయగలిగారు. భారత బౌలర్లు, వాతావరణాన్నీ పిచ్ పరిస్థితులనూ సరిగ్గా ఉపయోగించుకుని వెస్టిండీస్‌ను 52 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ చేసారు. భారత్ వెస్టిండీస్‌పై 43 పరుగుల తేడాతో గెలిచి క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన, అనూహ్యమైన విజయాలలో ఒకదాన్ని నమోదు చేసింది. ఇది ఇప్పటికీ ప్రపంచ కప్ ఫైనల్‌లో విజయవంతంగా కాపాడుకున్న అత్యల్ప టోటల్‌గా మిగిలిపోయింది. అమర్‌నాథ్, మదన్ లాల్ చెరో మూడు వికెట్లు తీశారు. వివ్ రిచర్డ్స్ 28 బంతుల్లో 33 పరుగులతో వెస్టిండీస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అమర్‌నాథ్ అత్యంత పొదుపుగా, తన ఏడు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతని ఆల్ రౌండ్ ప్రదర్శనకు గాను, మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [11] 1983లో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లేదు.
గణాంకాలు
మార్చు
|
|
అధికారులు
మార్చుప్రపంచ కప్‌లో 27 మ్యాచ్‌లను పర్యవేక్షించేందుకు ఇంగ్లాండ్‌కు చెందిన 11 మంది అంపైర్లు ఎంపికయ్యారు. మొదటి సెమీఫైనల్‌ను డాన్ ఓస్లియర్, డేవిడ్ ఎవాన్స్ పర్యవేక్షించగా రెండవ సెమీఫైనల్‌ను డేవిడ్ కాన్స్టాంట్, అలాన్ వైట్‌హెడ్ పర్యవేక్షించారు. డిక్కీ బర్డ్ మూడవసారి, బారీ మేయర్ రెండవసారి ప్రపంచ కప్ ఫైనల్‌ను పర్యవేక్షణకు ఎన్నికయ్యారు.
జనామోదం పొందిన సంస్కృతిలో
మార్చు- 2021 భారతీయ జీవిత చరిత్ర సినిమా83 లో ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా విజయాన్ని వివరిస్తుంది. ఈ చిత్రంలో భారత కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను భారతీయ నటుడు రణవీర్ సింగ్ పోషించాడు.
- 1983 అనేది 2014 లో విడుదలైన భారతీయ మలయాళ భాషా చిత్రం. దీని కథ 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా ఉంది.[14][15][16]
మూలాలు
మార్చు- ↑ Wisden 1984, page 293.
- ↑ Wisden 1984, page 293.
- ↑ Wisden 1984, page 310.
- ↑ Wisden 1984, page 296
- ↑ Wisden 1984, page 299
- ↑ Wisden 1984, page 304
- ↑ Wisden 1984, page 308
- ↑ "India's Journey of becoming World Champions..." Cricketnmore (in ఇంగ్లీష్). Retrieved 30 April 2022.
- ↑ 1st SEMI: England v India at Manchester, 22 Jun 1983
- ↑ 2nd SEMI: Pakistan v West Indies at The Oval, 22 Jun 1983
- ↑ "Full Scorecard of India vs West Indies Final 1983 - Score Report". ESPNcricinfo. Retrieved 25 May 2019.
- ↑ "PRUDENTIAL WORLD CUP, 1983 / RECORDS / MOST RUNS". ESPNcricinfo. Retrieved 16 August 2020.
- ↑ "PRUDENTIAL WORLD CUP, 1983 / RECORDS / MOST WICKETS". ESPNcricinfo. Retrieved 16 August 2020.
- ↑ George, Vijay. "On location: 1983 — For the love of the game". The Hindu. Retrieved 5 July 2013.
- ↑ "M'wood gears up for more sports movies". The Times of India. 17 February 2013. Archived from the original on 2 February 2014. Retrieved 5 July 2013.
- ↑ "Non-stop from '1983'". Deccan Chronicle. 5 July 2013. Archived from the original on 7 ఆగస్టు 2013. Retrieved 5 July 2013.