జోమోన్

మలయాళ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత

జోమోన్ మలయాళ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 1990-2006 మధ్యకాలంలో మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జోమోన్
జననం
జోమోన్ తేకన్
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1984– ప్రస్తుతం

జోమోన్ కేరళలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

1984లో మలయాళ సినిమారంగంలోకి అడుగుపెట్టిన జోమోన్, తొలినాళ్ళలో ఆళ్‌కూట్టతిల్ థానియే, ఉయ్యరంగళిల్, ఆదియోజుక్కుకల్, 1921, దౌత్యం వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

1990లో మమ్ముట్టి హీరోగా వచ్చిన సామ్రాజ్యం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు.[1] ఈ సినిమా విజయవంతమై, ఆ సమయంలో అత్యధిక వసూళ్ళు సాధించిన మలయాళ సినిమాలలో ఒకటిగా నిలవడంతోపాటు,[2] కేరళలో థియేటర్లలో 200కి పైగా రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 400 నుండి 600 రోజులకు పైగా నడిచింది.[3] ఇది ఇప్పటికీ అజేయంగా మిగిలిపోయిన రికార్డు ఇది. ఈ సినిమా అదే పేరుతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో అనువాదమై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా భాష నటించారు
1990 సామ్రాజ్యం మలయాళం మమ్ముట్టి, మధు, శ్రీవిద్య
1991 అనస్వరం మలయాళం మమ్ముట్టి, శ్వేతా మీనన్, ఇన్నోసెంట్
1992 అసాధ్యులు తెలుగు జగపతి బాబు
1993 జాక్‌పాట్ మలయాళం మమ్ముట్టి, గౌతమి, ఐశ్వర్య
1993 యాధవం మలయాళం సురేష్ గోపి, నరేంద్ర ప్రసాద్, ఖుష్బు
1995 కర్మ మలయాళం సురేష్ గోపి, రంజిత
1998 సిద్ధార్థ మలయాళం మమ్ముట్టి, రంభ, శ్రీవిద్య
2001 ఉన్నతంగళిల్ మలయాళం మనోజ్ కె. జయన్, లాల్, ఇంద్రజ
2006 భార్గవచరితం మూనం ఖండం మలయాళం మమ్ముట్టి, శ్రీనివాసన్, రెహమాన్, సాయి కుమార్

మూలాలు

మార్చు
  1. Prasad, Ayyappa (20 November 1992). "Malayalam films cross boundaries". Indian Express. Madras. p. 7. Retrieved 2023-07-14.
  2. Neelima Menon (7 February 2019). "Mammootty's pan-Indian appeal proves he's a bonafide star regardless of how Yatra performs". Firstpost.
  3. "10 Mollywood films that ran for the longest time". The Times of India. 31 May 2016.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జోమోన్&oldid=3964310" నుండి వెలికితీశారు