డాక్టర్ సినీ యాక్టర్

డాక్టర్ సినీ యాక్టర్ విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, జయసుధ, కవిత ప్రధాన పాత్రధారులుగా నటించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1982, ఏప్రిల్ 9న విడుదలయ్యింది.[1]

‌డాక్టర్ సినీ యాక్టర్
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
జయసుధ ,
కవిత
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయచిత్ర పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

రాజు, మధు ఇద్దరూ మేనత్త మేనమామ బిడ్డలు. మధు వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేసి ఎన్నో డిగ్రీలు సంపాదిస్తాడు. సినీ యాక్టరు కావాలనుకున్న రాజును కూడా డాక్టరుగా చేయాలన్నది అతని దీక్ష. అయితే రాజుకు నటనమీదే శ్రద్ధ. ఇతడు ఒక నాటకంలో ఛత్రపతి శివాజీ వేషం వేసినందుకు అతనికి బహుమతి కూడా వస్తుంది. ఆ బహుమతి తీసుకుని ఇంటికి వచ్చిన రాజును మధు తూలనాడుతాడు. రాజు మనసు గాయమై ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. రాజు చిన్ననాటి స్నేహితురాలు రాధ రాజును ప్రేమిస్తుంటుంది. నిరాధారంగా మద్రాసు వెళుతున్న రాజుకు తన గాజులమ్మి కొంత డబ్బును ఇస్తుంది. రాజు మద్రాసు చేరుకుని అష్టకష్టాలు అనుభవించి చివరకు ఒక షూటింగులో వేషం సంపాదిస్తాడు. అక్కడి నుండి అతడి దశ తిరుగుతుంది. మహానటుడై లక్షలు సంపాదిస్తాడు.శ్రీకాంత్ అనే దర్శక నిర్మాత భార్య రంజన ఒక హీరోయిన్. ఆమె రాజును వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రాజు తిరస్కరించి రాధనే పెళ్ళి చేసుకుంటాడు. డాక్టర్ మధు లతను వివాహమాడతాడు. మధు రాజుల మధ్య మళ్ళీ సంబంధాలు ఏర్పడతాయి. వారిద్దరి భార్యలు ఒకేసారి ప్రసవిస్తారు. అయితే లతకు పుట్టిన బిడ్డ చచ్చిపోవడంతో అప్పటికే స్పృహతప్పి కొట్టుమిట్టాడుతున్న లతకి తన పిల్లాడు పోయాడని తెలిస్తే ఎక్కడ మరణిస్తుందో అని రాధ తనకు పుట్టిన బిడ్డను లత పక్కకు చేరుస్తుంది. మధు దంపతులు ఆ పిల్లాణ్ణి అల్లారుముద్దుగా పెంచుతుంటారు. భగ్న ప్రేమికురాలైన రంజన తన భర్త శ్రీకాంత్‌తో ఎన్నో పథకాలు వేసి మళ్ళీ రాజు తమ చిత్రంలో నటించేందుకు అంగీకరించేటట్లు చేస్తారు. ఎలాగైనా రాజును అనుభవించాలని రంజన తపన. రాజును అంతం చేయాలని శ్రీకాంత్ పన్నాగం. కానీ ఉభయులూ తమ పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారు. రాజు మాత్రం రాజాలా ఇంటికి తిరిగివస్తాడు,[2][3]

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Doctor Cine Actor (Vijayanirmala) 1982". ఇండియన్ సినిమా. Retrieved 7 September 2022.
  2. సి.యస్.బి. "చిత్రసమీక్ష: డాక్టర్ సినీ యాక్టర్". ఆంధ్రపత్రిక. Retrieved 7 September 2022.
  3. గుడిపూడి శ్రీహరి. "సినిమాలో సినిమా 'డాక్టర్ సినీయాక్టర్ '". సితార. Retrieved 7 September 2022.

బయటిలింకులు

మార్చు