డార్లింగ్ (2010 సినిమా)
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ప్రేమ కథా చిత్రం డార్లింగ్.[1] ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జి. వి. ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 2010 ఏప్రిల్ 23న విడుదలైంది. విడుదలయ్యాక ఈ సినిమా 2010లో తెలుగు సినిమా యొక్క అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో ముఖేష్ రిషి చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్.సి.యం. రాజుకు 2011లో నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడుగా నంది అవార్డు వచ్చింది.'[2]
డార్లింగ్ (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కరుణాకరన్ |
---|---|
నిర్మాణం | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | ప్రభాస్ రాజు, కాజల్ అగర్వాల్ ,శ్రీనివాస్ రెడ్డి |
సంగీతం | జి.వి.ప్రకాష్ కుమార్ |
కూర్పు | కె. వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి |
భాష | తెలుగు |
పెట్టుబడి | 18 కోట్లు |
కథ
మార్చు1980లలో ఒక స్నేహితుల గుంపు ప్రతి పదేళ్ళకొకసారి కలిసి సంతోషంగా గడపాలనుకుంటాౠ. వీరిలో ఒకరు హనుమంత రావు (ప్రభు గణేశన్) మరియూ ఇంకొకరు విశ్వనాథ్ (ఆహుతి ప్రసాద్). హనుమంత రావు కొడుకు ప్రభాస్ లేక ప్రభా, విశ్వనాథ్ కూతురు నందిని స్నేహితులు. తమ జీవితలక్ష్యాలను సాధించడానికి, విశ్వనాథ్ తన కూతురితో కలిసి స్విట్జర్లాండ్ వెళితే హనుమంథ రావు ఇండియాలో న్యాయవాదిగా స్థిరపడతాడు. దీనితో ప్రభా, నందిని చిన్నప్పుడే విడిపోతారు. కొన్నాళ్ళకు, మళ్ళీ ఈ స్నేహితుల గుంపు రీ యూనియన్ ప్రోగ్రాం వేసుకుంటారు. ప్రభా (ప్రభాస్) తను ప్రాణంగా ప్రేమించిన నందిని (కాజల్ అగర్వాల్)ని కలవాలనుకుంటాడు. కానీ ప్రభా స్నేహితురాలు నిషా (శ్రద్ధా దాస్) తన ప్రేమను ప్రభా ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం చేస్తుంది. దీనితో ప్రభాని, తన స్నేహితులని చంపాలని నిషా తండ్రి (ముకేష్ రిషి) ప్రయత్నించినప్పుడు తప్పించుకోవడం కోసం తనకి, నందినికి మధ్య జరిగిన ఒక ఊహాజనిత ప్రేమకథను చెప్తాడు. ఆ కథ ప్రకారం స్విట్జర్లాండులో ప్రభ నందినిని ప్రేమించినా తన తండ్రి మీద ఒట్టు వెయ్యడం వల్ల నందినికి ఈ విషయం చెప్పలేకపోతాడు. నందిని తనని ప్రెమిస్తున్నాని చెప్పేలోపు నందినికి కారు ప్రమాదంలో కోమాలో ఉందని, తను కోమా నుంచి బయటపడే క్షణంకోసం ఎదురుచూస్తున్నానని చెప్తాడు. మనసు కరిగి నిషా తండ్రి వాళ్ళందరినీ వదిలేస్తాడు.
బుచ్చయ్య (చంద్ర మోహన్) ఇంట్లో రీ యూనియన్ ప్రోగ్రాం భాగంగా హనుమంత రావు, విశ్వనాథ్ సహా స్నేహితులందరూ చేరుకుంటారు. అక్కడే నందినిని చూసిన ప్రభా తనని మెప్పించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ నందిని తమ్ముడి వల్ల అవన్నీ మట్టిలో కలిసిపోతుంటాయి. సరిగ్గా ఈ సమయంలో రిషి (సంతోష్) అప్పల రాజు (ఎం. ఎస్. నారాయణ) కొడుకుగా చేరి నందినికి స్నేహితుడౌతాడు. నందిని ప్రేమను గెలవాలన్న కోరిక రిషి, ప్రభాలను శత్రువులుగా మారుస్తుంది. ఓరోజు బుచ్చయ్య కూతురు ప్రసన్న తన ప్రేమ విషయం తన తండ్రికి అర్థమయ్యేలా చెప్పమని తన ప్రేమ వివాహానికి 50 లక్షల కట్నం ఇవ్వాలని, అప్పుడే తన పెళ్ళి జరుగుతుందని ప్రభా ముందు మొరపెట్టుకుంటుంది. ప్రభా కూడా 50 లక్షలకు ఈ ఇంటిని అమ్మితే బుచ్చయ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. ఐనా మాట వినని ప్రసన్న గోల భరించలేక బుచ్చయ్యతో ఈ విషయం చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇల్లమ్మేద్దామని ప్రయత్నించిన బుచ్చయ్యను ఆపి తన పాత స్నేహితులైన హనుమంత రావు, విశ్వనాథ్, అప్పల రాజు మొదలగువారిచే ధనసహాయం అందించేలా చేస్తాడు. ఇదంతా గమనించిన నందిని ప్రభాపై ఇష్టాన్ని పెంచుకుంటుంది.
ప్రభాతో నందిని చనువుగా ఉండటం భరించలేని రిషి, తన స్నేహితులు ప్రభా ఇస్త్రీ పెట్టె ప్లగ్గుని నీటిలో పెట్టి ప్రభాకి షాక్ ఇవ్వాలనుకుంటారు. ఇదంతా తెలియని హనుమంత రావు ఆ పెట్టెను ముట్టుకుని షాకుకు గురౌతాడు. దీనివల్ల రిషికి ప్రభాకి జరిగిన గొడవ కారణంగా హనుమంత రావు ప్రభాని ఇంటినుంచి గెంటేస్తాడు. కాని ప్రభా రిషి అప్పల రాజు కొడుకు కాదని, విశ్వనాథ్ మేనల్లుడని తెలుసుకుంటాడు. విశ్వనాథ్ తన తండ్రి (కోట శ్రీనివాసరావు) ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించి పెళ్ళిచేసుకోవడంతో తన తండ్రికి దూరమయ్యాడు. వారి మధ్య తగాదాని నిర్మూలించడానికి హనుమంత రావు ప్రయత్నిస్తాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత విశ్వనాథ్ తండ్రి రిషి, నందినిల పెళ్ళితో ఈ వైరాన్ని తగ్గించాలనుకుంటాడు. ఈ దిశగా హనుమంత రావు రిషిని అప్పల రాజు కొడుకుగా ఇంట్లోకి ప్రవేశించేలా చేశాడు. తన తండ్రి కోసం ప్రభా తన ప్రేమ విషయం నందినికి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటాడు. ప్రభా వెళ్ళిపోతుంటే నందిని తనని ఆపి తానొచ్చింది ప్రభాకోసమేనని, చిన్నప్పటినుంచీ ప్రేమించినా ప్రభా ప్రేమలో నిజాయితిని తెలుసుకోవాలని నాటకమాడానని, ఇక తన వల్ల కాదని తన ప్రేమ విషయాన్ని ప్రభాతో చెప్పేస్తుంది. తన తండ్రి పరువు కాపాడటం కోసం నందిని మనసు విరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిషా తండ్రి రిషి స్నేహితుల ద్వారా నిజం తెలుసుకుని ప్రభాని చంపాలనుకుంటాడు. నందిని కూడా ప్రభా మౌనం వెనుక కారణం తెలుసుకుని తన తండ్రి, తాతలను మరియూ హనుమంత రావును తమ పెళ్ళికి ఒప్పిస్తుంది. ప్రభా కళ్ళ ముందే నందినిని చంపాలనుకున్న నిషా తండ్రినుంచి నందినిని కాపాడిన ప్రభా ప్రేమను గుర్తించి నందిని కళ్ళలో కన్నీరు చూసాక నిష తండ్రి సంతోషంగా వారిద్దరినీ స్వేచ్ఛగా వదిలేస్తాడు. ప్రభా, నందిని ఒకరినొకరు కౌగిలించుకుని ఒకరితో ఒకరు కలిసిపోవడంతో ఈ కథ సుఖాంతమౌతుంది.
తారాగణం
మార్చు- ప్రభాస్ - ప్రభాస్ లేక ప్రభా
- కాజల్ అగర్వాల్ - నందిని
- శ్రద్ధా దాస్ - నిషా
- ప్రభు - హనుమంత రావు, ప్రభా తండ్రి
- ఎమ్.ఎస్.నారాయణ
- ముకేష్ రిషి - నిషా తండ్రి
- చంద్రమోహన్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కోట శ్రీనివాసరావు
- ఆహుతి ప్రసాద్
- శ్రీనివాస రెడ్డి
- తులసి
- చరణ్దీప్
పాటలజాబితా
మార్చు- హోసాహోరే , రచనఅనంత్ శ్రీరామ్ , గానం.కె.కె. లెస్లీలేవిస్
- ఇంకా ఏదో , రచన: అనంత్ శ్రీరామ్, గానం. సూరజ్ సంతోష్, ప్రశాంతిని
- నీ వేం , రచన: అనంత్ శ్రీరామ్, గానం.జీ.వి.ప్రకాష్ కుమార్
- బుల్లే నా తింగరి , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. మల్లికార్జున్ , ప్రియ హిమేష్,
- ప్రాణమా , రచన: అనంత్ శ్రీరామ్, గానం. రాహుల్ నంబియార్
- ఆకాశం కన్నా పైన , రచన: అనంత్ శ్రీరామ్, గానం. బెన్నీ దయాళ్ కోరస్
మూలాలు
మార్చు- ↑ హేమంత్. "డార్లింగ్ సినిమా సమీక్ష". 123telugu.com. 123telugu.com. Retrieved 12 October 2016.
- ↑ తెలుగువే2మూవీస్, న్యూస్ (5 August 2011). "Nandi Awards Winners List -2010". telugu.way2movies.com. Archived from the original on 22 డిసెంబరు 2013. Retrieved 29 February 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)