హేమా చౌదరి
హేమా చౌదరి (అక్టోబర్ 12, 1955) దక్షణభారత ప్రముఖ సినిమా నటి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 180 సినిమాల్లో నటించి ఉత్తమనటిగా గుర్తింపు పొందారు. దక్షిణాది ప్రముఖనటులు ఎన్.టి.రామారావు, కృష్ణ, రాజకుమార్, విష్ణువర్ధన్(నటుడు), కమల్ హాసన్, కృష్ణంరాజు, చంద్రమోహన్, అంబరీష్, చిరంజీవి, మోహన్ బాబు, ఎం.జి.సోమన్, ప్రేమ్ నజిర్, సుకుమారన్, రవిచంద్రన్ ఇలా మొదలైన నటులతో నటించి ప్రముఖనటిగా స్థిరపడ్డారు.
హేమా చౌదరి | |
జన్మ నామం | దుర్గ ప్రభా |
జననం | అక్టోబర్ 12, 1955 |
క్రియాశీలక సంవత్సరాలు | 1975నుండి |
పిల్లలు | పురోహిత్ కొండవీటి |
విశేషాలు
మార్చుఈమె అసలు పేరు దుర్గప్రభా. తెలుగునటి, దబ్బింగ్ ఆర్టిస్ట్ బృందావనం చౌదరి కుమార్తె. ఈ కాలం దంపతులు (1975) అనె తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1976లో పెళ్ళి కాని పెళ్ళి సినిమానుంచి హీరోయిన్ గా అవకాశలు వచ్చాయి. ఈమె దక్షిణ భారత సినిమాల్లో పెద్ద నటిగా పేరు తెచ్చుకుంది. దాదాపు 180కు పైగా చిత్రాల్లో నటించారు.[1][2] ఎం.ఆర్.విఠ్ఠల్, ఎ.భీమ సింగ్, కె.బాలచందర్, పుట్టణ్ణ కణగాల్, దొరై భగవాన్, డి.యోగానంద్, బి.ఎ.సుబ్బారావు, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల దర్శకత్వంలొ సటించారు హేమాచౌదరి.
పురస్కారాలు
మార్చు- సంతోషం జీవిత సాఫల్య పురస్కారం
- సువర్ణ రత్న పురస్కారం
- సువర్ణ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- ఇనోవేటివ్ ఫిలింస్ అవార్డు
- పనోరమా నాత్యతార అవార్డ్
- 82వ కన్నడ సాహిత్య సమ్మేళన పురస్కారం
నటించిన కొన్ని తెలుగు సినిమాల జాబితా
మార్చు- ఈ కాలం దంపతులు (1975)
- పెళ్ళి కాని పెళ్ళి (1976)
- మన్మథ లీల (1976)
- బంగారు మనిషి (1978)
- మంచిని పెంచాలి (1980 సినిమా)
- ప్రేమాయణం (1976)
- జరుగుతున్న కథ (1978)
- నిజం (1980 సినిమా)
- కొత్త అల్లుడు (1979)
- శ్రీ రాఘవేంద్ర వైభవం (1981)
- ప్రేమాలయం (1986)
- తాండ్ర పాపారాయుడు (1986)
- డిస్కో సామ్రాట్ (1989)
- సుందరకాండ (1992)
- ప్రేమవిజేత (1992)
- రాముడు కాదు రాక్షసుడు (1992)
- పుట్టింటికి రా చెల్లి (2003)
- గోరింటాకు (2008)
- మేస్త్రీ (2009)
మూలాలు
మార్చు- ↑ ఎడిటర్ (17 February 2016). "ఇంటర్వ్యూ". నవ్య వీక్లీ. 12 (50): 72-73. Archived from the original on 10 ఫిబ్రవరి 2016. Retrieved 10 February 2016.
- ↑ Dr.Seshagirirao. "Tollywood photo profiles". Tollywood photo profiles. Dr.Seshagirirao. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 10 February 2016.
పురస్కారాలు
మార్చు- 2015 సంతోషం జీవిత సాఫల్య పురస్కారం - దక్షణ భారత సినిపరిశ్రమకి సేవకోసం