తాడూరి శ్రీనివాస్

(తాడూరి శ్రీనివాస్‌ నుండి దారిమార్పు చెందింది)

తాడూరి శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ తొలి చైర్మన్ గా నియామకం అయ్యాడు.[1][2]

తాడూరి శ్రీనివాస్‌
తాడూరి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్


తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్
పదవీ కాలం
2017 - 2019
తరువాత నందికంటి శ్రీధర్

వ్యక్తిగత వివరాలు

జననం 2 ఫిబ్రవరి 1967
భువనగిరి
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి తాడూరి శ్రీలత
సంతానం ఉదయ్ కిరణ్ , సాయి కిరణ్
వృత్తి రాజకీయ నాయకుడు, న్యాయవాది

తాడూరి శ్రీనివాస్ 1967 ఫిబ్రవరి 2 లో జన్మించాడు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి. అయన తండ్రి ప్రభుత్వ ఉపాద్యాయుడు.

రాజకీయ జీవితం

మార్చు

విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆసక్తితో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టి.ఎన్.ఎస్.ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసాడు.లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్షంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ లో సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. ఎన్నికల సమయంలో వివిధ జిల్లాల పార్టీ ఇంచార్జి గా, ఉప్పల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. 2017 మార్చి 30న ఆయనను రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించాడు.[3] 2017లో ఆయనను మల్కాజ్‌గిరి, అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం, సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం, సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం లకు ఇంచార్జిగా పార్టీ నియమించింది. తాడూరి శ్రీనివాస్‌ 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[4]

తాడూరి శ్రీనివాస్ 2024 ఏప్రిల్ 05న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాడు.[5][6][7][8]

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, హోం తెలంగాణ తెలంగాణ ముఖ్యాంశాలు (31 March 2017). "ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్‌". www.andhrajyothy.com. Archived from the original on 16 September 2019. Retrieved 16 September 2019.
  2. ఆంధ్రభూమి, రాష్ట్రీయం (31 March 2017). "ఎంబిసి సంస్థ చైర్మన్ తాడూరి". www.andhrabhoomi.net. Archived from the original on 16 September 2019. Retrieved 16 September 2019.
  3. Suryaa. "బీసీ కులానికి ఫలాలు అందేలా పని చేస్తా: తాడూరి శ్రీనివాస్". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  4. Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  5. "బీఆర్ఎస్‌కు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రాజీనామా..! నేడో, రేపో బీజేపీలోకి". 5 April 2024. Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  6. Eenadu (5 April 2024). "భారాసకు తాడూరి శ్రీనివాస్‌ రాజీనామా". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  7. "బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్". 5 April 2024. Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  8. Andhrajyothy (5 April 2024). "లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.

బయటి లింకులు

మార్చు