తాత మనవడు (1996 సినిమా)

తాత మనవడు 1996 లో కె. సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణంరాజు, వినోద్ కుమార్, శారద, ఆమని, రంజిత ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.[1]

తాత మనవడు
దర్శకత్వంకె.సదాశివరావు
రచనపరుచూరి సోదరులు (కథ/మాటలు)
నిర్మాతడి. రామానాయుడు
నటవర్గంకృష్ణంరాజు
వినోద్ కుమార్
శారద
అమని
రంజిత
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1996 అక్టోబరు 25 (1996-10-25)
భాషతెలుగు

కథసవరించు

కాకాని కోటేశ్వరరావు ఇద్దరు కూతుర్లు మరణించి ఉంటారు. ఒక కూతురు వివాహ సమయానికి వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించడంతో ఊరి పెద్దలు అబ్బాయిని చంపేస్తారు. అమ్మాయి గర్భవతి కావడంతో బిడ్డకు జన్మనిచ్చే దాకా ఆగుతారు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి విషం తాగి మరణిస్తుంది. కోటేశ్వరరావు ఆమెకు పుట్టిన బిడ్డకు స్వాతి అని పేరు పెట్టి భార్య రాజ్యలక్ష్మికి తెలియకుండా అనాథాశ్రమంలో ఉంచుతాడు. మరో కూతురికి పుట్టిన జ్యోతి రాజ్యలక్ష్మి చేతిలో పెరిగి పెద్దదవుతుంది. రాజ్యలక్ష్మి తన కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించడం ఇష్టం లేదు కనుక స్వాతి గురించి ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడతాడు కోటేశ్వర రావు. రాజ్యలక్ష్మి తన మనవడు గోపీకి జ్యోతినిచ్చి పెళ్ళి చేయాలనుకుంటుంది. అదే సమయంలో స్వాతి పెద్దది కాబట్టి ఆమెను ఇచ్చి పెళ్ళి చేద్దామంటాడు కోటేశ్వరరావు. ఇద్దరి మధ్య వాదనలు పెరిగా విడిపోయే దాకా వెళుతుంది. గోపి మొదట స్వాతిని ఇష్టపడిగా జ్యోతికి క్యాన్సర్ అని తెలిసి జాలిపడి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. జ్యోతికి క్యాన్సర్ అనే విషయం ఎవరికీ చెప్పదు. ఒకవైపు కోటేశ్వరరావు, మరోవైపు రాజ్యలక్ష్మి తమకిచ్చినట్లు పెళ్ళి పత్రికలు ముద్రించుకుని పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. జ్యోతి కొన్ని గంటల్లో తాను మరణించబోతుందని తెలుసుకుని తన కళ్ళెదురుగా గోపీకి, స్వాతికి పెళ్ళి చేయమని కోరడంతో కథ ముగుస్తుంది.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

ఈ చిత్రం చిత్రీకరణ 1996 జులై 3 న హైదరాబాదులో ప్రారంభమైంది.[1]

పాటలుసవరించు

ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించగా చంద్రబోస్, జొన్నవిత్తుల, జలదంకి సుధాకర్ పాటలు రాశారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 యు, వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 227.[permanent dead link]