తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2005

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది.

రెండవ తెలంగాణా ఉద్యమ ప్రస్థానం
2001 - 2002 - 2003
2004 - 2005 - 2006

తెలంగాణా ------- ఉద్యమం

కె సి ఆర్‌ - నరేంద్ర - జయశంకర్‌

ఆగస్టు మార్చు

ఆగష్టు 31: ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి Y S రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ఇలా అన్నారు.. "తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రత్యేక రాష్ట్ర నినాదం మెల్లమెల్లగా సద్దుమణుగుతోంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తినపుడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి, సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ద్వారా సమస్యను పరిష్కరించింది. అయితే గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో మళ్లీ ప్రత్యేక నినాదం తలెత్తింది. జలయజ్ఞంలో భాగంగా రూ.25 వేల కోట్లతో మేం చేపడుతున్న ప్రాజెక్టులు, ఇతర ఉపాధి కార్యక్రమాలతో ప్రత్యేక నినాదం ఇప్పుడు కనుమరుగవుతోంది."

సెప్టెంబర్‌ మార్చు

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో సెప్టెంబరు 2005 ఒక చారిత్రాత్మకమైన నెల. ఈ నెలలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఇవి:

  • తెలంగాణా వాదన తెరమరుగవుతున్నదంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య, దానిపై పార్టీలో అలజడి.
  • కె సి ఆర్ విరసం నేతలను జైలులో కలవడం
  • తెలంగాణా జాగరణ సేన ఏర్పాటు
  • కె సి ఆర్, నరేంద్రలపై కేంద్రానికి ఇంటిలిజెన్స్ పంపిన నివేదిక
  • పురపాలక ఎన్నికలలో కాంగ్రెసు ఘనవిజయం, తెరాస ఘోరమైన ఓటమి
  • ఎన్నికలలో ఓటమిపై పార్టీలో నిరసనలు, అధినాయకత్వంపై ఆరోపణలు

ఆగష్టు 31 న ముఖ్యమంత్రి ఢిల్లీలో "తెలంగాణా వాదన తెరమరుగు అవుతున్నదం"టూ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల్లో అలజడి రేపింది. దానితో తెరాస కేంద్ర మంత్రివర్గం నుండి బయటికి వచ్చే ఆలోచనలు కూడా చేసింది. శరద్ పవార్ చెప్పిన మీదట ఆగామని వెల్లడించింది కూడా.

తరువాత కె సి ఆర్ హైదరాబాదు వచ్చి చంచల్‌గూడా జైలులో విరసం నేతలను కలుసుకున్నాడు. తెలంగాణా జాగరణ సేన ఏర్పాటు ఆయన చేతుల మీదుగా జరిగింది. సేన గురించి, దాని కార్యక్రమాల గురించి కె సి ఆర్, నరేంద్ర చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

నక్సల్ సమస్యపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తెరాసపై ఫిర్యాదు ఛెసినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. కాని ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చెయ్యలేదని, ఇంటిలిజెన్స్ నివేదికలో ఆ వివరాలు కేంద్రానికి చేరాయని తరువాత తెలిసింది

పురపాలక ఎన్నికలలో నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు తిట్లు సభ్యతా హద్ద్లు దాటాయి. ముఖ్యంగా నరేంద్ర కేశవరావు పై చేసిన వ్యాఖ్యలు, జాగరణ సేనకు చేసిన ఉద్బోధలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. పురపాలక ఎన్నికలలో కాంగ్రెసును ఓడిస్తామని తెరాస నాయకులు చెప్పిన మాటలు తిరగబడి, ఊహించని విధంగా తమకే ఎదురొచ్చాయి. ఎన్నికలలో ఎదురైన దారుణమైన ఓటమితో పార్టీ సీనియర్ నాయకుల్లో అసంతృప్తి బయటికి వచ్చింది. కె సి ఆర్ పత్రికలతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు.

https://healthtrendz.co/zenith-detox-reviews/ Archived 2019-05-15 at the Wayback Machine

అక్టోబర్‌ మార్చు

పురపాలక ఎన్నికలలో ఎదురైన ఓటమి, తెరాసను ఆత్మరక్షణలోకి, అంతర్మథనంలోకి నెట్టింది. ఓటమి తరువాత పార్టీలో బయలుదేరిన అసంతృప్తి మందడి, దుగ్యాలలతో ఆగలేదు. కె.సి.ఆర్, నరేంద్రల వ్యవహార ధోరణిపై ఉన్న అసంతృప్తికి తోడు, పార్టీలో ఆధిపత్య పోరుకు సంబంధించి కూడా పత్రికలలో వార్తలు వచాయి.

నాయకులలోని అసంతృప్తిని తొలగించే దిశగా పార్టీ ప్రయత్నాలు చేసింది. ఏకపక్షంగా కార్యవర్గాన్ని రద్దు చెయ్యడమనేది, అసంతృప్తివాదుల ముఖ్య ఫిర్యాదు. అంచేత కార్యవర్గాన్ని విస్తరించే పని చేపట్టారు. ఈలోగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచే జి.వో.170 ఒక అవకాశంగా అందివచ్చింది. ఈ విషయమై శాసనసభలో ప్రభుత్వంపై పెద్దయెత్తున దాడి చేసారు. అంతేకాక, అక్టోబర్ 13 న పార్టీ ఒక ప్రకటన చేస్తూ, పోతిరెడ్డిపాడు జి.వోకు నిరసనగా అక్టోబర్ 17 న అన్ని తెలంగాణా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నల్గొండ జిల్లాలో గ్రామాల్లో రచ్చబండ పంచాయితీలు జరుపుతామని తెలిపింది. అయితే ఈలోగా మాజీమంత్రి సంతోష్ రెడ్డి రూపంలో పార్టీలో మరో ముసలం బయలుదేరింది.

అక్టోబర్ 14 న జరిగిన తొలి కార్యవర్గ సమావేశంలో, పార్టీలో ఎవరికి వారు మీడియాతో మాట్లాడరాదని, అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, ఆ అధికారాన్ని కె.సి.ఆర్ కు ఇస్తూ తీర్మానం చేసారు. ఈ సమావేశానికి సంతోష్ రెడ్డి హాజరు కాలేదు. అప్పటికే అసంతృప్తితో ఉన్న ఆయన తిరుగుబాటు గళమెత్తాడు. అక్టోబర్ 17 న ఒక ప్రకటన చేస్తూ, మీడియాతో ఎవరూ మాట్లాడొద్దనడం నియంతృత్వం, దీన్ని నేను సహించను, నన్ను సస్పెండ్ చేస్తే కె.సి.ఆర్ ను సవాలు చేస్తానంటూ ఎదురు తిరిగాడు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. 21 వ తేదీన పార్టీ సహచరులతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సంతోష్ రెడ్డి ప్రకటించాడు.

కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సంతోష్ రెడ్డిని సమర్ధిస్తూ, కె.సి.ఆర్ వ్యవహార శైలిని విమర్శించారు. మందడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణి, గీట్ల ముకుంద రెడ్డి, టి.జయప్రకాష్ రెడ్డి మొదలైఅన వారు కె.సి.ఆర్ ను విమర్శించిన వారిలో ఉన్నారు. ఎన్నో మంతనాలు జరిగాయి. సమావేశాన్ని నిర్వహణను మానేస్తే సస్పెన్షన్‌ను తొలగిస్తామని పార్టీ అధిష్ఠానం అంటే, ఆ ప్రశ్నే లేదని సంతోష్ రెడ్డి అనటం, ఇరువర్గాలూ పట్టుదలగా ఉండటంతో వివాదం పరిష్కారం కాలేదు.

అక్టోబర్ 24 న, తెరాసను చీల్చేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు, కె.వి.పి.రామచంద్ర రావు కుట్ర పన్నారని తెరాస శాసనసభ్యుడు కాశీపేట లింగయ్య ఆరోపించాడు. తరువాత కె.సి.ఆర్ కూడా దీన్ని ధ్రువపరుస్తూ, దీని విషయమై సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించాడు. కె.వి.పి ఈ ఆరోపణను ఖండించాడు.

ఇదిలా ఉండగా, సంతోష్ రెడ్డి గొడవలోపడి పోతిరెడ్డిపాడుపై తెలంగాణాలో తెరాస జరుప తలపెట్టిన ఉద్యమం వెనకపడిపోయింది. ఈ అంశంపై స్వయంగా పి.సి.సి. అధ్యక్షుడు కె.కేశవరావే నిర్సన వ్యక్తం చేయడం, ప్రభుత్వం దిగివచ్చి జి.వో.లో కొన్ని మార్పులు చేయడంతో సమస్య తీవ్రత అప్పటికి తగ్గినట్లు అనిపించింది.

నవంబర్‌ మార్చు

నవంబర్ నెలలో [[తెరాస]] సంక్షోభం అనేక మలుపులు తిరిగింది.

పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేసి, మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేసి, కలకలం రేపిన శనిగరం సంతోష్‌రెడ్డి హఠాత్తుగా నవంబర్ 12 న తిరిగి పార్టీలో చేరిపోయాడు. కె.సి.ఆర్ స్వయంగా సంతోష్‌రెడ్డి ఇంటికి వెళ్ళడం, ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడం, సంతోష్‌రెడ్డి బెట్టు చెయ్యకుండా, నాయకత్వంపై విశ్వాసం ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

అయితే మందాడి, దుగ్యాల ప్రభృతుల తిరుగుబాటు కొనసాగింది. సంతోష్‌రెడ్డి వ్యవహారం సుఖాంతమైన మర్నాడే - 13న - మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణి, కంభంపాటి లక్ష్మారెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, సోయం బాపూరావు, నారాయణరావు పటేల్, తూర్పు జయప్రకాష్‌రెడ్డి కలిసి నాయకత్వం లక్ష్యంగా 11 ప్రశ్నలతో ఒక లేఖను సంయుక్తంగా పత్రికలకు విడుదల చేసారు. దీంతో సంక్షోభం మరింత చిక్కబడింది.

నవంబర్ 15 న సోయం బాబూరావు ఒక సంచలనాత్మక ప్రకటన చేసాడు. తాను అసంతుష్టుణ్ణి కాననీ, పార్టీ అగ్రనాయకత్వం పనుపున ఒక కోవర్టులాగా వారితో కలిసి పనిచేసాననీ, నారాయణరావు పటేల్ తనకు డబ్బు ఇస్తామని ఆశ చూపారనీ, మందాడికి 30 లక్షలు ఇచ్చానని చెప్పాడనీ ఆరోపించాడు.

ఆలె నరేంద్రకూ అసంతుష్ట నేతలకూ మాటల యుద్ధం జరిగింది. సంక్షోభ నివారణకు కొందరు మేధావుల, ఎన్నారైల దౌత్యం కూడా జరిగినట్లు వార్తలు వచ్చయి. అయితే అవి ఫలించలేదు. పార్టీ వరంగల్లులో విస్తృత స్థాయి సమావేశంలో ప్రతినిధులు అసంతుష్ట నేతలపై విమర్శలు చేసారు. కె.సి.ఆర్ హాజరవని ఈ సభకు నరేంద్ర అధ్యక్షత వహించాడు. అసంతుష్టనేతలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. నరేంద్ర అసంతుష్ట నేతలను తిరిగి పార్టీలో చేరమని ఆహ్వానించాడు.

తమపై సమావేశంలో చేసిన విమర్శలు, దిష్టి బొమ్మలను తగలబెట్టడం వంటి చర్యలతో అసంతుష్ట నేతల వైఖరి దృఢపడింది. 21న మందాడి స్వయంగా నరేంద్ర వద్దకు వెళ్ళి చర్చలకు తన ఇంటికి రావలసిందిగా ఆయన్ను ఆహ్వానించాడు. చర్చల్లో అసంతుష్ట నేతలు తమ వైఖరిని తేటతెల్లం చేసారు. సంక్షోభ నివారణలో ఈ చర్చలు ముందడుగు వెయ్యలేదు.

ప్రస్తుత సంక్షోభానికి కె.సి.ఆర్ మేనల్లుడు హరీశ్‌రావే కారణమని ఆయన మరో మేనల్లుడు ఉమేశ్‌రావు 26న అరోపించాడు. వెనువెంటనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసారు.

22న జారిపడి కాలిఎముక విరిగి ఆపరేషను చేయించుకున్న కె.సి.ఆర్ ను ఢిల్లీ ఆసుపత్రిలో అసంతుష్ట నేతలు నవంబర్ 28న పరామర్శించారు. మరుసటి రోజునే - నవంబర్ 29న - కె.సి.ఆర్ కు వారు ఒక అల్టిమేటం జారీ చేస్తూ, డిసేంబర్ 1 నాటికి తమ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తమపై పార్టీ నాయకులచే చేయించిన ఆరోపణలు అవాస్తవమని ప్రకటించకపోతే ప్రజల్లోకి వెళతామంటూ తీవ్రమైన హెచ్చరిక చేసారు. నవంబర్ 30న కె.సి.ఆర్ ఒక ప్రకటన చేస్తూ, వారు లేవనెత్తిన అన్ని విషయాలనూ చరించడానికి సిద్ధమని, వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. సంక్షోభాన్ని అంతమొందించే దిశలో నాయకత్వం తీసుకున్న మొదటి సానుకూల చర్య ఇది.

డిసెంబర్‌ మార్చు

డిసెంబరు నెల తెలంగాణా ఉద్యమానికి ఒకింత స్తబ్దుగా గడిచింది. నవంబర్ 30న కెసీఅర్ చేసిన ప్రకటనను అసమ్మతి నేతలు స్వాగతించారు.ఓ పదిహేను రోజుల పాటు ప్రముఖ ప్రకటనలేమీ వెలువడలేదు. డిసెంబర్ 3 న కె.సి.ఆర్ పత్రికలపై పతాక స్థాయిలో ధ్వజమెత్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలంగాణా ఉద్యమానికి వక్రభాష్యం చెబుతున్నాయనీ, ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించాడు. తనకు కాలు పూర్తిగా నయమయి, నడవగలిగే స్థితి వచ్చాక, తెరాస పయనమెటో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో, జరగబోయే ప్రళయమెలా ఉంటుందో చూపిస్తానని అన్నాడు. మీడియా మీద నాకు గౌరవం ఉంది, ఇటువంటి వ్యతిరేక కథనాలు విరమించండి, నేను ప్రార్థిస్తున్నాను అని అన్నాడు.

డిసెంబర్ 17 న సి.పి.ఎం. పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలంగాణా పై చేసిన వ్యాఖ్యలతో మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. "ప్రత్యేక తెలంగాణపై ఏకాభిప్రాయం వ్యక్తంకావాలని కనీస ఉమ్మడి కార్యక్రమంలో పేర్కొన్నారు. దానికి మా ఆమోదం లేదు. అందువల్ల బిల్లు ప్రవేశపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా... ఓటింగ్ జరిగినా... ఏ దశలోనైనా సరే... దానిని మేం నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తాం" అని సీతారాం ఏచూరి హైదరాబాదులో స్పష్టం చేశాడు. HealthTrendz.[1]

దీనికి ప్రతిగా కె.సి.ఆర్ ఢిల్లీలో ఇలా అన్నాడు. "తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ప్రకటించడం ఏచూరి అవివేకమా? అహంభావమా? ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ సీపీఎం కార్యకర్తలు చచ్చినపేనుల్లా వింటూ పడి ఉంటారా? మేం త్వరలో తెలంగాణలోని ప్రతి సీపీఎం కార్యకర్త ఇంటికి వెళ్లి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణను కించపరిచే నాయకుల జెండాలను ఎందుకు మోయాలని ప్రశ్నిస్తాం. ఎవరి ప్రయోజనాల కోసం ఏచూరి తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు? అందుకు శాస్త్రీయ ప్రాతిపదిక ఏదైనా ఉందా? అనవసరమైన ప్రకటనలు మానుకోండి. లేదంటే చంద్రబాబును ఎలా మాయం చేశామో మిమ్మల్నీ అలా మాయం చేయక తప్పదు. మార్క్సిస్టులే కాదు ప్రపంచంలో ఏ శక్తీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేదు. ఈ దఫా తెలంగాణ ఏర్పడేవరకూ ఉద్యమిస్తాం. దీన్ని అడ్డుకోవాలనుకొనేవారు అగ్నిగుండంలో శలభాలైపోతారు." దీనిపై మరోసారి సి.పి.ఎం నాయకులు ప్రతిఒవిమర్శ చేసారు.

డిసెంబర్ 29 న కె.సి.ఆర్ ఒక కలకలం సృష్టించాడు. యు.పి.ఏలో ఒక ఒత్తిడి గ్రూపును తయారుచేసే దిశగా ఒక ప్రకటన చేసాడు. యు.పి.ఏ లోని కాంగ్రెసేతర, వామపక్షేతర పార్టీలన్నీ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఒక కన్వీనరును ఎనుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. తనకు మద్దతు ఉంటుందనుకున్న లాలూ, ఎన్.సి.పి దానిని తోసిపుచ్చడంతో ఆ ప్రయత్నం నీరుగారిపోయింది. ఈ ప్రయత్నాన్ని అసమ్మతివాదులు విమర్శించారు. పార్టీ పరువు పోయిందని వారు ప్రకటించారు.