తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2019

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు అందజేసే పురస్కారం.[1] గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.[2]

2019 పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో 14 కేటగిరీలకుగాను 21 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసింది.[3] వీరికి 2019, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో లక్ష రూపాయల నగదు పురస్కారంతో సత్కరించడం జరిగింది.[4][5] ఈ కార్యక్రమంలో సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మహిళా సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం. జగదీశ్వర్, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అలేఖ్య పుంజాల, కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డి తదితరులు పాల్గొని పురస్కారాలు అందజేశారు.[6]

పురస్కార గ్రహీతలు మార్చు

క్రమసంఖ్య పేరు స్వస్థలం రంగం ఇతర వివరాలు చిత్రమాలిక
1 డాక్టర్‌ రావి ప్రేమలత సాహిత్యం
2 తస్నీమ్‌ జోహెర్‌ సాహిత్యం (ఉర్దూ సాహిత్యం)
3 డాక్టర్‌ కె. రత్నశ్రీ నృత్యం (కూచిపూడి నృత్యకళాకారిణి)
4 సుత్రానే కీర్తిరాణి సంగీతం ( సితార్ కళాకారిణి)
5 శివమ్మ జానపద కళలు (శారద కథలు)
6 మోతం జంగమ్మ జానపద కళలు
7 ఆచార్య గీత చిత్రలేఖనం
8 పద్మాలయ ఆచార్య[7][8] హరికథ
9 జ్యోతి వలబోజు హైదరాబాద్‌ ఎంట్రప్రెన్యూర్/పుస్తక ప్రచురణ
10 మిథాలి రాజ్ క్రీడలు
11 బొడ్డపాటి ఐశ్వర్య రక్షణ సేవలు
12 జై భారతీ సాహసాలు
13 సాజిదా ఖాన్‌ ఆడియో ఇంజినీరింగ్‌
14 కమ్మరి సరస్వతి సామాజిక సేవలు
15 బెల్లం మాధవి సామాజిక సేవలు
16 అప్కా మల్లురమ సామాజిక సేవలు
17 కడప తుకాబాయి సామాజిక సేవలు
18 డాక్టర్‌ అమ్మ శ్రీదేవి[9] సామాజిక సేవలు
19 వంగ యశోదారాణి మహబూబ్‌నగర్ పాత్రికేయం (ప్రింట్ మీడియా)
20 రచన ముడుంబై రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట్ మండలం దుమాల పాత్రికేయం (ఎలక్ట్రానిక్ మీడియా)
21 సుద్దాల భారతీ సామాజిక గానం

ఇవికూడా చూడండి మార్చు

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017
  2. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2018
  3. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2020

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, జిందగీ (7 March 2017). "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 8 మార్చి 2019. Retrieved 8 March 2019.
  2. నమస్తే తెలంగాణ, జందగీ (7 March 2018). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Archived from the original on 8 మార్చి 2019. Retrieved 8 March 2019.
  3. ఈనాడు, తెలంగాణ. "ప్రతిభావంతులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు". www.eenadu.net. Archived from the original on 28 ఏప్రిల్ 2020. Retrieved 28 April 2020.
  4. వార్త (7 March 2019). "మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2019. Retrieved 8 March 2019.
  5. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2019). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Archived from the original on 8 మార్చి 2019. Retrieved 8 March 2019.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (9 March 2019). "మహిళల ఆలోచనలకు అండగా నిలువాలి". Archived from the original on 9 March 2019. Retrieved 9 March 2019.
  7. డైలీహంట్, నవ తెలంగాణ (22 January 2019). "జానపద కళలకు జీవం పోస్తూ..." Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.
  8. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 May 2016). "హరికథకు 'పద్మాలయ'". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-28. Retrieved 2019-03-13.