డా. రావి ప్రేమలత తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, పరిశోధకురాలు. గత మూడుదశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా అనేక అవార్డులు పొందింది.[1] 2019లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2]

రావి ప్రేమలత
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిఅధ్యాపకురాలు, సాహితీవేత్త, పరిశోధకురాలు,

జీవిత విశేషాలు మార్చు

ప్రేమలత, రావి రామిరెడ్డి, మనోరమ దంపతులకు యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, నాగిరెడ్డిపల్లె గ్రామంలో జన్మించింది. తండ్రి ఆర్‌ అండ్‌ బిలో ఇంజనీర్‌గా కాగా, తల్లి గృహిణి. భుననగిరిలో హైస్కూల్‌ విద్య చదివిన ప్రేమలత హైదరాబాదులోని రెడ్డి కాలేజీలో పియుసీ, వనితా మహావిద్యాలయలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎడ్‌, తెలుగు పిజీ పూర్తిచేసింది. 'తెలుగు పద సాహిత్యం పురాగాథలు' అంశంపై పిహెచ్‌డి చేసిన ఈవిడ రాంచంద్ర డిగ్రీ, పిజీ కాలేజీలో ముఫ్పై సంవత్సరాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసింది.

కుటుంబం మార్చు

డిగ్రీ చదువుతున్న సమయంలో అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేసే జె.వి. సత్యనారాయణరెడ్డితో వివాహం జరిగింది. వీరి కుమార్తె ప్రణీత అమెరికాలో డాక్టర్ వృత్తిలో ఉంటుంది.

సాహిత్య ప్రస్థానం మార్చు

చిన్నతనం నుండి పుస్తకాలు చదవడంపై ఆసక్తివున్న ప్రేమలత ఎక్కువగా మాలతీ చందూర్, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, శ్రీశ్రీ, సినారె మొదలైనవారి సాహిత్యం చదివేది. ఎం.ఏ చదువుతున్న సమయంలో వ్యాసాలు రాయడం ప్రారంభించిన ప్రేమలత 'స్రవంతి' పత్రికకోసం తన మొదటి వ్యాసాన్ని రాసింది. ఆ తరువాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలకోసం కూడా వ్యాసాలను రాసింది. ఆచార్య నాయని కృష్ణకుమారి పర్యవేక్షణలో పిహెచ్‌డి చేసిన ఈవిడ, జానపద సాహిత్యంలో అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది.

రచనలు మార్చు

  1. తెలుగు జానపదసాహిత్యం పురాగాథలు (1980)
  2. జానపద విజ్ఞాన పరిశీలనం (1990)
  3. తెలుగు స్త్రీల చిత్రలిపి (1991)
  4. జానపద విజ్ఞానంలో స్త్రీ (1996)
  5. వ్యాస లతిక (2002)
  6. ఫోక్ టేల్స్ ఆఫ్ సౌత్ ఇండియా - ఆంధ్ర ప్రదేశ్ (సంపాదకీయం, 2005)
  7. ఆలోకనం (2015)
  8. పాకాల యశోదరెడ్డి (2015)

పురస్కారాలు మార్చు

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2019 మార్చి 8[3][4]
  2. ఉత్తమ విమర్శ గ్రంథం 'వ్యాసలతిక'కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
  3. ఉత్తమ గ్రంథం ' తెలుగు స్త్రీల చిత్రలిపి' తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
  4. ఉత్తమ పరిశోధకురాలు తంగిరాల బహుమతి
  5. రచయిత పాకాల యశోదరెడ్డి స్మారక పురస్కారం
  6. వై. రంగనాయకమ్మ స్మారక పురస్కారం
  7. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (అలోకనం పుస్తకానికి)[5][6]
  8. ఉత్తమ అధ్యాపకురాలు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

మూలాలు మార్చు

  1. నవతెలంగాణ, మానవి (22 May 2019). "జానపద సాహిత్యంలో మహిళాస్వరం". NavaTelangana. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 4 September 2019.
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (9 March 2019). "మహిళల ఆలోచనలకు అండగా నిలువాలి". Archived from the original on 9 March 2019. Retrieved 4 September 2019.
  3. వార్త (7 March 2019). "మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2019. Retrieved 4 September 2019.
  4. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2019). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Archived from the original on 8 మార్చి 2019. Retrieved 4 September 2019.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  6. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.