తెలుగు పదాలు
karyamunu
పదాలలో రకాలు
మార్చువ్యుత్పత్తి పరంగా తెలుగు భాషలో పదాలు నాలుగు రకాలు. అవి:
- తత్సమము: ప్రాకృత (సంస్కృత) పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అనికూడా అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
- తద్భవము: సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అనికూడా అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
- దేశ్యము: తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
- అన్యదేశ్యము: ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.
భాషాభాగాలు
మార్చుతెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -
- నామవాచకము: మానవుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరళ నాలుగు విధములు. అవి
- సర్వనామము: నామవాచకమునకు బదులుగా వాడబడేది. (ఇది పాశ్చాత్యుల నిర్వచనం)
సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము.ఉదా: నీవు, ఆమె, అతడు.
- విశేషణములు: నామవాచకము, సర్వనామముల గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
- అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
- క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అంటారు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.
- సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఉదా: మధు బడికి వెళ్ళెను.
- అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
- సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.
- అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.
ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.
నానార్థాలు
మార్చుపదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని నానార్థాలు అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.
- క్రియ: పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
- లావు: బలము, సమర్థత, గొప్పతనము
- పృథ్వి: భూమి, విరియునది, ఇంగువచెట్టు, సముద్రతీరము
- బంధం: ముడి, కలయిక, కట్టివేత
మూలాలు
మార్చుఉపయుక్త గ్రంథాలు
మార్చు- తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.